S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి కథలు

03/07/2018 - 21:06

కర్మ శబ్దము ‘కృ’ ధాతువు వలన నిష్పన్నమైనది. కావున దానికి ‘చేయుట’ అని కాని, ‘నడవడి’ యని కాని, ‘వ్యాపార’మని కాని అర్ధము. ప్రాచీన వైదిక ధర్మానుసారముగా యజ్ఞ యాగాదికములే కర్మలు. త్రేతాయుగం, ద్వాపర యుగాల్లాంటివి వాటిలో తపస్సు, ధ్యానం అనేవి చేస్తేనే భగవంతుడు మోక్షాన్ని ఇస్తాడని అనేవారు. కాని నేడు కలియుగంలో కేవలం నామజపం చేస్తే చాలు భగవంతుడు పాపరాశిని దగ్ధం చేస్తాడు. పుణ్యఫలాలనిస్తాడు.

03/07/2018 - 00:15

సాక్షాత్తూ పరమేశ్వరుని ఆయన వాహనం నందీశ్వరుడు, అమ్మవారి వాహనం సింహం వారిద్దరూ ఒకరిని వదలి ఒకరు ఉండరు. అసలు అర్థనారీశ్వరులు వారు. కాని వారి వాహనాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. పార్వతీదేవి గారాల పట్టి వినాయకుడు. ఆయన వాహనం మూషికము. కానీ పరమేశ్వరుని కంఠాభరణం అయిన నాగరాజుకి మూషికం ఆహారం!! శివుని చిన్న కుమారుడైన కుమారస్వామికి వాహనమైన నెమలికి పరమేశ్వరుని కంఠాభరణం ఆహారం.

02/22/2018 - 22:23

పువ్వు వికసించి దాని పరిమళం పిల్లవాయువులతో నలుదిక్కులల్లోను వ్యాపించగానే తేనెటీగలు తమంత తామె దానివద్దకు వస్తాయి. మిఠాయిలను వుంచిన చోటికి చీమలు తమంత తామే వచ్చిచేరుతాయి. తేనెటీగలనుగాని, చీమనుగాని ఎవరూ ఆహ్వానించనక్కర్లేదు. అదేవిధంగా మానవుడు పవిత్రహృదయుడై సిద్ధుడైనప్పుడు అతడి సుశీల సౌరభం అన్ని చోట్లా వ్యాపిస్తుంది. ముముక్షువు లందరూ సహజంగానే అతడి చేత ఆకర్షించబడుతారు. అతని దగ్గరకు వస్తారు.

Pages