S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

05/09/2019 - 19:30

నేను శత్రుత్వంపొందకుండానే నిన్ను దర్శించుకునే భాగ్యాన్ని పొందాను.

05/08/2019 - 19:44

ఆ తరువాత 34 ‘‘బ్రాహ్మణుడవూ ప్రసిద్దమైన వ్రతం కలిగిన వాడవూ విష్ణు స్వరూపుడవూ అయిన నీకు మూడడుగుల నేల దానం చేస్తున్నాను’’ 12అని అంటూ ‘‘ఈ చర్య పరమాత్మునకు ప్రీతి కలిగించుగాక3’’ 2అన్నాడు.
బలి చక్రవర్తి దృఢ నిశ్చయానికి లోకం అంతా ఆశ్చర్యానందాలకు గురైంది. దేవతలంతా దిగ్భ్రమ చెందారు. ఎంతైనా బలిని మెచ్చుకొనవలసిందే అనుకొన్నారు.

05/07/2019 - 19:34

అంతేకానీ ఉన్నదంతా ఊడ్చిపెట్టి చేతిలో చిప్ప పట్టుకోగూడదు. ఉన్నదానిలోనే తాను తింటూ ఆ తరువాత యజ్ఞాల గురించి, దానాల గురించి ఆలోచించి చేయాలి. అడిగిన వానికంతా ఇవ్వకూడదు. అర్హత ఎరిగి దానం చేయాలి సచ్చరితా! ఎపుడైతే చేసిన దానం వల్ల సర్వమూ నష్టమవుతుందో ఆ దానాన్ని ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తానని మాట ఇచ్చినా అసలుకు నష్టం వస్తోంది కనుక దానిని కూడా ఇవ్వకూడదు. ఒక చెట్టు బాగుంటేనే కదా పూలు పండ్లు ఇవ్వగలుగుతుంది.

05/06/2019 - 18:55

మీ మూడవ తాత హిరణ్యాక్షుడు విశ్వాన్ని జయించినవాడు కదా. అతడు గదాదండం పట్టుకొని ఎవరైనా శత్రువులున్నారా అని విశ్వమంతా వెదికాడు. కాని ఆయనకు భయపడి ఆ విష్ణువు దాక్కొన్నాడు. కొన్నాళ్ల తరువాత పందిరూపంలో వచ్చి మీ తాతను ఆ విష్ణువు మట్టుపెట్టాడు.

05/05/2019 - 23:12

ఆ మహోత్సవం తరువాత అక్కడి వచ్చిన వారినందరినీ కూర్చోబెట్టి కపట వటువు విశేషాలను అడిగి తెలుసుకొన్నాడు. ఆ సమయంలో విప్రులు ఎలా ఉన్నారో అడిగి అడిగి మరీ కనుకొన్నాడు. దానాలు ఇవ్వడంలో ఏ ఏ రాజులు మేటి అని ఏమీ తెలియని అమాయకునివలె వారిని అడిగాడు. వారంతా ముక్తకంఠంతో బలి చక్రవర్తినే దానాలు ఇచ్చే మహాదాత, మహోన్నతుడని పొగిడారు.

05/03/2019 - 18:58

‘‘దేవా! మహానుభావ! సమస్త్భువనాలను నీ కడుపులో దాచుకున్నావు. ఈ లోకాలకు ఆది అంతమూ నీవే. చరాచర ప్రపంచం పుట్టడానికి కడతేరటానికి కారణం నీవే. సృష్టికర్తలకు సృష్టికర్తవు నీవు. స్వర్గలోకాన్ని చేజార్చుకుని ఎంతో కాలంలో దేవతలంతా స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. వారిని కాపాడడానికి నీవే దిక్కు.

05/02/2019 - 19:22

కాలరీతిని ఎవరూ పసికట్టలేరు. కాలానికి ఎవరూ ఎదురువెళ్లలేరన్న నిజం తెలిసిన బృహస్పతి 34దేవేంద్రా! మనసును దిటవుపరుచుకో. ఎల్లవేళలా మంచినే జరుగదు. కాలవైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి. నేడు బలికి బ్రాహ్మణుల ఆశీర్వాదాలు దక్కాయి. వారి దీవెనల బలం పెరిగింది. అంతేకాక భృగువంశబ్రాహ్మణులు వీనికి శక్తినిచ్చారు. శుక్రాచార్యుని ప్రియశిష్యుడైనాడు.

05/01/2019 - 19:36

హరిభక్తుడైన ప్రహ్లాదుడు వాడిపోని పద్మాల దండ ఇచ్చినాడు. శుక్రుడు చంద్రుని వంటి తెల్లని శంఖాన్ని ఇచ్చాడు. విశ్వజిద్యాగానితో రత్నకచిత సువర్ణకంకణాలు, ఖడ్గమూ లభించాయి.

04/30/2019 - 18:46

ఏకాదశి. విష్ణువుకు ప్రీతికరమైన రోజు. అదితి తన భర్తచేత ఉపదేశం పొందిన పయోవ్రతం నియమానుసారం చేస్తోంది. ఈ ఏకాదశి మరింత నియమంగా అదితి మొట్టమొదట తన భర్తను పూజించింది. తరువాత మహావిష్ణువు ప్రీత్యర్థం పయోవ్రతాచరణలో భాగంగా మహావిష్ణువుకు క్షీరాభిషేకం నిర్వహించింది. పాలునివేదన చేసింది. ఆ పాలనే ప్రసాదంగా తాను తీసుకొంది.

04/29/2019 - 22:57

అపుడు స్వామిని చూచేవారికి భయం కలిగింది. లోకభయంకరుడైన రాక్షసుని తుదికాలం వచ్చిందని తెలుసుకొన్న దేవతలు, దానవులు,విద్యాదరులు, గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు, సాధ్యులు, పణులు, చారణులు, యక్షులు, కినె్నరులు, పన్నగులు, ప్రజాపతులు, వైతాళికులు,విష్ణు సేవకులు, గరుడులు, నారదాదులు, త్రిమూర్తులూ, త్రిమాతలు.. సర్వలోకం ఇక్కడే వచ్చిందానన్నట్లు ఆకాశమంతా వీరితో నిండిపోయింది..

Pages