S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

02/14/2019 - 19:54

నెమ్మదిగా పులి సాహచర్యంతో ఈ దేశంలోని పెద్ద మనుష్యులకి, వ్యాపారస్తులకి కూడా ఆవుతలలు, పులి తోకలు నప్పాయి. ఎవరికీ అవి ఎబ్బెట్టుగా లేదు. అంచేత కథకుడు ఎవరన్నా మెడమీది మనిషి తలకాయ వున్నవాడు దొరుకుతాడేమో మాట్లాడదామని బయలుదేరడంతో కథ ముగుస్తుంది. వ్యాపార సంస్కృతిని ఈ కథ ఎద్దేవా చేస్తుంది.

02/13/2019 - 20:11

ఈ మాటలు ఒక హెచ్చరికనో, ప్రమాద సూచికనో, జాగురూకతనో తెలియచేయడానికి ఇలాంటి మాటలు తరచు గ్రామాల్లోనే, లేదు లౌడ్ స్పీకర్లో పట్టణాల్లోనో విన్పిస్తాయి. వాస్తవానికి నగ్నముని కథలు నగర జీవితానికి సంబంధించిన కథలు. అంచేత ఈ హెచ్చరిక ప్రమాద సూచికను ఎగురవేసే విధంగా వుంది. ఈ ఎజెండాలోని మాటలు ఒక రాబోయే విపత్తునో, సమీపించిన నెత్తిమీద పెనుముప్పునో తొలగించుకోమనో చెప్తున్నట్టుగా వున్నాయి.

02/12/2019 - 20:52

వాస్తవానికి ఏ మాత్రం భావ వ్యక్తీకరణకి మార్గం లేనపుడు, రచయిత తాను చెప్పదల్చుకున్న దృక్పథం చెప్పి తీరాలనే నిబద్ధత కల్గి వున్నపుడు సహజంగానే ప్రతీకలనీ, సంకేతాలనీ ఆశ్రయిస్తాడు. వ్యంగ్యం, కసి, క్రోధం ఆధారంగా చేసికొని పాత్రలని తలకిందులుగా ప్రవర్తింపజేసి - పాఠకులకి తత్కాలీన పరిస్థితుల్ని పరోక్ష పద్ధతిలో అర్థం చేసికొనే పరిస్థితుల్ని కల్పిస్తాడు.

02/11/2019 - 22:51

సామాజిక వ్యక్తికి తన సమాజాన్ని ఎదిరించి పోరాడటమో లేక తలవంచి కష్టాలు సహించటమో ఏకైక మార్గం.
జీవితం తలకిందులుగా నడుస్తున్నపుడు సాహిత్యదర్పణంలో జీవితం తలకిందులుగా కనబడి తీరాలి.

02/11/2019 - 22:47

కవుల కవితల్లో, ప్రయాణం వుంటుందని విమర్శకులందరూ అంగీకరిస్తారు. విలోమ కథల బీజంపై కవితలో స్పష్టంగా చూడొచ్చు. అదేవిధంగా విలోమ కథల్లో చీకటి వర్ణన చాలా అధిక శాతం కన్పిస్తుంది. అవి చీకటి రోజుల్ని సింబలైజ్ చేయటానికి చెప్పిన కథలు కనుక, రాజకీయ వాతావరణం ఆనాడు కన్పించిన అనేక పరిస్థితుల్ని నగ్నముని గ్రహణం కథలో వర్ణిస్తాడు.
‘‘సూర్యుడు చనిపోయాడో, బతికి వున్నాడో తెలీదు. అంతా గాఢాంధకారం’’’ అంటాడు.

02/08/2019 - 18:44

చరిత్ర సంస్కృతులపై అధ్యయనంపైనుంచి (ఎలైట్) కాక విలోమం (సబ్-ఆల్‌టెర్న్) నుంచి సాగుతోంది- ఇది వర్తమాన తెలుగు సాహిత్య ధోరణి.
ఈ ధోరణిలో దాదాపు రెండు దశాబ్దాలకు పూర్వం- కొత్త విలువల్లో, కొత్త విశ్వాసాల్తో, విశ్వవస్త్రం నేస్తానన్న నగ్నముని విలోమ కథలని ఆవిష్కరించారు.

02/07/2019 - 19:44

‘‘అంతా వొచ్చారా యింగా ఎవరన్నా పొదలమాటున వుండారా?’’ అన్నాడు బల్లకట్టు పాపయ్యగెడ మీన ఓరగా సూత్తా. ‘‘పొదల సోట్నేందయ్యావ్? సింత సచ్చినా పులుపు సావలేదంట. రుూ బల్లకట్టుపాపయ్యకు ఏళ్లు మిగులుతుందా సెతురు తగ్గటంలేదే? నవుతావు దేనికే నాగరత్తీ? మరి సూడమ్మారుూ పాపయ్యకు తెల్లారిందప్పుడే సెతురాడనూ’’ అంది ఎంకాయి పిన్నాం.

02/06/2019 - 20:22

షావుకారు భవనానికి రాళ్లెత్తినకూలీల కథ రాయి మడుసులు. కిష్ట ఒడ్డున నుండే నల్లరాయి కొండ తొలిచి భవంతి కట్టిన రాయి మడిసికి గృహప్రవేశం విందులో చోటుండదు. ఇంటికిపోయి తిండికి కూర్చుంటే బువ్వలోకి చల్లలేక దోపిడీ స్వరూపం చూపిస్తుంది.

02/05/2019 - 19:52

కష్టజీవుల పట్ల సానుభూతి ప్రకటించే అభ్యుదయ సాహిత్యం విరివిగా వస్తున్న కాలం అది. అందులో శ్రామిక వర్గ పక్షపాతం, స్పష్టంగా, స్థిరంగా కన్పించేది. అయితే అది స్థూలంగా ఒక అవుట్‌సైడర్ చూపించే సానుభూతే. మా గోఖలే ప్రత్యేకత ఏమిటంటే, అతను సమాజం అట్టడుగున సాటి రచయితలు తొంగిచూడని చీకటి బావుల్లోకి దిగి పూడిక తీశాడు.

02/04/2019 - 19:49

నువ్వు పల్లెటూళ్లో బీళ్లమ్మట, గట్లెమ్మటా గొడ్లు గాసుకునే బుడ్డోడివైతే, ఆరుదల చేలో కలుపుదీసే కూలీవైతే, దీపాల మాసరాత్రి మసి పువ్వొత్తి చేతబట్టి జుయ్‌మంటూ వీధులమ్మట పరిగెత్తే పిలగాడివైతే, తొలి కోడి కూయంగానే ఎడ్లబండి గట్టుకొని డొంక దారినబడి కుప్ప నూర్పిడికి బయలెల్లిన రైతువైతే, అన్నిటినీమించి నీవూరి నేలని గట్టిగా గుండెకి వాటేసుకోగలిగిన ప్రేమికుడివైతే మా గోఖలే కథలు చదివి పరవశించిపోతావు

Pages