S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి కథలు

06/05/2018 - 21:58

మోక్షమంటే పుణ్యం పాపం లేకపోవడమే కదా. అంటే మోక్షమనగా జన్మరాహిత్యమని అనాదినుండి వస్తున్న నానుడి.

05/25/2018 - 21:40

దేవుని మాట వినాలి. ఆయన ఆజ్ఞలను పాటించాలి.
‘నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును’ - ద్వితీయో 28:1

05/16/2018 - 21:17

మానవ జీవితంలో సుఖదుఃఖాలు చీకటి వెలుగులు. విజ్ఞులైన వారు రెండింటినీ సమానంగా స్వీకరిస్తారు. సుఖదుఃఖాది ద్వంద్వములనుండీ విడువడాలని ‘సమత్వం యోగముచ్యతే’ బుద్ధిమంతులైనవారు సుఖ దుఃఖాలు రెండింటినీ సమదృష్టితో చూస్తారని దానినే ఉత్తమ యోగముగా భావించాలనేది గీతాసందేశం. సారాంశం.

05/13/2018 - 21:28

వైశాఖ బహుళ దశమినాడు జన్మించిన ఆంజనేయుని స్మరించిన వారికి బుద్ధిబలం, సద్బుద్ధి, యశస్సు, ధైర్యం, ఆరోగ్యం, వాక్పటుత్వం లభిస్తాయి. హనుమంతుని జీవిత చరిత్రను ఆకళింపు చేసుకొన్నవారికి లోకం పోకడ తెలుస్తుంది. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. సత్యసంధత విలువ తెలుస్తుంది.

05/11/2018 - 21:33

ప్రతి జీవితంలో ఏదో ఒక కొదువ ఉంటుంది. ఏ కొదువ లేని జీవితానికి బైబిల్ గ్రంథం నుండి చిన్న చిట్కా.
యాకోబు 1:4: మీరు సంపూర్థులును ( complete)) అనుగాంగులు ను ( perfect)) ఏ విషయములోను కొదువ లేని వారునై యుండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి.
ఏ పని చేసినా perfect గా, complete గా చేయాలని మన అందరి ఆశ. నా కుటుంబము నా ఇల్లు, నా చదువు, నా పని అంతా perfect గా ఉండాలనుకొంటాము.

05/09/2018 - 21:37

హైందవ సంస్కృతిలో పెక్కు పండగలున్నాయి. అవి రుతుపర, మత ప్రమేయ, పురాణేతిహాస సంబంధమైనవి. అందు అసమాన భక్తాగ్రేసరుడు, ఆదర్శ పురుషుడు, నమ్మిన బంటు, సంస్కృతాద్యనేక భాషలు, వ్యాకరణాది శాస్త్రాలు, సంగీతాది కళలలో నిష్ణాతుడు, ఒక కల్పం అంటే నాలుగు వందల ముప్పయి రెండు మిలియన్ల సంవత్సరాలు జీవించే ఎనిమిది మంది చిరంజీవులలో ఒకరైన హనుమంతుని జయంతి ప్రత్యేకత కలిగి ఉంది.

05/07/2018 - 21:27

‘గురువు’ అంటేనే భారమైనది, గొప్పది అని అర్థం. గురువు శబ్దం మన అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తుంది. ఏళ్లనుండి కాదు కాదు జన్మలనుండి పిడచకట్టుకపోయిన మన అజ్ఞాన తిమిరాంధకారాన్ని తొలగించి, జ్ఞానజ్యోతిని వెలిగించే మహత్తర శక్తి గురువు.

05/06/2018 - 21:15

వివేకానందుడు రామకృష్ణ పరమహంస వద్దకు వచ్చినపుడు, అతడు అతిగా తర్కించేవాడిగా, నాస్తికుడిగా, హేతువాదిగా ఉండేవాడు. ప్రతిదానికీ రుజువును కోరేవాడు. రుజువులు లేని విషయాలు కొన్ని ఉంటాయి.. దైవత్వం ఎల్లెడలా ఉంది. అయితే దైవత్వానికి ఏ రుజువూ లేదు. అది రుజువు కాదు.. సత్యదర్శనం. ప్రేమకు ఏ రుజువూ లేదు- అయినా అది వుంది. సౌందర్యం చూసే కళ్ళల్లో ఉంటుంది. దానికి ఏ రుజువులూ ఉండవు.

05/04/2018 - 21:24

వేలంవెర్రిగా, ‘వెఱ్ఱి వేయి విధంబులు’ అన్నట్లుగా ఈ రోజు ఆధ్యాత్మిక మార్గం రంకెలు వేయడం విడ్డూరం. శాస్త్రం లేని ఆధ్యాత్మికత అహంకారానికి, ఆధ్యాత్మికత లేని శాస్త్రం అజ్ఞానానికి దారితీస్తుందన్న పెద్దల వాక్కు నిజమే. ఎందుకంటే దేవాలయంలో ఉన్న పూజారి ‘దేవుణ్ణి నేనే బ్రతికిస్తున్నాను’ అనుకోవడం ఎంత మూర్ఖత్వమో, మతాన్ని, జ్ఞానాన్ని నేనే ఔపోసన పట్టాను అనుకోవడం కూడా అంతకన్నా పొరపాటు.

05/02/2018 - 21:10

వాల్మీకి రామాయణాన్ని అనుసరిస్తూ వచ్చిన మనకు కొన్ని వందల రకాలైన రామాయణ కథనాలు కనిపిస్తాయి. సుమారుగా కొన్ని వేల రామాయణ కథలున్నాయ. ఒక్క సంస్కృతం లోనేకాక తెలుగు, హిందీ, మరాఠీ, వంగ, ఇటువంటి భాషల్లోనే కాదు విదేశాల్లో సైతం రామాయణ కథలున్నట్టు చరిత్ర చెబుతుంది. వీటినన్నింటిలోను కొద్దిగానో గొప్పగానో అవాల్మీకాంశాలు చోటుచేసుకొన్నాయ.

Pages