S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

11/09/2018 - 19:04

కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు రచించిన విశిష్టమైన నవల వేయిపడగలు. విశ్వనాథవారి శతజయంతి దేశమంతటా సాహిత్యోత్సవాలుగా చేసుకోవటం జరిగింది. వారు 1895 సెప్టెంబరు 10వ తేదీ మన్మధనామ సం. భాద్రపద బహుళ షష్టినాడు పుట్టారు. బందరులో ఈ నవలను 1934లో సరిగ్గా 29 రోజుల్లో వారు డిక్టేట్ చేస్తుంటే తమ్ముడు వెంకటేశ్వర్లు వ్రాశారు. ఆనాడు ఆంధ్రా యూనివర్సిటీవారు ప్రకటించిన పోటీకై వ్రాయబడి బహుమతినందుకొన్న గ్రంథమిది.

11/08/2018 - 20:26

కారణజన్ముడూ, కర్మయోగి ఐన మహాత్ముని పిలుపునందుకొని ఓబయ్య వంటి దేబయ్యలు కూడా జాతీయోద్యమంలో పాల్గొన్నారంటే ఇక నిజమైన దేశభక్తుల విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. గాంధీ ఉద్యమ ప్రభావం అంతటిది. ఆ మహోద్యమాన్ని ప్రథమతః అక్షరబద్ధం చేసిన జాతీయ కవి శివరామశాస్ర్తీగారు.

11/06/2018 - 19:48

అల్లుడి జపం వగైరా కళలు చూసి సోమమ్మ సిగ్గుచేత, కోపం చేత, క్షోభం చేత తుకతుకలాడిపోయింది. మనుకుడుపులు అయిపోయినాయి.

11/05/2018 - 19:19

శతావధాని వేలూరి శివరామశాస్ర్తీగారి వంటి ఉద్దండ పండితులూ- బహు శాస్త్ర నిష్ణాతులు నవలా రచనకు పూనుకోవడం ఆ సాహిత్య ప్రక్రియకే గౌరవం తెచ్చిపెట్టిందని విమర్శకుల అభిప్రాయం! శివరామశాస్ర్తీగారి ఒక చేతితో స్వతంత్ర నవలలు సృష్టించారు. రెండో చేత్తో అనువాదాలు చేశారు.

11/04/2018 - 22:19

దేశయాత్రా విశేషాలు అన్న దానిలో అజంతా చిత్రకారులకు కాశీ పట్టణం లాంటిదని, ఉత్తర హిందూదేశ యాత్ర, భారతీయ ప్రాచీన నాగరికత, బృందావనము, ఆంధ్ర మహారాజ్య చిహ్నములు వీటన్నింటిలో తన గుండెలో కళాత్మకంగా పొందుపరచుకున్న చారిత్రక సత్యాలు, ఆంధ్రుల డాంబికాలు అన్న వాటిలో గ్రంథాలయోద్యమాలు మొదలైనవి.

11/02/2018 - 20:12

ఈ నవలలో చిత్రకళను గూర్చిన ముచ్చటలు ‘‘శోభన మందిరము’’, ‘ఆంధ్ర నవకవి సమితి’ అన్న శీర్షికలలలో వివరంగా చెప్పారాయన. శోభన మందిరంలో సయితం నందలాలు, ప్రమోదుకుమారు, అవనీంద్ర, దేవీప్రసాదరాయ, దామెర్ల వంటి ప్రముఖ చిత్రకారుల చిత్రాలతో అలంకరించారు.

11/01/2018 - 19:21

ఒంట్లో రక్తము లేక పాలిపోయి అదో మంచి మేలిమి బంగారు రంగని చెప్పుకుంటూ నాల్గడుగులు నడవలేని మన జమీందారు దద్దమ్మ కాడు’’ అని జమీందారు చేతనే పలికిస్తారు బాపిరాజు.

10/31/2018 - 19:16

నవాన్ విశేషాన్ లాతిగృహా తీతి నవల
ఈ ప్రక్రియలో ఎందరో రసజ్ఞులు తమ రచనా క్షేత్రంలో నవ వంగడాలు పండించి రాసులు పోశారు. మన జాతీయ పునరుజ్జీవనం కోసం బహు మార్గాలలో పునాదులు వేసుకునే రోజుల్లో బాపిరాజుగారి లేఖిని నుండి రుూ నారాయణరావు నవల ఆవిర్భవించింది. ఈ నవల నిజానికి సాంఘికమే అయినా ఇది గొప్ప చారిత్రక నవల అనుకోవడంలో న్యాయముందేమో!

10/30/2018 - 19:24

అతన్ని కాపాడిన ఆమెను చంపడానికి చేతులు రాక తనే పొడుచుకుంటాడు. ఒక సందర్భంలో రాజేశ్వరికి డెస్టిమోనా గుర్తు వచ్చిందంటాడు చలం.
మీరాకు రాజేశ్వరిపట్ల ప్రేమ- అమర్ అంటే ద్వేషం లేదు. కానీ తను ఆమెకి దగ్గరవడం అతనికి నచ్చదని తెలుసు. అందుకే అక్కడా ఇక్కడా పొంచి ఆమెను చూసుకుంటాడు. ఆమె కోసం హత్యానేరాన్ని తనమీద వేసుకోచూస్తాడు.

10/29/2018 - 22:17

ఆమె జీవితం నదిలో స్నానాలుగా- అమీర్‌తో క్షణం క్షణం అమర సుఖాలుగా జీవితం అంతా దివ్యస్వప్నంలా - ఆమెకి పూర్వం తన భర్తతో లేని స్నేహం- చొరవ అన్నీ అమర్ దగ్గర లభించాయి. ఆమె మెదడు- శరీరం- హృదయం అన్నీ మేల్కొన్నాయి. తనకు దివ్యస్వప్నమే- కాని ఆమెని తిరిగి తీసుకువెళ్లడానికి వచ్చిన మామయ్య - లోకానికి ప్రతినిధి అయిన మామయ్య దృష్టిలో మాత్రం రాజేశ్వరిది పశుకామం.

Pages