S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

01/29/2019 - 19:39

అప్పుడు విశ్వామిత్రుడు ఇలా అన్నాడు - ‘‘ఈ దుర్భిక్ష కాలంలో మరో మాంసం దొరకడం సులభం కాదు. నా దగ్గర డబ్బులేదు. ఆకలి బాధతో ఉన్నాను. గతిలేదు. ఈ కుక్క మాంసం పంచభక్ష్య పరమాన్నం అని తలుస్తాను’’.
ఛండాలుడు ఇలా అన్నాడు - బ్రాహ్మణ, క్షత్రియ, వైశయులు పంచనఖాలు కల ప్రాణులని, ఆపద సమయాల్లో తినవచ్చని శాస్త్రాలు చెప్తున్నాయ. తినదగని వాటిపై మనసు పెట్టవద్దు’’.

01/28/2019 - 19:03

త్రేతా ద్వాపర యుగాల సంధికాలంలో ఒకసారి ఘోర అనావృష్టి కలిగింది. అది పండ్రెండు సంవత్సరాల దాకా ఉంది. త్రేతాయుగం సమాప్తం అయ ద్వాపర యుగం ప్రారంభం అయ్యే సమయానికి జన సంఖ్య బాగా పెరిగిపోయంది. వర్షాలు లేకపోవటం వలన తినడానికి ఏ ఆహారపదార్ధాలు పండలేదు. ఇంద్రుడు వానలు కురిపించలేదు. గురువు వక్రించాడు. చంద్రుడు దక్షిణ మార్గాన సంచరించసాగాడు. ఆ సమయాన మేఘాలు లేవు. ఇక వానలు ఎక్కడివి? నదులలో నీరు ఇంకిపోసాగింది.

01/27/2019 - 22:24

ఇక ఇతరులను ఏమి ఉపయోగపడతాడు? కనుక చపలుడు ఇతరుల పనులు చెడగొడతాడు. నీకు సహాయం చేశాను కనుక ఆప్తుడను అయ్యాను. ప్రతీదానికి ఏదో కారణముంటుంది. దానివలన హితులు కాని అహితులు కాని అవుతారు.

01/25/2019 - 18:21

ఇప్పుడు నీ హితం కోసం నేను ఏమి చేస్తానో చెబుతాను. ముందుగా నన్ను కాపాడు. ఎందుకంటే నాకు ఈ ముంగిసను చూస్తే చాలా భయం వేస్తున్నది. నేను నీ దగ్గరకు చేరుతాను. నన్ను రక్షించు, చంపకు. అప్పుడు నేను నిన్ను రక్షించగలుగుతాను. అలాగే ఆ కౄరమైన గుడ్లగూబ కూడా నన్ను తినాలని అనుకుంటున్నది. దాని నుండి కూడా నన్ను రక్షించు. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను నీ పాశాలను కొరికివేస్తాను.’’

01/24/2019 - 19:39

ఒక అరణ్యంలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉండేది. దానిని చుట్టుకొని ఎన్నో తీగలు, దాని కొమ్మలపైన ఎన్నో పక్షులు ఉండేవి. దాని కొమ్మ అన్ని వైపులా విస్తరించి బాటసారులకు చల్లని నీడనిచ్చేది. ఎన్నో ప్రాణులకు, పాములకు జీవజంతువులకు అది ఆశ్రయమైంది. దాని మొదలు యొక్క చుట్టుకొలత చాలా పెద్దదిగా ఉన్నది. ఆ మొదట్లో ఉన్న రంధ్రంలో కలుగు త్రవ్వుకొని ఒక ఎలుక సుఖంగా జీవిస్తూ ఉండేది. దాని పేరు పలితం. అది చాలా తెలివైనది.

01/23/2019 - 19:38

పూర్వం కాయవ్యుడు అనే ఎరుకలవాడు ఉండేవాడు. అతను వృత్తి చేత దోపిడీదొంగ. కాని నిజజీవితంలో అతను బుద్ధిమం తుడు, శూరుడు, చదువుకున్న వాడు, కౄరత్వం లేనివాడు. అతనికి నాలుగు వర్ణాశ్రమాలలో ఉన్న ధర్మాల గురించి క్షుణ్ణంగా తెలుసు. బ్రహ్మజ్ఞానం కలవాడు. గురువులను పూజించే వాడు. అతను ఒక క్షత్రియునికి, నిషాదికి జన్మించాడు. కనుక క్షత్రియ ధర్మాలను చక్కగా నిష్ఠతో పాటించే వాడు. కనుక అతను దస్యుడయినా సిద్ధి పొందాడు.

01/22/2019 - 18:44

లోకంలో మూడు రకాల ప్రాణులు ఉన్నారు. కష్టాలు రాకమునుపే వాటి నివారణ ఉపాయం ఆలోచించేవాడు అనాగతవిధాత.
సరియైన సమయంలో ఆత్మ రక్షణకు ఉపాయం వెతికేవాడు ప్రత్యుత్పన్నమతి. ఈ రెండు రకాల వారు సుఖంగా ఉన్నతిని పొందుతారు.

01/21/2019 - 18:50

రుద్రాంశ అయన కాళరాత్రిని అల్లె త్రాటిని చేశాడు. శివునికి విష్ణువు ఆత్మయే కనుక ఆ రాక్షసులు ధనుస్సు, అల్లెత్రాటి స్పర్శను సహించలేకపోయారు. ఈశ్వరుడు ఆ బాణంతో తన క్రోధాగ్నిని ఉంచాడు. ధూమ్రవర్ణుడై, చర్మాంబరధరుడై, పదివేల సూర్యులతో సమానతేజస్వియై నీలలోహితుడు తేజస్వుల జ్వాలలతో ఆవరించబడి జ్వలించాడు.

01/20/2019 - 22:20

‘‘మా పట్టణంలో ఒక బావి కావాలి. శస్త్ర ఘాతాలతో మరణించిన దానవులను అందులో వేస్తే వారు పునర్జీవితులు కావాలి’’. ఆ విధంగా బ్రహ్మ వరం పొంది హరి ఆ పురంలో మృతులను బ్రతికించే బావిని సృష్టించాడు. దైత్యుడు ఏ రూపంలో చనిపోతే అతన్ని బావిలో పడవేస్తే ఆ రూపంతో బతికేవాడు. ఈ బావిని పొందిన దైత్యులు ముల్లోకాలను హింసించేవారు. బావి వలన వారికి క్షయం లేదు. వారు అన్ని లోకాలను కొల్లగొట్టసాగారు.

01/18/2019 - 19:15

అరణ్యంలోని అన్ని జంతువులు ఈ శరభానికి భయపడి అన్ని దిక్కులకు పారిపోయాయ. ఆ శరభం ఆ ప్రాణులను చంపుతూ చాలా సంతోషించింది. అది మాంసం రుచి మరిగి ఫలాలను తినడానికి ఇష్టపడడం లేదు. ఇప్పుడు అది బలిష్టంగా ఉంది. దానికి తోడు రక్త పిపాస కలిగింది. కుక్కలకు ఉండే విశ్వాసం దానికి పోయ అది మునినే చంపాలని అనుకుంది. అది ఇలా ఆలోచించింది. ఇతనికి గొప్ప మహిమ ఉంది.

Pages