S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

06/14/2019 - 20:02

విశ్వనాథకు అలాంటి శీర్షికాస్థానం ఇవ్వకపోయినా ఉపేక్షించడంవల్ల మాత్రం కాదని గ్రహించాలి మనం. కొడాలి, పఠాభి శ్రీపాద వ్యాసరాజ్యంలో ప్రత్యేక పీఠాల అలంకరించారు.

06/13/2019 - 18:41

తిరుపతి కవుల రచన ప్రాచీన కవిత్వంమీద తిరుగుబాటు అనడంకంటే.. తిరుగమూత అనడం ఎక్కువ నిజమేమో అనిపిస్తుంది నాకు. (172 పే) అని చెప్పడంతో శ్రీపాద ఎంత వివేచనాపరులో అనిపిస్తుంది మనకి.

06/12/2019 - 19:53

1947 నాటికే భావకవిత్వం తప్పయిపోయింది. అభ్యుదయ కవిత్వం నీడలే అంతటాను. అక్కడిదాకా టూకీగా చెప్పుకుంటూ పోయి, నిలబడిపోతూ కళలైనా కవిత్వమైనా ప్రచారం కోసమా? పాఠకుల్ని పట్టుకుని దారిచూపడానికా? అని ప్రశ్నించి వదిలేశారు. భావకవుల్లోని గూఢతనీ అభ్యుదయ కవుల్లోని వాచ్యతనీ ప్రశ్నించారు. ఇలా సూత్రీకరించారు చివరికి. కళలేని శుష్క ప్రచారంకంటే ప్రబోధములేని కళ ఉత్తమము. అయితే కళారీతుల్ని అభ్యుదయాకాంక్ష..

06/11/2019 - 19:17

కాలాన్ని కత్తిరించుకుంటే చరిత్ర కాంచనమై గుబాళిస్తుంది. కత్తిరించడమే తెలియాలి. కాలాన్ని శతాబ్దాలుగా కాకుండా అర్ధశతాబ్దంగా కూడా తీసుకుని ఏదైనా చరిత్రని రాసుకోవచ్చు. అర్ధశతాబ్దం ఎక్కడ్నించి ఎక్కడిదాకా? అదీ తెలుసుకోవాలి!

06/10/2019 - 20:10

జానపదుల భాషలో ఉండే నానుడులు, సామెతలు, జాతీయాలు మొదలైన వాటిని తెలిపారు. జానపద గేయాల్లో ప్రసక్తమైన జానపదుల ఆచార వ్యవహారాలు, వృత్తులు, కళలు, వినోద విజ్ఞానాలను గూర్చి వివరించారు. జానపద గేయాలలో సంగీతపు వరుసల్ని గూర్చి పరిశీలించారు.

06/09/2019 - 23:07

జానపదుల హాస్యం నిష్కల్మషమైనది. వరస పాటలు పాడుకోవటం వారికి సరదా. కష్టాల్ని మర్చిపోవటానికి హాయిగా నవ్వుకోవటం వారికి అలవాటు. రామరాజుగారు సీత గడియపాటలో, ఊర్మిళాదేవి నిద్రపాటలో, శ్రీరామ పట్ట్భాషేకము పాటలో ఉత్తమ శ్రేణికి చెందిన హార్యం కనిపిస్తుందని చెప్పారు. లక్ష్మీ పార్వతుల సంవాదం అనే పాటలో చక్కని హాస్యం ఉందని వివరిస్తూ-
లక్ష్మి:గౌరీదేవి నీ శంభుని గళమున నలుపేమిటి ఓయమ్మా నలుపేమిటి ఓయమ్మా

06/07/2019 - 19:11

ముఖ్యంగా పిల్లలు ఇలాంటి విషయాలపట్ల ఉత్సుకతను ప్రదర్శిస్తారు. జానపద గేయాల్లో, కథల్లో దేవతలుగాని, మంత్రదండంగానీ, పావుకోళ్ళు గానీ, సంచిగానీ, భూతద్దంగానీ ప్రముఖ పాత్ర వహించటం జరుగుతుంది. వీటి అద్భుతాలు ప్రజల్ని బాగా ఆకట్టుకుంటాయి. అద్భుత కథల్లో బాగా ప్రచారం పొందిన కథ బాలనాగమ్మ కథ. దీనితోపాటు గాంధారి కథ, కాంభోజరాజ కథ మొదలైనవి కూడా అద్భుత రసాత్మకాలని తెలిపారు.

06/06/2019 - 19:37

జానపద గేయాల్లో ప్రముఖ స్థానం ఆక్రమించుకొనేవి శ్రామిక గేయాలు. జానపదులు శ్రమించేటప్పుడు తమ కష్టాల్ని, శారీరక శ్రమల్ని మర్చిపోవటానికి అప్రయత్నంగా కూనిరాగాలు తీస్తారు. ఆ రాగాలతో కూడిన మాటలే జానపద గేయాలుగా పరిణమిస్తాయి.

06/05/2019 - 20:20

శాంత కల్యాణం, సుందరకాండ, అంగద రాయబారం, లక్ష్మణమూర్ఛ, ఊర్మిళాదేవి నిద్ర, లక్ష్మణ దేవర నవ్వు, శ్రీరామ పట్ట్భాషేకం మొదలైన అంశాలతోప్రత్యేక గేయాలున్నాయి. లక్ష్మణ దేవర నవ్వులో నిద్రాదేవిని గూర్చి రామునికి వివరిస్తూ లక్ష్మణుడు-
మాయన్న రఘుపతికి మా వదినకూనూ
ఈ పర్ణశాలకు తాను కాపనెనూ
పోపొమ్మయోధ్యాపురీ నగరకువేగా
ధవుని బాసీనట్టి సతియుండ తగదూ
రాత్రియను పవలును లేవకుండగనూ

06/04/2019 - 19:48

జానపద గేయ సాహిత్య పరిశోధనలో చెప్పుకోదగిన కృషి చేసినవారిలో తానే ప్రథముడనని రామరాజుగారు చెప్పుకొన్న విషయం అక్షర సత్యం.

Pages