S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రసాదం

03/09/2018 - 20:58

‘‘రామతత్వం జీవతత్త్వంగా, జీవన తత్త్వంగా జీవిత తత్త్వంగా ప్రతి మనిషిలోను, మనసుల్లోను పరిమళించి పరిమళాలు వెదజల్లితే- అంతా రామమయమే’’ అన్నాడో మహనీయుడు.
జీవన తత్త్వానికి అవతారతత్త్వాన్ని సమన్వయం చేసిన లోతైన అద్వితీయ సందేశాత్మక ప్రబోధమిది.

03/07/2018 - 21:00

పూజలు, వ్రతాలు నోములు చేయటం భక్తి కాదు. భక్తి సాధనాలు, భక్తిని సాధించటానికి వంటపట్టించుకోటానికి చేసే అభ్యాసాలు అభిషేకాలు, ఆరాధనలు, అర్చనలు, నైవేధ్యాలు, ఉపవాసాలు, పారాయణాలు జాగరణలు భక్తి కాదు. అవి కూడా భక్తి సాధనకు ఉపయోగడే సాధనాలు. ఉపకరణాలు. సాధారణంగా, స్థూలంగా మనం రెండూ ఒకటే అనుకుంటుంటాం. అనుకుంటున్నాం.

03/05/2018 - 01:50

గురువు జ్ఞానమిస్తాడు.సుజ్ఞాన మందిస్తాడు. ఆలోచనని ఇస్తాడు. ఓ విధానాన్ని, ఓ పథాన్ని ఇస్తాడు. జీవనాన్ని ఇస్తాడు. జీవన విధానాన్ని తెలియజేస్తాడు. ఓ టార్చ్‌లైట్‌లా చూపుతాడు. ఓ తల్లిలా మనకేం కావాలో అవి సమకూరుస్తాడు. ఓ తండిలా మన చేయిపట్టి నడిపిస్తాడు. నడక నేర్పుతాడు. మొత్తంగా జీవన తత్తాన్ని, జీవితతత్త్వాన్ని నేర్పిస్తాడు.

03/02/2018 - 20:58

ఓ కుందేలు భూమాత దగ్గర కొంత మొత్తాన్ని అప్పు తీసుకుంది. అప్పైతే తీసుకుంది కానీ తీర్చటం ఏ మాత్రం కుందేలుకి ఇష్టం లేదు. తను వున్న ప్రదేశం వదిలి కొత్త ప్రదేశానికి వెళ్లిపోతే భూమాత అక్కడకి రాలేదు. కాబట్టి అప్పు తీర్చాల్సిన అవసరం ఉండదని సంబరపడిపోయింది.

03/01/2018 - 02:11

పరతత్త్వం , పరమాత్మ తత్త్వం ప్రతి పండుగ వెనక దాగి ఉంటుంది. పండుగ పరమాత్మ తత్వాన్ని అంతర్లీనంగా అందిస్తుంది. ప్రతి పర్వదినం పరమాత్మ తత్త్వాని చాటి చెబుతుంది. అంతరార్థం దైవలీలలతోను మహిమలతోను దివ్యత్త్వం తోను ముడిపడి ఉంది. మహత్తర సందేశాన్ని ప్రత్యక్ష్యంగానో, పరోక్షంగానో అంతర్లీనంగా అన్యోపదేశంగానో పండుగలు పర్వదినాలు మనకి అందిస్తాయి.

02/25/2018 - 22:29

రామనామ విశిష్ఠత మీద వేటూరి సుందరరామ్మూర్తిగారి కవితాత్మకత ఇది. ‘‘రామనామము రామనామము రమ్యమైనది రామనామము’’ పల్లె ల్లో పాడుకునే తత్త్వాల్లో తారాడే తాత్త్వికత అది. అంత విశిష్టమైనది రామనామం!

02/23/2018 - 22:37

ఓ పర్యాయం ఓ భక్తుడు తోడు ఎవరూ లేరని ఒంటరైపోయానని దిగులుపడ్డాడు. తోడుకోసం దేవుడ్ని ప్రార్థించాడు.
దేవుడు ప్రత్యక్షమై ‘‘ఏం కావాలో కోరుకో’ అన్నాడు.
‘‘స్వామీ! నాకు అండగా నువ్వు నాతో ఉండాలి. నా తోడుగా ఉండాలి. తోడుగా ఉండి నా సంగతులన్నీ నువ్వే చూసుకోవాలి’’ అని దేవుడ్ని కోరేడు భక్తుడు.

Pages