S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

01/16/2019 - 18:17

పూర్వం పురిక అనే నగరానిని పీఠకుడనే రాజు పరిపాలించేవాడు. అతను చాలా దురాత్ముడు. క్రూర స్వభావం కలవాడు. ఇతరులను హింసించి ఆనందించేవాడు. కొంతకాలానికి అతనికి ఆయువు తీరి పోయింది. తాను చేసిన క్రూర కర్మల ఫలితంగా ఆరాజు నక్కగా జన్మించాడు. కాని అతనికి తన పూర్వ జన్మ వైభవం గుర్తుండి పోయింది. దాన్ని స్మరిస్తూ పరమ దుఃఖాన్ని పొందాడు. ఎవరైనా మాంసాన్ని తెచ్చి ఇచ్చినా తినలేదు. సకల ప్రాణులను హింసించడం మానివేశాడు.

01/14/2019 - 18:29

ధర్మరాజుకు ఒకసారి ఒక సందేహం కలిగింది. ‘‘రాజు ఎవరి ధనానికి స్వామి అవుతాడు. అతని ప్రవర్తన ఏవిధంగా ఉంటే ఆదర్శమైన రాజు అని ప్రజలు అంటారు. ఈ సందేహలకు సమాధానం చెప్పుమని అతను పితామహుడైన భీష్ముని ప్రార్థించాడు. అప్పుడు భీష్ముడు అతనికి ధర్మ సందేహలన్నీ తీర్చి, ఉదాహరణగా ఒక రాజు గురించి ఇలా చెప్పాడు

01/13/2019 - 23:20

అతనికి భయంకరుడైన పుత్రుడు కలిగాడు. అతను ధనుర్విద్యాపాంరగతుడు, సకల విద్యలూ నేర్చినవాడు. అగ్నిలాగ ప్రకాశించాడు, అతడు క్షత్రియులందరినీ సంహరించాడు. అతనే జగద్విఖ్యాతి చెందిన పరశురాముడు. అతను గంధమాదన పర్వతం మీద తపస్సు చేసి శంకరుని అనుగ్రహం పొంది దివ్యాస్త్రాలు, తేజస్సుతో ఉన్న పరశువును పొందాడు. ఆ పరశువు గొప్ప శక్తికలది. దానితో అతను లోకాల్లో సాటిలేని వాడుగా యశస్వి అయినాడు.

01/11/2019 - 19:07

జహ్నుమహర్షి కుమారుడు అజుడు. అతని కొడుకు బలా కౌశవుడు. అతని కుమారుడు కుశికుడు. అతను ధర్మాత్ముడు. ముల్లోకాలను జయించే పుత్రుడు కలగాలని కుశికుడు గొప్ప తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి ఇంద్రుడు అతనికి పుత్రునిగా జన్మించాడు. అతని పేరు గాధి. అతనికి సత్యవతి అనే పుత్రిక కలిగింది. గాధి ఆమెను భృగుమహర్షి పుత్రుడైన ఋచీకునకు ఇచ్చి వివాహం చేశాడు.

01/10/2019 - 19:37

కురుక్షేత్ర యుద్ధానంతరంవిజయం పొందిన పాండవులు తిరిగి నగర ప్రవేశం చేస్తున్నారు. రాజమార్గంలో నాలుగు వైపులా వీధులన్నీ అలంకరించారు. అక్కడ నిలుచున్న స్ర్తీలు ద్రౌపదిని, ఆమె చేసిన సేవలను ప్రశంసించారు. వారు రాజమార్గాన్ని దాటి రాజమందిరం చేరుకున్నారు. అక్కడ వేదపండితులు, బ్రాహ్మణులూ ధర్మరాజును ఆశీర్వదించారు. అతను వారిని యథోచితంగా సత్కరించాడు.

01/09/2019 - 19:07

పూర్వ సముద్ర తీరంలో ఒక ధర్మాత్ముడైన రాజు ఉండేవాడు అతని రాజ్యంలో గొప్ప సంపదకలిగిన ఒక వైశయుడు ఉండేవాడు అతను చాలా ఉదారుడు. ఓర్పు కలవాడు ధర్మాచరణ చేసేవాడు. అతనికి చాలా మంది పుత్రులు కలరు. ఆ గృహంలో ఒక కాకి కూడా ఉండేది. అది ఆ పిల్లలు పారవేసిన ఎంగిలి మెతుకులు తింటూ అక్కడే ఉండేది.

01/08/2019 - 19:43

అతని మాటలు విన్న రాజు ఇలా తలచాడు. - ‘‘ఈ ఇద్దరి వివాదం ఇప్పుడే వచ్చి పడింది. బ్రాహ్మణుడు కూడా దానం స్వీకరించమని వత్తిడి తెస్తున్నాడు. ఏం చేయాలి?’’
రాజు వికృత, విరూపులతో ఇలా అన్నాడు. ‘‘మీ వివాదం తీరిన తర్వాతే వెళ్ళండి. నా రాజధర్మం అబద్ధం కాకూడదు. రాజులు స్వధర్మ పరిపాలన చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయ. ఇప్పుడు ఈ కఠినమైన బ్రాహ్మణ ధర్మం కూడా నన్ను ఆవేశించింది.’’

01/07/2019 - 19:38

నేను మాట తప్పను. నీవు నీ మాట పాటించు. అసత్యమాడకు. నేను ఇస్తానన్నాను కనుక నీవు స్వీకరించవలసిందే. నీవు అడిగిన మాట మీద స్థిరంగా ఉండు. ఎందుకంటే అసత్యవాదులకు ఇహపరాలు రెండూ ఉండవు. అతడు పితరులను, భవిష్యతరాలను కూడా తరింపచేయలేడు. ఎన్ని తపస్సులు ఎంత చేసినా అవి సత్యాన్ని మించిపోలేవు. సత్యమే అక్షర బ్రహ్మ. సత్యమే నశించని తపస్సు. సత్యమే అక్షర యజ్ఞం. సత్యమే అక్షర వేదం. సత్యం యొక్క ఫలమే సర్వ శ్రేష్ఠమైన ఫలం.

01/06/2019 - 22:21

సావిత్రీ దేవి ‘అట్లే జరుగుతుంది’ అని దీవించింది. ఆ దేవి ఇంకా ఇలా అన్నది - ‘ద్విజశ్రేష్ఠులు పొందే సాధారణ లోకాలకు నీవు వెళ్ళవు. అనిందితమ్మ, అనిమిత్తమ్మ అయన బ్రహ్మ పదాన్ని నీవు పొందగలవు. నీవు కోరుకున్నది జరుగుతుంది. నియతితో, ఏకాగ్ర చిత్తంతో సాధన చేయ. ధర్ముడు నిన్ను సేవిస్తాడు. కాలుడు, మృత్యువు, యముడు - నీ సన్నిధిలో ఉంటారు.

01/04/2019 - 19:50

అప్పుడు ‘తనువు’ ఆ ఋషుల మధ్య కూర్చుని ధర్మార్థాలతో కూడిన కదను చెప్పసాగాడు. అతను కదలు అలా చెప్తూ ఉండగా ఒక రాజు తన సైన్యంతో అంతఃపుర స్తల్రతో సహా అక్కడికి వచ్చాడు. అతనే భూరిద్యుమ్నుని తండ్రి. అతని పేరు వీరద్యుమ్నుడు. అతను అరణ్యంలో తన పుత్రుని కోల్పోయి చాలా దుఃఖంతో ఉన్నాడు. అతను ఆ కుమారుని కోసం ఆ వనంలో తిరుగసాగాడు. ‘పరమధార్మికుడు, ఒక్కడే కొడుకు ఇక అతనిని చూడడం నాకు దుర్లభం’ అని రాజు చింతించసాగాడు.

Pages