S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

03/06/2019 - 19:59

కోమలమైన నల్లకలువలవంటి శ్యామల వర్ణం కలవాడూ, దేవేంద్రుని చేత పొగడబడేవాడు, మెరుపులీనే చెక్కిళ్లు కలవాడు, కౌస్త్భున్ని ధరించినవాడు, అర్థులకు కల్పవృక్షం వంటివాడు. సౌందర్యమూర్తి , చక్రాయుధుడు, జగత్తులో పేరెన్నిక గన్నవాడు, గరుడవాహనుడూ, పీతాంబరధారీ అరవిందాక్షుడూ , మకర కుండలభూషణుడూ, మృదు మధుర భాషణుడు, సుగుణ సాంద్రుడూ అయిన ఆ గోపీజన వల్లభుడు నన్ను కరుణిస్తాడా? నన్ను చూస్తాడా?

03/05/2019 - 22:05

ఆ దుర్వాసమహాముని జటాజూటం నుంచి వెలువడిన కృత్య భయంకరంగా శూలాన్ని ధరించి అంబరీషుని తెగటార్చడానికి బయలుదేరింది.
ఇది బాగానే ఉంది. కానీ పూర్వంలో అంబరీషుడు చేసిన విష్ణ్భుక్తిని మెచ్చుకున్న వైకుంఠనాథుడు ఏదైనా వరాన్ని కోరుకోమని అడిగినపుడు అంబరీషుడు తన్ను సదా నీ సుదర్శన చక్రంతో రక్షిస్తూ ఉండమని వేడుకున్నాడుకదా.

03/05/2019 - 22:02

కొత్త సీరియల్ ప్రారంభం
*

02/15/2019 - 19:01

కాశం నుండి నిర్మల జలం కురిసినట్లు పవిత్ర భావంతో చేసిన యజ్ఞం వలన సత్పుత్రులు పుడుతారు. కర్తవ్యాన్ని కర్తవ్యంగా స్వీకరిస్తూ దానిని పాటించలేకపోతే భయపడుతూ, లోకంలో సమస్తాన్ని బ్రహ్మగానే భావిస్తూ, అహంకారాన్ని వీడి ప్రవర్తించినవాడే నిజమైన బ్రాహ్మణుడు. కర్మ నిర్వహణలో ఏదైనా లోపం జరిగినా నిష్కామ భావంతో చేస్తే అది మంచి ఫలితానే్న ఇస్తుంది.

02/14/2019 - 19:33

పుర్వకాలంలో జాజలి అనే పేరు కల ద్విజుడు అరణ్యంలో తపస్సు చేసుకుంటూ అక్కడే నివసించేవాడు. ఆ ముని నియమంగా ఆహారం తీసుకొంటూ నార చీరలు, జింక చర్మాలు ధరించి తపస్సు చేశాడు. కొన్ని సంవత్సరాలు శరీరంపై మలాన్ని, బురదనూ ధరించాడు. సముద్ర తీరంలో జలంలో నిలిచి తపస్సు చేస్తున్న అతనికి సముద్ర పర్యంతం ఉన్న భూమిని చూడాలన్న కోరికతో, ఆ భూమినంతా చూసివచ్చి మరల జలంలో నిలిచి ఇలా అనుకున్నాడు.

02/13/2019 - 19:29

శూన్య గృహంలో గార్ద్భ రూపాన్ని ధరించిన నన్ను గుర్తు పట్టి వచ్చి నిందిస్తున్నావు. నేను కావాలనుకొంటే ఏ రూపైనా ధరించగలను. నా భీకర రూపం చూస్తే నీవు పారిపోతావు. కాలమే అన్నిటికీ కారణము, కర్త కనుక నీవు గర్వించవద్దు పురందరా! నీ మనస్సు చిన్న పిల్లల మనస్సు లాగా ఉండిఏమీ ఎదగలేదు. కొంత నైష్ఠిక బుద్ధి అలవర్చుకో. దేవతలు, గంధర్వులు, పితరులు, నాగులు దైత్యులు, అందరూ నా ఆధీనంలో ఉండేవారు

02/12/2019 - 18:49

ఒక సమయంలో దేవేంద్రుడు దైత్యులదరినీ జయించి, బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి నమస్కరించి బలిని గురించి ఇలా అడిగాడు- ‘‘చతుర్ముఖా! ఎంత దానం చేసినా బలి ధనాగారం ఎప్పుడూ తరిగిపోదు. అతడు ఎక్కడ ఉన్నాడో తెలియటం లేదు. అతను ఎక్కడ ఉన్నాడో తెలియచెప్పు’’ అతను వాయువై, వరుణుడై, సూర్యుడై, చంద్రుడై వారు చేసే పనులన్నీ చేయగలడు. అగ్ని లాగ ప్రాణులను తపించగలడు. కావాలంటే జలంగా మారగలడు. ఆ బలి ఎక్కడున్నాడో తెలియటం లేదు.

02/11/2019 - 22:37

సువర్చల ఇలా అంది ‘‘బ్రహ్మర్షీ! ఇన్ని విధాలుగా విడమర్చి చెప్పితే ఏం లాభం? నిత్యక్రియాకలాపాలతో నీ జ్ఞానం నశిస్తోంది. దానికి కారణం చెప్పు. నేను నిన్ను అనుసరించేదానను’’.

02/11/2019 - 22:34

పూర్వం దేవలుడు అనే విప్రుడు ఉండేవాడు. అతడు సకల శాస్తప్రారంగతుడు. పరమ ధార్మికుడు. నిత్యం దేవతలను, బ్రాహ్మణులనూ పూజించేవాడు. అతనికి సువర్చల అనే కుమార్తె కలదు. ఆమె సకల శుభలక్షణాలు కలది. చాలా చక్కనిది. వివేకవతి. ఆమెకు యుక్తవయస్సు రాగానే తండ్రి ఇలా ఆలోచించాడు. ‘‘ఈ కన్యకు తగిన వరుడు ఎలా దొరుకుతాడు? అతను ఉత్తమ శ్రోత్రియుడు, విద్వాంసుడు, విప్రుడు, బ్రహ్మచారి, మహాతపస్వి అయి ఉండాలి’’.

02/08/2019 - 18:27

బ్రహ్మదత్తుడు ఇలా అన్నాడు ‘‘ప్రాణహాని చేసే ప్రాణులకయినా సహవాసం వలన స్నేహం కలుగుతుంది. పరస్పర విశ్వాసం కలుగుతుంది. తామరాకు మీద నీటిబొట్టులాగ శతృత్వం నిలవదు’’.

Pages