S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

06/19/2019 - 18:22

మెడలో వనమాల, చేతిలో పిల్లన గ్రోవి, తలపై నెమలి ఫించం పట్టుకొన్నవాడు, పొడుగాటి చేతులు కలవాడు...నల్లని మోము కలవాడు శత్రువులను కూడా ఆకర్షించే చక్కని ముఖారవిందం కలిగినవాడు...’’ ఇలా చెప్పుకుంటూ ఆనందిస్తూన్నాడు నారదుడు.

06/18/2019 - 18:22

దుష్టులను నిర్మూలించడానికే కృష్ణుడు యశోదానందనుడయ్యాడు. అందుకే కంసాది వీరులంతా చావుపుట్టకలు లేనివాడిని, యశోదానందనుడిని చంపాలని ఎదురుచూశారు. దేవకీదేవి గర్భాన ఉన్న సమయంలోనే వారికి మనలను మట్టుపెట్టే జగత్ప్రభువు వస్తున్నాడని తెలుసుకొన్నారు. ఎందరో దుర్మార్గులు వారి ఆటలు ఇక సాగవని చిన్నపుడు బాలకుడుగా ఉన్నప్పుడే మహావిష్ణువు అవతారంగా భావిస్తున్న నందనందనుని చంపేయాలని కలలు కన్నారు.

06/17/2019 - 22:35

ఈ క్షణ భంగురాలైన సుఖాల కోసమా నా చిన్ని వాని యవ్వనాన్ని కొల్లగొట్టాను అనుకొన్నాడు. వెంటనే తన ప్రియాతి ప్రియమైన కొడుకు పూరువు అని పిలిచాడు. తండ్రి పిలిచిన వెంటనే పూరుడు వచ్చాడు. తండ్రీ ఆజ్ఞ ఏమిటి అనే నిత్యానందంతో ఉన్న పూరువు ను చూసి యయాతీ గర్వం పొందాడు. ఇతడు నాకుమారుడే. నాకులేని స్థిర చిత్తం వీనికి చిన్నపుడే వచ్చింది.

06/17/2019 - 22:32

యయాతీ చెప్పినమాటను కాదని ధర్మం తప్పావు కనుక నీవు స్ర్తిలు అసహ్యించుకునే ముసలితనాన్ని పొందుదుగాక!’ అని శపించాడు.
యయాతీ ఆ శాపాన్ని విని అప్రతిభుడయ్యాడు. శుక్రాచార్యా! నాకు ఇంకా ఈ శరీరం పై మమకారం వదలలేదు.

06/13/2019 - 18:25

కొన్నాళ్లకు శర్మిష్ఠ గర్భవతి అయింది. ఆమెకు ద్రుహ్యుడు అన్న కుమారుడిని కన్నది. శర్మిష్ఠ ఎంతో ఆనందించింది. యయాతీ మహారాజు కూడా తన కుమారుడిని చూసుకొని తన ప్రతిబింబమే అనుకొని ముచ్చట పడ్డాడు.

06/12/2019 - 19:43

సంగతి తెలుసుకొన్న శర్మిష్ఠ తాను ఎంత పొరపాటు చేసానో అని వాపోయింది. దీని కోసం ఇంత పెద్ద శిక్ష నా తండ్రి చేత పొందవలసి వచ్చింది. ఏమి చేద్దాం. కాలం కలసి రాకపోతే తాడు కూడా పామై కరుస్తుంది. మంచి రోజులు నాకును రాకపోతాయా. దేవయాని ని చూసి మా తండ్రిని నేను కష్టపెట్టబోను. తండ్రి చెప్పినట్లే దేవయానికి దాసిగా వెళ్తాను అనుకొంది.

06/11/2019 - 19:01

శర్మిష్ఠ కోరిక మీద నేను తన వేయిమంది చెలికత్తెలం అందరం కలసి వనవిహారానికి వచ్చాం. ఇక్కడ చల్లని నీరున్న తటాకాన్ని చూసి మేమంతా జలకాలాటలు ఆడుదాం అనుకొన్నాం. వెంటనే అందరూ స్నానానికి ఇక్కడి పొదల్లో బట్టలు విడిచి పెట్టి ఆ తటాకంలోకాలుపెట్టాం. మేమంతా ఎంతో సంతోషంతో జలక్రీడల్లో మునిగి పోయి ఉంటే అపుడే అక్కడికి పార్వతీ పరమేశ్వరులు వచ్చారు.

06/10/2019 - 22:19

‘‘నీవు అర్థరహితంగా మాట్లాడడమే కాక ఒక బ్రాహ్మణ వంశంలో పుట్టి అపమార్గంలో నడుస్తూ తిరిగి ననే్న శపించావు కనుక నిన్ను బ్రాహ్మణులెవరూ వివాహం చేసుకోరు’’ అని కచుడు నన్ను శపించాడు. అతని శాపానికి ఎదురులేదు కనుక నన్ను ఇతరులెవరైనా వివాహం చేసుకుంటారు. అంటే నేడు మీరు క్షత్రియులు కనుక మీరు మీ చేతిని నాకు అందించారు పైగా .అందుకే మీరు నిరభ్యంతరంగా నన్నువివాహమాడవచ్చు అని దేవయాని యయాతితో చెప్పింది.

06/10/2019 - 22:18

వాటిని అధిగమించడానికి కచుడు ఎక్కువ కష్టపడుతుండేవాడు. నేను ప్రతిరోజు కచుడిని చూసి ఎంతో సంతోషంతో ఉండేదానిని. అతనిని నేను ఎంతో ప్రేమించాను. ఆ ప్రేమాధిక్యతతో రాక్షసులు ఎన్నో మార్లు కచుడిని చంపివేసినా మా తండ్రికి వచ్చిన మృత సంజీవనీ విద్య ద్వారా నేను బతికించే ఏర్పాట్లు చేశాను. చివరకు ఒకనాడు కచుడిని రాక్షసులు అడవిలో చంపివేసి కాల్చి బూడిద చేసేశారు.

06/06/2019 - 19:26

అహంకారం నాశనానికి దారితీస్తుంది. పొగరు పతనానికి దారి తీస్తుంది. ఇలా ఎన్ని చెప్పినా కొందరు అహంకారానికి లొంగి పోతారు. ఒక్కొక్కరు మనం అహంకరించి తప్పు చేశాము. ఇక అహంకారం జోలికి పోకూడదు అనుకొని పశ్చా త్తాపంతో తమ నడవడిని మార్చుకొని సన్మార్గంలో నడిచేవాళ్లు ఉంటారు. శరీరం నశించి పోయేదని తెలిసినా దీనిపై వ్యామోహం వదలడం అంత సులభంగాదు అని చాలామంది చెబుతూ ఉంటారు.

Pages