S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి కథలు

08/22/2018 - 19:34

శే్వతాంబరధరేదేవి నానాలంకార భూషితే
జగస్థితే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే అంటూ శ్రావణ శుక్రవారాలు మహాలక్ష్మి దేవీ పూజను స్ర్తిలందరూ
ఆనందోత్సవాలతో జరుపుకొంటారు.

08/19/2018 - 23:07

శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ నరసింహస్వామి ఉత్తరాఖండ రాష్ట్రంలో హిమాలయ పర్వతాల సమీపాన చమోలి జిల్లాలో అలకానంద నదీ తీరాన నరసింహస్వామి కొలువై యున్నాడు. బదరీనాధ్ క్షేత్రానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో నరసింహస్వామి ఆలయం వుంది. ఈ ఆలయానికి కొంచెం దూరంలో ఒక సరస్సు వుంది. దీనిని దండధార తీర్థం అంటారు. ఈ తీర్థానికి దగ్గరలో శంకరమఠం వుంది.

08/15/2018 - 21:48

శుభాం హిరణ్య ప్రాకారం సముద్రతనయాం జయాం
నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్థలస్థితాం .... అంటూ లక్ష్మీదేవిని స్తుతించని వారు ఎవరూ ఉండరు. ఈశ్రావణమాసంలోప్రతివారు వరలక్ష్మీ దేవి పేరిట వైకుంఠనివాసిని పూజిస్తారు.

08/10/2018 - 19:35

లోకంలో ఎక్కడ చూసినా ‘మాకు అన్యాయం జరిగింది అంటే మాకు అన్యాయం జరిగింది. మమ్మల్ని మోసం చేశారు. మేం నష్టపోయాం. మేం మోసపోయాం. దేవుడు కూడా మాకు న్యాయం చేయలేదు. మాకు న్యాయం కావాలి’ అని న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. మా తమ్ముడు నన్ను మోసం చేశాడు. మా చెల్లెలు, అన్న, అత్త, కోడలు మోసం చేశారు. పనిచేసే స్థలంలో మోసపోయాం అని రకరకాల కేసులు వింటూ ఉంటాం.

08/09/2018 - 19:40

హిందువులకు పరమ పవిత్రమాసంగా భావించబడే మాసం శ్రావణం. ‘‘వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే, జగత: పితరం వందే పార్వతీపరమేశ్వరం ’’అని మహాకవి కాళిదాసు వాగర్థముల జ్ఞానానికై పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించాడు. వాగర్థములవలె కూడియున్న పార్వతీ పరమేశ్వరులు జగజ్జననీ జనకులు. ‘‘ఈశానాం సర్వ విజ్ఞానం’’. ఎల్లవిద్యలకు ఈశ్వరుడు పార్వతీ పతియే. అందుకే వేదం ‘ప్రథమో దైవ్యో భిషక్’ అని స్తుతిస్తున్నది.

07/23/2018 - 18:47

శ్రమశీలత, సాధువర్తనం సహనం, నియబద్ధ జీవనం, స్నేహశీలత, సకల సద్గుణాలను వ్యక్తిలో మూర్త్భీరింపజేసేది నిర్మల భక్తి! నిశ్చల మానసిక శక్తితోకూడిన భక్తి! దైవత్వ సిద్ధికి అలాంటి భక్తియే దారి! దానికి తార్కాణం రాముడు.కాని లోకంలో శివకేశవులకు భేదాలు చెప్పుకుంటూ మనుష్యులు తారతమ్యాలను సృష్టించుకుంటూ ఉంటున్నారు. శివకేశవులకు భేదం లేదు. వారిద్దరి మధ్య భేదం సృష్టించిన వారికి కీడు కలుగుక మానదు.

07/16/2018 - 19:12

ఈ లోకంలో ధర్మం కలకాలం నిలిచి వుండాలనీ, సత్యమార్గంలోనూ, న్యాయమార్గంలోనూ మానవులు జీవనయానం సాగించాలనీ ఎందరో మహానుభావులు తమవంతుగా శ్రమించి తరించారు. కలికాల మహిమా అన్నట్లుగా ఎక్కడ విన్నా, చూసినా బలవంతులైనవారు బలహీనులను దోచుకుంటున్నారనే అనిపిస్తుంది. కాసులున్నవాడికీ, కండబలం కలవాడికీ ఎదురులేకుండా పోతున్నది. వీటికి మూలకారణం మనిషికి తృప్తిలేకుండా పోవడమే.

07/16/2018 - 19:08

పూర్వాషాడ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాఢమాసంగా చెప్పబడింది. వర్షరుతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణలు విశేషఫలితాన్ని ఇస్తాయి. ఆషాఢంలో చేసే సముద్ర నదీ స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు. ఆషాఢమాసంలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయడం మంచి ఫలితాలనిస్తుంది. ఆషాఢమాసం లోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది.

07/16/2018 - 19:07

జగద్గురు శ్రీ ఆదిశంకరులు తమ వివేక చూడామణిలో ఆత్మ జ్ఞానమును గూర్చి చేసిన వివరణాత్మక సందేశంము అత్యంత అద్భుతము. అంతేకాదు అందరికీ ఆచరణీయ సులభం కూడా. మోక్షమన్నది యోగం వలనకాని, సాంఖ్యం లోన ఈశ్వర నిరీశ్వర యోగం వలన కాని లౌకిక పార లౌకిక విద్యవలన కాని సిద్ధించదు. దేహాత్మ భావన విడనాడి శుద్ధ చైతన్య బ్రహ్మమే ఆత్మయని అనుభవ పూర్వకంగా తెలిసి కొన్నవారికి మాత్రమే మోక్షము లభించగలదు.

07/13/2018 - 19:10

‘దొంగిలకూడదు’ - నిర్గమ 20:15.

Pages