S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

12/04/2018 - 19:09

ఈ పాత్రలనూ, వీటితోపాటు పల్లెలోని ఇతర ప్రజలనూ కలిపి, సంఘటనలతో పేర్చి అపురూప కథాహారంగా పేర్చుతారు కృష్ణారావు గారు. ధర్మం వ్యక్తిగతమా, సామాజికమా అనే ప్రశ్నను కథాగమనంలో పదే పదే లేవనెత్తుతారు కృష్ణారావుగారు.

12/03/2018 - 19:07

కేవలం పేదలమీది కనికరంతో మిల్లులో పనిచేసేవారందరికీ వీలైనన్ని సౌకర్యాలు కల్పిస్తాడు. చంద్రశేఖరానికి గొప్ప ఆదర్శాలైతే వున్నాయిగానీ, వ్యాపార విషయాల్లో అతడికి అనుభవంగానీ, జ్ఞానం గానీ శూన్యం. ఫలితంగా మిల్లు నష్టాల్లో కూరుకుపోతుంది. మరోప్రక్క పనివాళ్లు జీతాలూ, సౌకర్యాలూ పెంచాలని ఒత్తిడి చేస్తుంటారు.

12/02/2018 - 22:00

భారతదేశంలో ఇంగ్లీషును బోధనా భాషగా నాటి బ్రిటీష్ పాలకులు ఏ కారణాల వల్ల ప్రవేశపెట్టినప్పటికీ, దాని మూలంగా కొన్ని మేళ్లు కూడా జరిగాయని ఒప్పుకోక తప్పదు. సాహిత్య రంగంలో నూతన ప్రక్రియలు పాశ్చాత్య ప్రభావం చేత ఆవిర్భవించటం అటువంటిదే. నవల అనే సాహితీ ప్రక్రియలు ఇలానే మనకి లభ్యమైంది.

11/30/2018 - 18:51

సుభతో, కన్నకూతురు లక్ష్మితో ఈమెకున్నది స్నేహ బాంధవ్యం. పిల్లల స్నేహితులు ఆమెకు కూడా స్నేహితులు. శాంతం మంచి ప్రజాతంత్రవాది. డెమోక్రాట్ అన్న పదం పూర్తి అర్థంలో శాంతంకు అన్వయిస్తుంది. ఒక పాత్రను ప్రజాతంత్ర స్వభావంతో రూపొందించటమనేది తెలుగు సాహిత్యంలో అరుదైన విషయం. ఒక స్ర్తి పాత్రనలా చూపటం మరీ అరుదు. శాంతం పాత్ర ఔన్నత్యాన్ని చెప్పటానికి లక్ష్మణరావుగారు కల్పించిన అత్యద్భుత సన్నివేశం ఒకటుంది.

11/29/2018 - 19:21

శాంతం పెంపుడు కూతురు సుభ జనార్దనాన్ని ప్రేమిస్తుంది. ఐతే ఆమె తనకు తటస్థపడిన మిగిలిన పురుష స్నేహితులను గురించి కూడా ఆలోచిస్తుంది. మామూలుగా రచయితలు స్ర్తిల ప్రేమను ఈ రకంగా ఎప్పుడూ చిత్రించరు. కథానాయిక నాయకుడెదురయ్యేవరకూ మగపురుగుని కూడా కనెత్తి చూడదు. కథానాయకుడెదురయ్యాక ఒక్క క్షణం కూడా ఆలోచించదు. తాను అతనిదానే్ననని తేల్చేసుకుంటుంది.

11/28/2018 - 19:43

లోకంలో మంచి రచయితలూ ఉంటారు. గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనుషులూ ఉంటారు. కానీ మంచి రచయితగా, గొప్ప వ్యక్తీ ఒకరే కావటం చాలా అరుదుగా జరిగే విషయం. అటువంటి అరుదైన మనిషి ఉప్పల లక్ష్మణరావుగారు. అరుదైన రచన అతడు - ఆమె. ఆయన రచనలు ఆయన వ్యక్తిత్వంలో ఒక భాగం. ఆయన రచనల సారాంశమే ఆయన వ్యక్తిత్వం.

11/28/2018 - 03:38

ఈ సంఘటనను పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. కొమురయ్య హత్య వార్త నిజాం రాజ్యంలో జరుగుతున్న దౌర్జన్యాలను ఇతర ప్రాంతాలవారికి స్పష్టంగా తెలియజేసింది. దొడ్డి కొమురయ్య మరణంతో తెలంగాణ పోరాటం ప్రారంభమైనదని తలచవచ్చు. 1951 అక్టోబరు 21న కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని విరమించటంతో ఈ పోరాటం ముగిసింది.

11/27/2018 - 19:17

నర్సిరెడ్డి ఇంటికి చేరుకొని చెల్లికి జరిగిన అవమానానికి కుమిలిపోయాడు. ఇత్తడి కడవ కూడా ఎత్తుకుపోయారని తెలిసి ఆందోళన చెందాడు. ఎలాగైనా కడవను తిరిగి తెచ్చుకోవాలని రాత్రిపూట గడీకి వెళ్లాడు. అందరూ నిద్రలో ఉండగా కడవ చేత బుచ్చుకుని వస్తూ, దొంగతనం చేస్తున్నానన్న గాభరాలో కడవను జారవిడిచాడు. ఆ చప్పుడుకు మేల్కొన్న దొర మనుషులు నర్సిరెడ్డిని పట్టుకోజూచారు.

11/26/2018 - 19:18

శ్రీ సుంకర సత్యనారాయణ, శ్రీ వాసిరెడ్డ్భిస్కరరావు రచించిన మాభూమి, ముందడుగు నాటకాలు భూమి సమస్యను, రైతుల కష్టాలను కళ్లకు కట్టించాయి.
‘తెలంగాణ విమోచనోద్యమం- తెలుగు నవలపై పరిశోధన చేసి సిద్ధాంత వ్యాసం రచించిన వరవరరావుగారన్నట్లు ‘‘తెలుగు సాహిత్యమే గర్వించదగిన నవలా సాహిత్యాన్ని తెలంగాణ రైతాంగ పోరాటం సృష్టించింది. ఈ విధమైన నవలలన్నిటికీ మార్గదర్శమైనది మృత్యుంజయులు.

11/23/2018 - 18:32

తెలంగాణలో కుతుబ్షాహి సుల్తానుల తర్వాత అసఫ్జాహీల పరిపాలనలో దాదాపు రెండు వందల సంవత్సరాలపాటు ఆంధ్ర సంస్కృతి అణగారిపోయింది. నిజాం పరగణాలో అత్యధిక సంఖ్యాకులైన ప్రజలు ఆంధ్రులే అయినా ఆంధ్ర భాషకు గౌరవం లేకపోయింది. (1951 లెక్కల ప్రకారం తెలంగాణలో తెలుగు మాట్లాడే ప్రజల సంఖ్య 90 లక్షలు. మరాఠీ మాట్లాడేవారి సంఖ్య దాదాపు 45 లక్షలు. కన్నడం మాట్లడేవారు 20 లక్షలు. ఉర్దూ మాట్లాడేవారు 21 లక్షలు.

Pages