S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

07/18/2019 - 19:16

విశ్వరూపుడు ఇంద్రుని చేత సంహరించబడ్డాడు. ఈ సంగతి త్వష్ట ప్రజాపతికి తెలిసింది. అతడు ఎంతో బాధపడ్డాడు. ఆగ్రహావేశాలతో విశ్వరూపుని చంపిన ఇంద్రుడు బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుందని ఎంతో విచారం పొందాడు.

07/17/2019 - 18:51

అంతే వారికి ఎక్కడలేని కోపం వచ్చింది. ఏరా మా యాగాశ్వాన్ని దొంగలించి తీసుకొని వస్తావా.. నీకెంత పొగరు అంటూ పెద్దపెద్దగా అరుస్తూ ఆయన మీదికి దూకారు. ఎంతకీ ఆయన కళ్లు తెరవకపోయేసరికి వీళ్లకు కోపం ఎక్కువై అక్కడ పక్కన ఉన్న చెట్లను పెరికి ఆయన మీదకు విసిరేశారు. ఆయన శిఖను పట్టుకుని లాగారు.

07/16/2019 - 18:46

ఆ తరువాత అతని భార్యకు అంశుమంతుడు అను కొడుకు కలిగాడు. అంశుమంతుడు చాలా బుద్ధిమంతుడు. ఇతడు తన తాత అయిన సగరుని వారసునిలాగా చక్కని బుద్ధి చాతుర్యంతోను పరాక్రమంతోను పెరిగి పెద్దవాడు అవుతున్నాడు.
సగరుడు ప్రజలకు తన కుమారుని వల్ల జరిగే బాధలను దూరం చేశానన్న సంతోషంతో తన సహజగుణంగా తిరిగి అశ్వమేథ యాగాలను చేయడం మొదలుపెట్టాడు.

07/15/2019 - 19:31

విదర్భదేశాధీశుడు తన కుమార్తె అయిన కేశిని అను కన్యను సగరునికిచ్చి వివాహం చేశాడు. కొన్నాళ్ల తరువాత సగరుడు సుమతి అను కన్యను కూడా వివాహం చేసుకొన్నాడు.

07/14/2019 - 22:18

ఒకానొక కాలంలో బాహకుడు అనేరాజు ఉండేవాడు. ఒకసారి బాహకుడు యుద్ధంలో తన సేననలంతా నష్టపోయాడు. ఇక యుద్ధంలో గెలవలేనని అనుకొని రాజ్యాన్ని శత్రువులకు అప్పగించి తాను తన భార్యలతో కలసి అడివికి వెళ్లిపోయాడు. భృగుప్రసరణగిరి అనే ప్రదేశానికి వెళ్లారు. అక్కడ నివసించే ఔర్వ మహర్షి దగ్గరకు వెళ్లి తాను శత్రువుల చేతిలో ఓడిపోయానని, తనకు తన భార్యలకు ఆశ్రయం ఇవ్వమని అడిగాడు.

07/11/2019 - 22:25

భవిష్యత్తును దృష్టిని లోపెట్టుకుని ఆ బిడ్డకు కణ్వమహర్షి భరతుడు అని నామకరణం చేశాడు.

07/10/2019 - 18:46

దుష్యంతుడు పలువిధాలుగా చెప్పి ఆమెను ఒప్పించి వన దేవతల సాక్షిగా, ప్రకృతి పరమేశ్వరుని సాక్షిగా చేసుకొని శకుంతలను గాంధర్వవిధిన వివాహం చేసుకొన్నాడు. మరికొద్దిసేపు అక్కడే ఉండి తను కూడా శకుంతలను విడువలేక విడువలేక విడిచి తన రాజధానికి మరలాడు. శకుంతల కూడా కొత్తగా ఏర్పడిన బంధమైనా దుష్యంతుని తన ప్రాణనాథునిగా తలచింది కనుక ఆమె కన్నీరుమున్నీరు అయింది.

07/09/2019 - 19:36

దుష్యంతునిలో కదలిక లేకపోవడంతో మీరు ఏమి ఇంతగా ఆలోచిస్తున్నారు అని తానే ప్రశ్నించింది.

07/08/2019 - 18:38

అనుకొన్నదే తడవుగా లేచాడు. కమండలాన్ని కోలను పక్కను పెట్టాడు.
కోమలి కొలువుకు బయలుదేరాడు. ఇంద్రుడు జరుగుతున్నదంతా చూశాడు. ఇక నేను నిశ్చింతగా ఉండవచ్చు అనుకొన్నాడు. హాయిగా కూర్చున్నాడు.
***

07/07/2019 - 22:59

విశ్వామిత్రుడు చిరునవ్వుతో ‘ప్రియా! దేవీ! ఏమిటీ పనులు? ఏదైనా దెబ్బతగిలితే ఏమైపోను. నన్ను చూసి ఎందుకంతగా భయపడుతున్నావు’అన్నాడు.

Pages