S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

09/05/2018 - 18:29

అయితే ఫలానా పెట్టె ఎక్కడ వుంది అని అడిగినప్పుడు అణుఖండాల కొలతలలో దాని స్థానం ఎక్కడ వుందో చెప్పమని మన వుద్దేశ్యం కాదు. అలా కాక ఒక హైడ్రోజను అణువు తీసుకోండి. దాని మధ్యలో ఒక నూట్రాన్ వుంది. దాని చుట్టూ ఒక ఎలక్ట్రాన్ తిరుగుతూ వుంది. సరీగా ఈ సమయంలో ఆ ఎలక్ట్రాన్ ఏ మూల వుంది? అని ప్రశ్నించాం అనుకోండి. అప్పుడు సమాధానం ‘పెట్టె అలమరలో వున్నది’ అన్నంత స్థూలంగా చెప్పలేము.

09/04/2018 - 19:07

సిలికాన్ అణువు అంటే ఏమిటి? అని ప్రశ్న. వైజ్ఞానికుడు వచ్చి ఆ రాతిని నూరి ఒక అణువును చూపాడు. ‘‘ఇది అణువు. దీని మధ్యలో ఒక న్యూట్రాన్ వుంటుంది. దాని చుట్టూతా కొన్ని ఎలక్ట్రానులు పరిభ్రమిస్తూ వుంటాయి’’ అని చెప్పాడు. ఎలక్ట్రాన్ అంటే ఏమిటి? దాని స్థితి ఏమిటి? అని మళ్ళీ ప్రశ్న. ఇక్కడే హైసన్‌బర్గ్ ప్రవేశించాడు. ఈ ఎలక్ట్రానులు ఒక విధంగా వుండటం లేదు.

09/03/2018 - 19:25

మన పురాణాలలో సూర్యకిరణాలను వర్ణించిన తీరు రుూ సిద్ధాంతానికి సంపూర్ణంగా సరిపోతోంది. సూర్యుడికి ఏడు గుఱ్ఱాలు ఉన్నాయని, వాటిని పాముల పగ్గాలతో పట్టుకొంటున్నాడని పురాణాలు చెపుతూ వున్నాయి. ఈ పాముల గమనం అలల గమనం లాగా వుంటుంది. అలాగే అవి తోక దగ్గర సన్నగా వుండి తల దగ్గరకొచ్చే సరికి లావుగా వుంటాయి.

08/30/2018 - 19:21

6. నాద చికిత్స
పూజ గురించి చెప్పుకున్నాం. పూజ మంత్రంతో కూడి పడి వుంది. మంత్రం అంటే వేదం. వేదానికి మూల రూపం నాదం. ఆ నాదాన్ని గూర్చి కూడా కొంచెం తెలుసుకుందాం.

08/29/2018 - 18:30

ఈ వ్రేళ్ళమధ్య మృదువుగా వుండే పూసలుపెట్టి వాటిని నియమిత కాలప్రమాణంలో కదలిస్తూ వుంటే అది మనసును అదే ప్రమాణంలోవున్న తాళంగా తయారుచేస్తుంటాయి. దీనిని మంత్రంయొక్క రిథమ్‌లో సింక్రనైజ్‌చేస్తే ఇటు వ్రేళ్ళు-అటు మంత్రం కూడా సూత్రప్రాయంగా ట్యూన్ అవుతాయి. దీనివలన మంత్ర జపం సులభవౌతుంది.

08/27/2018 - 18:46

11. ధూపం- ధూపమంటే సుగంధంగల పొగ. వచ్చిన పెద్దమనిషికి పొగ చూపటమేమిటి అనే సందేహం కలుగవచ్చు. కానీ ఆయుర్వేద విధానంలో స్నానానంతరం కొన్ని ప్రత్యేక ద్రవ్యాల ధూపాలని వంటికి పట్టించుకోవటం కేశాలకూ, ముఖ వర్చస్సుకు, ఊపిరితిత్తులకూ కూడా చాలా అవసరం గనుక, ధూప సమర్పణ ఒక పూజా ప్రక్రియగా ఏర్పడింది. భారతదేశంలో గ్రామాలలో యిప్పటికీ స్ర్తిలు, ముఖ్యంగా బాలింతరాళ్లు, స్నానానంతరం ధూప సేవనం చేయటం ఆచారంలో వుంది.

08/24/2018 - 18:16

ఈ పనులన్నీ సంకేతంగా పనిచేసే మన మనస్సులో ఆయా పనులు ఆ చైతన్యమూర్తికి జరుగుతూ వుండాలి. మనస్సులోంచి చైతన్యమూర్తి తొలిగిపోతే బహిరంగ పూజ కేవలం నాటకవౌతుంది. అయినప్పటికీ అత్యంత ప్రాథమిక దశలో వున్నవారు రుూ బహిరంగ ప్రక్రియను మొండిగా కొనసాగించినట్లైతే వారికి మానసిక భావన క్రమక్రమంగా అందుకుంటుంది.

08/23/2018 - 18:55

ఏకాగ్రత సాధనకు మరో ముఖ్యమైన అంశం ప్రశాంతి. ఈ ప్రశాంతి మన చేతిలో వుండదు. ఉంచుకోగలిగితే ఏకాగ్రత బాగానే వుంటుంది. దీని సాధన పైన చెప్పిన క్రమశిక్షణ కంటే కూడా కష్టమైనది. ఏకాగ్రతకు మరో ముఖ్యాంశం మృదుహృదయం. హృదయం మృదువుగా వున్నప్పుడు ఏకాగ్రత త్వరగా సిద్ధిస్తుంది. క్రమశిక్షణ, ప్రశాంతి, మృదుత్వం ఈ మూడూ మూడు రసాయనాల వంటివి. వీటి సమ్మేళనంతో చేసే వైజ్ఞానిక ప్రయోగమే ‘పూజ’.

08/22/2018 - 19:29

పీసపాటి వెంకట గోపాలకృష్ణమూర్తిగారు డూజష్ద్ఘర్ఘీ జశళ్ఘూ ఘఔఔ్యనజ్ఘౄఆజ్యశ ఆ్య శ్యశజశళ్ఘూ గళ్ఘజఆక అనే గ్రంథం వ్రాశారు.
పై రేషియో:
పై విలువను- ఆర్యభటుడు (11వ శతాబ్ది) 3.1416024గా చెప్పాడు. చైనావారు- 3.1415926 అన్నారు.
గుంటూరుకు చెందిన శ్రీ వి.వి.రావుగారు శ్రీ చక్రదర్శనం అనే గ్రంథంలో, శ్రీ విద్యాసూత్రాల నుంచి పై విలువను సాధించి చూపించారు.

08/21/2018 - 19:24

నవశక్తులు! నవావరణాలు! నవ రాత్రులు! అనే సంప్రదాయాలు ఏర్పడ్డాయి.
శ్రీ చక్రంలో నవావరణల పేర్లు-
1. భూపురత్రయము= త్రైలోక్య మోహన చక్రము
2. షోడశదళ పద్మము= సర్వాశాపరిపూరక చక్రము
3. అషదళ పద్మము= సర్వసంక్షోభిణీ చక్రము
4. చతుర్దశారము= సర్వసౌభాగ్య చక్రము
5. బహర్దశారము= సర్వార్థసాధక చక్రము
6. అంతర్దశారము= సర్వరక్షాకార చక్రము

Pages