S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

10/23/2018 - 18:56

రాజసూయ యాగానికి ముందు శ్రీకృష్ణుడు జరాసంధుని సంహరించడానికి తగిన సమయ మని భావించాడు. అతను యుధిష్టరునితో ఇలా అన్నాడు. ’’ హంస డింభకులు ఇప్పటికే నాశనం అయ్యారు. కంసుడు చంపబడ్డాడు. కనుక జరాసంధ వధకు ఇదే సరైన సమయం. అతన్ని బాహుబలంతోనే చంపాలి. నాలో రాజనీతి ఉంది. భీమునిలో బాహుబలం ఉంది. అర్జునునిలో రక్షణ సామర్థ్యం ఉంది. కనుక మనం జరాసంధుని ఆణచివేయగలం.

10/22/2018 - 00:04

పూర్వం మగధరాజ్యాన్ని బృహద్రథుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడు బల సంపన్నుడు. గొప్ప పరాక్రమ శాలి. అందగాడు. అతను సౌందర్యవంతులు గుణవంతులు అయన కాశీరాజు ఇద్దరి పుత్రికలను వివాహం చేసుకొన్నాడు. వారిద్దరు కవలలు. వారిద్దరినీ అతను సమానంగా గౌరవించి ఆదరించాడు. వారిద్దరితో కలిసి చాలా కాలం జీవించినప్పటికీ అతనికి సంతానం కలుగలేదు.

10/19/2018 - 23:14

వారి మాటలు విన్న అగ్నికి మందపాలుని కిచ్చిన మాట గుర్తు వచ్చింది. ‘‘నీవు ద్రోణుడవనే ఋషివి. బ్రహ్మతత్త్వాన్ని చక్కగా వ్యాఖ్యానించావు. మీ కోరిక తీరుస్తాను. నా వలన మీకు భయం కలుగదు. మీ తండ్రి మందపాలుడు ముందే మీ గురించి చెప్పాడు. నేనేం చేయాలో చెప్పు’’.

10/15/2018 - 22:39

బ్రహ్మదేవుడు వారి ప్రార్థన ఆలకించి విశ్వకర్మను పిలిచి ‘ఒక అత్యంత సుందరమైన స్ర్తిని వారి వధ కోసం తయారుచేయ.’ అని చెప్పాడు. విశ్వకర్మ ఒక దివ్య సుందరిని తయారుచేశాడు. ముల్లోకాల్లో ఏ పదార్థం శ్రేష్టమైనదో దానిని ఆ సుందరి శరీరంలో అమర్చాడు. ఆ యువతి అవయవాల్లో ఎన్నో రత్నాలను పొదిగాడు. వాటితో ఆమె రత్న కిరణాలను వెదజల్లింది. లక్ష్మీ శరీరం దాల్చినట్లు ఆ కామరూపిణి సర్వప్రాణుల చూపులను ఆకర్షించింది.

10/14/2018 - 22:47

పూర్వం హిరణ్యకశిపుని వంశంలో నికుంభుడనే రాక్షసుడు ఉన్నాడు. అతడు మహాబలవంతుడు. పరాక్రమవంతుడు. అతనికి పరాక్రమంలో సమానమైన ఇద్దరు కుమారులు పుట్టారు. వారికి సుందుడు ఉపసుందుడని తండ్రి పేర్లు పెట్టాడు. వారిద్దరు చాలా క్రూర స్వభావం కలవారు. ఇద్దరూ ఏ పనైనా ఒకే నిశ్చయంతో కలిసి చేసేవారు. కలిసి ఉండేవారు. వారికి సుఖదుఃఖాలు వేరుగా లేవు. ఇద్దరూ కలిసే అనుభవించేవారు. ఒకరిని విడిచి రెండవవారు ఉండేవారు కాదు.

10/12/2018 - 18:36

కనుక నా కుమారుడు అయన ఔర్యుడే మిమ్మల్ని అనుగ్రహించవలసినవాడు. మీరంతా తలలు దించుకుని అతని ముందు నిలబడితే అతను మిమ్మల్ని క్షమిస్తాడు.’’

10/11/2018 - 18:30

పూర్వం వ్యుషితాశవుడనే మహారాజు ఉండేవాడు. అతడు పూరు వంశానికి చెందినవాడు. మహా ధర్మాత్ముడు. ఒకసారి అతను యాగం చేస్తూ ఉండగా, ఇంద్రుడు దేవతలు మహర్షులు అక్కడికి వచ్చారు. ఇంద్రుడు ఆనందంతో సోమసానం చేసి సంతృప్తుడైనాడు. బ్రాహ్మణులు దక్షిణలతో సంతృప్తి చెందారు. ధర్మాత్ముడు రాజర్షి అయ ఆ వ్యుషితాశవుడు చేసిన యాగంలో దేవతలూ బ్రహ్మర్షులు అన్ని పనులు స్వయంగా చేశారు. దానితో రాజు అందరికన్నా మిన్నగా ప్రకాశించాడు.

10/10/2018 - 18:31

పూర్వకాలంలో మాండవ్యుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతను సత్య తపోనిష్ఠుడు, ధర్మజ్ఞుడు, మహాతపస్వి, మహాయోగి. ఆ మహర్షి తపస్సులో నిశ్చలుడై ధ్యానంలో ఉండగా కొందరు దొంగలు తాము దొంగిలించిన సొమ్ము అతని ఆశ్రమంలో దాచి సైనికులు వచ్చే లోగా దాక్కున్నారు. వారిని వెంబడించిన భటులు ఆశ్రమం లో తపస్సు చేసుకొంటున్న ఆ ఋషిని చూసి ఇలా అడిగారు. ‘ఓ విప్రోత్తమా!

10/09/2018 - 19:04

శంతనుడు తన దుఃఖాన్ని ఆపుకుంటూ ఆమెతో ఇలా అన్నాడు ‘‘ఈ శిశువును చంపవద్దు! నీవు ఎవరి కుమార్తెవు? ఎందుకు ఈ శిశువులను చంపుతున్నావు? ఇలా కుమారులను చంపి మహాపాపాన్ని పొందుతున్నావు’’

10/08/2018 - 18:51

ఆ తేజస్సుతో నీ కొక కొడుకు పుడతాడు. అతడు రాజు కోరిక తీరుస్తాడు. కాని అతనికి మాత్రం మానవలోకంలో సంతానం ఉండదు’’. ఈ విధంగా గంగానదితో ఒప్పందం చేసుకొని వసువులు వెళ్లిపోయారు. ప్రతీప మహారాజు సర్వప్రాణులయందు దయ కలిగినవాడు. ఆయన గంగా ద్వారంలో నివసిస్తూ ఎన్నో సంవత్సరాలు జపిస్తూ కూర్చుని ఉన్నాడు. అప్పుడు గంగ సుందరమైన రూపుదాల్చి ఆ రాజర్షి వద్దకు వచ్చి అతని కుడితొడపై కూర్చుంది.

Pages