S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

03/21/2019 - 22:32

సి.పి.బ్రౌన్, సి.ఆర్.రెడ్డి ఈ ఇద్దరు మహనీయులు తమవైన పద్ధతులలో వేమన కవితను సాహితీ ప్రపంచంలో సుప్రతిష్ఠించారు. సి.పి.బ్రౌన్ వేమన పద్యాలు ఆంగ్లీకరించి, అంతర్జాతీయ పాఠకుల హస్తాలలో ఉంచితే, సి.ఆర్.రెడ్డి వేమనపై తెలుగు ఉపన్యాసాలు ఇప్పించి, ఆ ఉపన్యాసాలు పుస్తకరూపంలో ప్రచురించి సాక్షాత్తు తెలుగువారికి వేమన కవితను ఎలా ఆస్వాదించాలో నేర్పించారు.

03/20/2019 - 22:45

ఒక విషయాన్ని ప్రతిపాదించి, దానికి సూచించి తాను మొదట ప్రతిపాదించిన అంశాన్ని సిద్ధాంతీకరించటం ఈ భాష్య విధానంలోని విశేషం. అయితే, ఆయన ప్రవేశపెట్టిన ఈ విలక్షణమయిన భాష్య పద్ధతిని ఆ తరువాత ఎవరూ అందుకోకపోవటం, లేదా అందుకోలేకపోవటం వల్ల ఆయన విధానం అద్వితీయంగానే ఉండిపోయింది.

03/19/2019 - 22:22

చర్చల సందర్భంగా ఉమాకాన్తమ్‌గారు భారతీయ సాహిత్య శాస్ర్తియాంశాలనేకం, అనుభవ వివేచన పూర్వకంగా వివరించారు. పాశ్చాత్య వివేచకుల అభిప్రాయాలనూ పలుచోట్ల విస్తరించారు.

03/18/2019 - 19:00

ఇటీవల వెల్చేరు నారాయణరావుగారు తమ తెలుగులో కవితా విప్లవాలు గ్రంథంలో అవి జానపద స్థాయికి మించినవని నిరూపించటం, ఎంకిపాటల దుమారంలోనూ ఆ కాలంలో ఈ విషయాలు చర్చకు రావటం గమనిస్తే ఉమాకాన్తమ్‌గారి విశే్లషణ, నిరూపణలోని నిశితత్వం, ఔచిత్యం మనకు మరింత అవగాహనకు వస్తాయి.

03/17/2019 - 22:46

ఆ గ్రంథం వెలువడుతూనే తెలుగు కవితా లోకంలో అసాధారణమయిన సంచలనాన్ని సృష్టించింది. ఆనాటి భావ కవులు భావించిన తీరులో చెపితే ఆ గ్రంథంలో ఉమాకాన్తమ్‌గారు భావకవిత్వాన్ని చీల్చి చెండాడారు.

03/15/2019 - 19:37

అసలు ఈ కవిత్వ స్వభావమేమిటి? ఏనాటికయినా గర్వించదగిన భారతీయ నాగరికతా సంస్కృతుల వారసత్వం మనది. కాని, ఈ మహత్తరమయిన వారసత్వానికి, మన ఈ కవితా ప్రవృత్తి ఎంతవరకు అనుకూలంగా ఉంది? మన నిత్యజీవనంలో జీవిత లక్ష్యంతో ఈ కవితకువున్న సంబంధం ఎట్లాంటిది? జీవితంలోనూ, కవిత్వంలోనూ ఏవిధమయిన విలువలను మనం పాటిస్తున్నాము?

03/14/2019 - 18:57

ఆధునిక సాహిత్య విమర్శ ప్రస్థానంలో విప్లవాత్మకంగానూ తెలుగు సాహిత్య విమర్శను ఆరోగ్యకరమైన గొప్ప మలుపు తిప్పిన విమర్శ గ్రంథం అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరులు రచించిన నేటి కాలపు కవిత్వం.

03/13/2019 - 18:46

మార్పు తన్ను దాటి వెళ్లే మార్పుల్ని ఆమోదించలేడు. ఇది చాలామంది మేధావుల్లో కూడా వున్న బలహీనత. బహుశా ఈ బలహీనత రామలింగారెడ్డిగారిలో కూడా ఉందేమో!
కవిత్వతత్త్వ విచారం వచ్చిన కొత్తలో దానిమీద చాలా ప్రతి విమర్శలు వచ్చాయి. కాళ్ళూరి వ్యాసమూర్తి శాస్ర్తీగారూ, అక్కిరాజు ఉమాకాంతమ్ గారూ, నోరి నరసింహశాస్ర్తీగారూ ఆ గ్రంథంమీద విరుచుకుపడ్డారు.

03/12/2019 - 19:40

ఆ కాలంలోనే వచ్చిన భావకవిత్వం కాని, ఆ తరువాత వచ్చిన అభ్యుదయ కవిత్వం కాని రామలింగారెడ్డిగారిని బలంగా కదిలించలేకపోయింది. కన్యాశుల్కం గొప్పదనాన్ని గుర్తించటమూ, తృణకంకణం రాసిన రాయప్రోలును అభినందించటమైతే చేశారు కానీ ఆ ఉద్యమాల సారాన్ని పట్టుకోలేకపోయారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సుప్రసిద్ధ విమర్శకుడు రా.రా ఇలా అన్నారు.

03/11/2019 - 20:29

అందుచేతనే చాలామంది మన ప్రాచీన కవులు పాండిత్యాన్నీ, అలంకారికతనూ ఆశ్రయించారన్నది వారి సిద్ధాంతం. మితిమీరిన పాండిత్య ప్రదర్శనా, అలంకారికతా రసదృష్టికి ఎలా ఆటంకాలుగా నిలిచాయో రామలింగారెడ్డి ఈ గ్రంథంలో సోదాహరణంగా నిరూపించారు.

Pages