S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

12/25/2018 - 19:20

దేవతలు కూడా భీష్ముని వారించారు. ‘‘ఇక ఈ యుద్ధం ఆపు. గురువైన పరశురామునితో యుద్ధం తగదు. రాముడిని యుద్ధంలో జయించడం నీకు న్యాయం కాదు. ఆ బ్రాహ్మణుని గౌరవించు’’.
మరల పరశురామునితో ఇలా అన్నారు ‘‘్భష్ముడు వసువులలో ఒకడు. వసువుని ఎలా జయించగలవు? అతను దేవతలందరిలో పూర్వుడు. సనాతనుడు అయిన నరుడు అర్జునుడిగా పుట్టి ఇతని మృత్యువుకు కారణవౌతాడని బ్రహ్మ విధించాడు’’.

12/24/2018 - 19:40

అప్పుడు పరశురాముడు భయంకరమైన ఒక శక్తిని వదిలాడు. అది ప్రళయకాల సూర్యుడిలా వెలుగుతూ భీష్మునిపైకి వచ్చింది. అతను ఆ శక్తిని మూడు ముక్కలు చేసి భూమిపై పడవేశాడు. దాంతో కోపం వచ్చిన భార్గవుడు పనె్నండు ఘోరశక్తులను భీష్ముడిపై వదిలాడు. భీష్ముడు బాణమయవలను ప్రయోగించి వాటిని ఖండించాడు. తర్వాత భీష్ముడు తన దివ్యాస్త్రాలతో పరశురాముని దివ్యాస్త్రాలను సూతుల సహితంగా ఖండించాడు.

12/23/2018 - 22:46

భీష్ముని మాటలతో పరశురామునికి ఆగ్రహం కలిగింది. అతను భీష్మునితో ఇలా అన్నాడు. ‘‘భీష్మా! అదృష్టంకొద్దీ నాతో తలపడాలనుకుంటున్నావు. పద కురుక్షేత్రానికి. అక్కడ నా బాణాల చేత చచ్చిన నీవు కాకులకు, గ్రద్ధలకు ఆహారమవుతుంటే నీ తల్లి గంగాదేవి చూస్తుందిలే’’. అలా అంటున్న పరశురాముని శిరసు వంచి ప్రణామం చేసి భీష్ముడు కురుక్షేత్రానికి బయలుదేరాడు.

12/21/2018 - 19:52

అప్పుడు అంబ ఇలా అంది ‘‘ప్రభూ! నేను శోకం అనే ఊబిలో కూరుకొనిపోయాను. నన్ను ఉద్ధరించు’’ అలా అని ఆమె జరిగినదంతా భార్గవరామునికి నివేదించింది. అప్పుడు అతను అంబతో ఇలా అన్నాడు. ‘‘అమ్మారుూ! నిన్ను భీష్ముని దగ్గరకు పంపుతాను. అతను నా మాట జవదాటడు. ఒకవేళ నేను చెప్పింది చేయకపోతే యుద్ధంలో అతన్ని నా శస్త్రాలతో దహించివేస్తాను. అది నీకిష్టం లేకపోతే వీరుడైన సాళ్వుని ఈ పని చేయమంటాను.’’

12/20/2018 - 18:57

మునులందరు ఈ విషయమై చర్చిస్తున్న సమయంలో తపస్వి హోత్రవాహనుడు అక్కడికి వచ్చాడు. అతను కూర్చున్న తర్వాత వారంతా అంబ సమస్యను అతనికి తెలిపారు. విషయం విని అతను విచారించాడు. అతను అంబకు తల్లి తండ్రి అంటే తాతగారు అవుతాడు. అతడు అంబను దగ్గర కూర్చోబెట్టుకొని జరిగినదంతా వివరించ మన్నాడు. అంబ అతనికి అన్ని సంగతులు చెప్పింది.

12/19/2018 - 18:58

పూర్వం కాశీరాజుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారి పేర్లు అంబ, అంబిక, అంబాలిక. వారు యుక్త వయస్కులై స్వయంవరానికి సిద్ధంగా ఉన్నారు. రాజు వారి స్వయంవరానికి సమస్త దేశాల రాజులను ఆహ్వానించాడు. ఆ స్వయంవరానికి తన తమ్ముడైన విచిత్రవీర్యుని కోసం, భీష్ముడు కూడా వెళ్లాడు. అతను అక్కడ సమావేశమైన రాజులందరినీ హెచ్చరించి, తాను ఆ కన్యలను తన తమ్ముని కోసం తీసుకొనిపోతున్నాని చెప్పి వారిని రథం పైకి ఎక్కించాడు.

12/18/2018 - 19:33

ఆ విధంగా పుణ్యవతి అయిన ఆ కన్యక పంచగంగలలో, వెదురు వనాలలో తపస్సు చేసి తన శరీరాన్ని కృశింపజేసింది. తర్వాత గంగాతీరానికి వెళ్లింది. అనంతరం ఆమె మహామేరువును చేరి అక్కడ ప్రాణాయామంతో నిశ్చలంగా రాయిలా ఉండిపోయింది.తర్వాత హిమవత్పర్వతం చేరింది. తర్వాత ఆమె అనేక తీర్థాలలో తిరిగింది. ఆమె బ్రహ్మయందు భక్తి కలిగి ఉన్నది. ఈ విధంగా తపస్సు చేసి ఆమె పితామహుని సంతోషపెట్టింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెతో ఇలా అన్నాడు.

12/17/2018 - 18:50

పూర్వం కృతయుగంలో అకంపనుడు అనే రాజు ఉండేవాడు. అతన్ని యుద్ధరంగంలో శత్రువులు జయించారు. అతని పుత్రుడు హరి. అతను నారాయణునితో సమాన బలం కలవాడు. అతన్ని యుద్ధంలో శత్రువులు సంహరించారు. అకంపనుడు పుత్రునికి ఉత్తరక్రియలు జరిపించి రాత్రింబవళ్లు పుత్రునికోసం దుఃఖిస్తూ ఉండేవాడు. అతని దుఃఖవిషయం తెలిసి నారదమహర్షి అతన్ని చూడడానికి వచ్చాడు. రాజు అతన్ని పూజించి తన కుమారుని మరణవార్త తెలిపాడు.

12/16/2018 - 22:18

‘‘ఓ మహాత్మా! నాకు ఇవి సిద్ధించడానికి కారణం నీవే. స్వయంగా లోపలికి వచ్చి చూడు’’ అని అతను కౌశికుని ఇంటిలోపలికి తీసుకొని వెళ్లాడు. లోపల ఇల్లు చాలా పరిశుభ్రంగా ఉంది. ధర్మవ్యాధుని తల్లిదండ్రులు శుభ్రమైన వస్త్రాలు ధరించి భోజనం చేసి లోపల ఒక అరుగుమీద కూర్చుని ఉన్నారు. ఒకవైపు పడుకోవడానికి మంచాలు ఉన్నాయి. ధర్మవ్యాధుడు వారి పాదాలు స్పృశించి నమస్కరించాడు. వారు అతన్ని దీవించి ఇలా అన్నారు.

12/14/2018 - 18:27

కాని ఇంద్రియాలను జయించిన వాడు, మనస్సును వశం చేసుకొన్న వాడు ఇహలోక పరలోక సుఖాలు పొందుతాడు. ఈ లోకంలో ఎవరినీ బాధించకుండా తన వృత్తినే చేసుకోవాలి. శిష్టుల ఉపదేశాన్ని అనుసరించి స్వధర్మాన్ని ఆచరించాలి. వివేకవంతుడు ఈ ధర్మాచరణలో ఆనందిస్తాడు. ధర్మబద్ధంగా సంపాదిం చిన ధనంతోనే జీవనం సాగిస్తాడు.

Pages