S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

01/02/2019 - 19:35

ఆ కాలమహిమ వల్లనే వరదల్లో వస్తువులు నదిలో కొట్టుకొని పోయినట్లుగా కాలప్రవాహంలో అన్నీ కొట్టుకుపోతాయి. నా రాజ్యం కూడా అలాగే పోయింది. ఆ ఫలాన్ని అనుభవిస్తున్నాను. కనుక దొరికిన దానితోనే జీవిస్తాను’’.

01/01/2019 - 19:51

ఆ నది ముని శాపంతో రక్తంతో ప్రవహించసాగింది. అప్పుడు రాక్షసులు అక్కడకు వచ్చి ఆ రక్తాన్ని త్రాగుతూ సుఖంగా ఉండసాగారు. వారు స్వర్గాన్ని గెలిచినంత ఆనందాన్ని పొందేవారు. కొంతకాలానికి ఆ నదిలో మునగాలని కొందరు మహర్షులు అక్కడికి వచ్చారు. వారు సరస్వతీ తీర్థాలన్నింటిలో మునిగి ఆనందం పొంది చివరకు నెత్తురు ప్రవహిస్తున్న ఈ తీర్థానికి వచ్చారు. ఆ నీటిని చూసి ఆశ్చర్యపోయారు.

01/01/2019 - 04:14

ధృతరాష్ట్రుడు కోపించి అక్కడ మరణించి ఉన్న కొన్ని ఆవులను చూపించి ఇలా అన్నాడు ‘‘బ్రాహ్మణోత్తమా! నీ కిష్టమైతే వీటిని తీసుకొనివెళ్లు’’. ధర్మవేత్త అయిన ఋషి ఆ రాజు మాటలు విని ‘‘అయ్యో! సభలో ఈ రాజు ఎంత కౄరంగా మాట్లాడాడు’’ అని చింతించాడు. తర్వాత అతను క్రోధంతో ధృతరాష్ట్రుని నాశనం చేయాలని తలచాడు. అతను ఆ మృత పశువులను ముక్కలుగా చేసి వాటితో ఆ రాష్ట్రానికి ఆహుతి చేయసాగాడు.

12/30/2018 - 23:08

అప్పుడు ఈశ్వరుడు అతనితో ఇలా అన్నాడు ‘‘విప్రా! నా అనుగ్రహంతో నీ తపస్సు వృద్ధి చెందుతుంది. నీతో నేను సదా ఆశ్రమంలో నివసించగలను. నన్ను ఆరాధించినవారు సారస్వత లోకాన్ని చేరుతారు.’’

12/28/2018 - 20:21

సరస్వతీనది తీర్థాలన్నింటిలోను శ్రేష్ఠమైనది సప్తసారస్వత తీర్థం. ఈ తీర్థంలో ఎన్నో బ్రాహ్మణ గణాలు నివసిస్తూ ఉంటాయి. రేగు, ఇంగుడి, జువ్వి, రావి, మోదుగ, పారిజాతం, మామిడి, వెదురు, బిల్వం మొదలైన వృక్షాలు ఈ తీరంలో కన్పిస్తాయి. ఎంతోమంది మునులు అక్కడ నివసిస్తూ ఉంటారు. వారిలో వాయుభుక్తులు, జలభక్షకులు, ఫలభక్షులు, పర్ణ్భక్షులు, వానప్రస్థులు ఉన్నారు. స్వాధ్యాయఘోష అక్కడ ఎప్పుడూ విన్పిస్తూ ఉంటుంది.

12/27/2018 - 19:57

‘నా కుమారుడు పురుషుడే. కావాలంటే పరీక్షించుకోండి. ఎవరో అసత్యం చెప్పారు’’. అది విని అందరూ రాజుకు వివరించి చెప్పారు. శిఖండి పురుషుడని చెప్పారు. రాజు కూడా అల్లుడిని పరీక్షించి సంతృప్తి చెందాడు. ఆనందంలో అక్కడే ఉండిపోయాడు. తప్పుడు మాటలు చెప్పినందుకు కూతురును తిట్టి తన నగరానికి వెళ్ళిపోయాడు. శిఖండి కూడా అంతా సవ్యంగా జరిగినందుకు సంతోషించింది.

12/26/2018 - 18:59

అప్పుడు అంబ అందరూ చూస్తూ ఉండగా కట్టెలు పేర్పించి అగ్నిని రగిల్చి ఆ చితిలోకి దూకి అగ్నిప్రవేశం చేసింది.
ద్రుపద మహారాజు పట్టమహిషికి సంతానం లేదు. మహారాజు తన పూజలతో శంకరుని సంతోష పరిచాడు. శంకరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా తనకు భీష్ముని చంపే పుత్రుడు కావాలని కోరాడు. అప్పుడు ఈశ్వరుడు ఇలా అన్నాడు. ‘‘రాజా! నీకు మొదట స్ర్తి పుట్టి తర్వాత పురుషునిగా మారుతుంది’’.

12/25/2018 - 19:20

దేవతలు కూడా భీష్ముని వారించారు. ‘‘ఇక ఈ యుద్ధం ఆపు. గురువైన పరశురామునితో యుద్ధం తగదు. రాముడిని యుద్ధంలో జయించడం నీకు న్యాయం కాదు. ఆ బ్రాహ్మణుని గౌరవించు’’.
మరల పరశురామునితో ఇలా అన్నారు ‘‘్భష్ముడు వసువులలో ఒకడు. వసువుని ఎలా జయించగలవు? అతను దేవతలందరిలో పూర్వుడు. సనాతనుడు అయిన నరుడు అర్జునుడిగా పుట్టి ఇతని మృత్యువుకు కారణవౌతాడని బ్రహ్మ విధించాడు’’.

12/24/2018 - 19:40

అప్పుడు పరశురాముడు భయంకరమైన ఒక శక్తిని వదిలాడు. అది ప్రళయకాల సూర్యుడిలా వెలుగుతూ భీష్మునిపైకి వచ్చింది. అతను ఆ శక్తిని మూడు ముక్కలు చేసి భూమిపై పడవేశాడు. దాంతో కోపం వచ్చిన భార్గవుడు పనె్నండు ఘోరశక్తులను భీష్ముడిపై వదిలాడు. భీష్ముడు బాణమయవలను ప్రయోగించి వాటిని ఖండించాడు. తర్వాత భీష్ముడు తన దివ్యాస్త్రాలతో పరశురాముని దివ్యాస్త్రాలను సూతుల సహితంగా ఖండించాడు.

12/23/2018 - 22:46

భీష్ముని మాటలతో పరశురామునికి ఆగ్రహం కలిగింది. అతను భీష్మునితో ఇలా అన్నాడు. ‘‘భీష్మా! అదృష్టంకొద్దీ నాతో తలపడాలనుకుంటున్నావు. పద కురుక్షేత్రానికి. అక్కడ నా బాణాల చేత చచ్చిన నీవు కాకులకు, గ్రద్ధలకు ఆహారమవుతుంటే నీ తల్లి గంగాదేవి చూస్తుందిలే’’. అలా అంటున్న పరశురాముని శిరసు వంచి ప్రణామం చేసి భీష్ముడు కురుక్షేత్రానికి బయలుదేరాడు.

Pages