S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

07/30/2019 - 19:32

ఆ వింత దృశ్యం చూడగానే చిత్రకేతువు, కృతద్యుతి పట్టలేని ఆనందంతో ఆ పిల్లవానిని పట్టుకొని విచారం, సంతోషం రెండూ కలగలసి ఆ పిల్లవానిని ముద్దాడుతూ ఉన్నారు. అంతలో ఆ పిల్లవాడు ‘అయ్యా , అమ్మా ! మీరు ఎవరు ఎందుకింత దుఃఖమూ, ఆనందమూ అనుభవిస్తున్నారు. నన్నుచూసి మీ ఆనందం ఎక్కువ అవుతున్నట్లు ఉంది. మీరునాకు ఏవిధమైన సంబంధం ఉంది ? ’ అని అడిగాడు.

07/29/2019 - 18:37

ఊరు వాడ రాజ్యం అంతా కన్నీరుమున్నీరుగా ఏడ్చారు. రాజుగారు నాకు లేక లేక పుట్టిన కొడుకు అందులోను మహర్షి వరం చేత పుట్టిన కొడుకు ఇలా ఎందుకు మృత్యువు పాలయ్యాడో అని వగచారు. కృతద్యుతి సవతులంతా బాధను నటించారు. చివరకు రాజు అంగీరస మహాముని వద్దకు బిడ్డను తీసుకుని వెళ్లి బతికించమని కోరుకుంటాను అనుకొన్నాడు.

07/28/2019 - 21:00

ఒకానొక కాలంలో చిత్రకేతువు అనే రాజు ఉండేవాడు. అతడు భోగభాగ్యాలలో, యజ్ఞాలు చేయడంలో ఇంద్రుడంతటివాడని పేరుతెచ్చుకున్నాడు. అపార ధనరాసులతో తులతూగే అతని రాజ్యంలో ధర్మపాలన చక్కగా సాగేది. ఆయన రాజ్యంలో అవిద్యాపరులు కాని, జారులు, చోరులు, అధర్మపరులు కానీ ఉండేవారు కాదు.

07/25/2019 - 18:56

ఈ మాటలకు మరింత ఆశ్చర్యపోతూ దేవేంద్రుడు వృత్రాసురుడిని చూశాడు. తన అనుచరులంతా పారిపోతున్నా, తాము ఓడిపోతున్నా, నా చేతిలో సంహరించబడుతాడని తెలిసినా కూడా ఎందుకింత ఆనందంగా ఉన్నాడు. తనకు ప్రాణం పోతుందని భయం లేదా? అనుకొన్నాడు ఇంద్రుడు.ఇంద్రుని మనోగతాన్ని తెలుసుకొన్న వృత్రాసురుడు ‘దేవేంద్రా! నీకు నా సంగతి ముందు తెలుస్తుందిలే ఇకనైనా జాగు చేయక వజ్రాయుధంతో నన్ను కడతేర్చు’అంటూనే తన కరవాలాన్ని ఎత్తాడు.

07/24/2019 - 19:51

వారినంతా చూసి వృత్రాసురుడు తన వైపు ఎవరెవరున్నారో అని ఒక్కసారి సైనికుల వైపు చూశాడునముచి, శంబరుడు, అనర్వుడు, వృషభుడు, శంకుశిరుడు, విరూపాక్షుడు, ఇల్వలుడు, దందశూకుడు, కాలనాభుడు, మహానాభుడు, సుమాలి, మాలి, భూతసంతాపనుడు, వృకుడు ఇలా అసంఖ్యాకమైన రాక్షసులు తరలి వచ్చారు.

07/23/2019 - 19:30

అపుడు శ్రీమన్నారాయణుడు ఈ విధంగా చెప్పాడు.

07/22/2019 - 18:28

ఇక నీవు అమరావతిపై దండెత్తి ఆ గర్వాంధుడైన ఇంద్రుడిని పదవీ భ్రష్టుడిని చేయు. నీకు నేను చెప్పదల్చుకున్న పని అదే అని చెప్పాడు.
వెనువెంటనే వృత్రాసురుడు దేవతలపై దండెత్తి వెళ్లాడు.

07/18/2019 - 19:16

విశ్వరూపుడు ఇంద్రుని చేత సంహరించబడ్డాడు. ఈ సంగతి త్వష్ట ప్రజాపతికి తెలిసింది. అతడు ఎంతో బాధపడ్డాడు. ఆగ్రహావేశాలతో విశ్వరూపుని చంపిన ఇంద్రుడు బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుందని ఎంతో విచారం పొందాడు.

07/17/2019 - 18:51

అంతే వారికి ఎక్కడలేని కోపం వచ్చింది. ఏరా మా యాగాశ్వాన్ని దొంగలించి తీసుకొని వస్తావా.. నీకెంత పొగరు అంటూ పెద్దపెద్దగా అరుస్తూ ఆయన మీదికి దూకారు. ఎంతకీ ఆయన కళ్లు తెరవకపోయేసరికి వీళ్లకు కోపం ఎక్కువై అక్కడ పక్కన ఉన్న చెట్లను పెరికి ఆయన మీదకు విసిరేశారు. ఆయన శిఖను పట్టుకుని లాగారు.

07/16/2019 - 18:46

ఆ తరువాత అతని భార్యకు అంశుమంతుడు అను కొడుకు కలిగాడు. అంశుమంతుడు చాలా బుద్ధిమంతుడు. ఇతడు తన తాత అయిన సగరుని వారసునిలాగా చక్కని బుద్ధి చాతుర్యంతోను పరాక్రమంతోను పెరిగి పెద్దవాడు అవుతున్నాడు.
సగరుడు ప్రజలకు తన కుమారుని వల్ల జరిగే బాధలను దూరం చేశానన్న సంతోషంతో తన సహజగుణంగా తిరిగి అశ్వమేథ యాగాలను చేయడం మొదలుపెట్టాడు.

Pages