S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

02/03/2019 - 23:00

ముదురు రంగు మేకప్ షేడ్స్ సహజ స్వరూపాన్ని వైదొలిగేలా చేసి, తేలికైన రంగులు ఎక్కువ కనిపించేలా చేస్తాయి. డైగ్నల్ లైన్ ఆకృతిలో షేడ్స్ వేయడం ద్వారా బుగ్గలు సన్నగా ఉన్నాయనే భ్రాంతిని మేకప్ ద్వారా కలిగించవచ్చు. ముక్కు మధ్య భాగానికి ఇరువైపులా పౌడర్‌ను, కింది వైపుగా తుడవాలి. మేకప్‌తో కళ్లను పెద్దగా కనిపించేలా చేయడం ద్వారా మిగిలిన ముఖం చిన్నదిగా కనిపిస్తుంది. ఇవన్నీ మేకప్ ద్వారా సాధ్యమే..

02/03/2019 - 22:56

ప్రతి కుటుంబంలో ఇంట్లో ఏ గది ఉన్నా లేకపోయినా వంటగది శుభ్రత తప్పనిసరి. అది ఇంట్లోవారి సంబంధ బాంధవ్యాలతో పాటు ఇంట్లో వారి శుభ్రత, క్రమ పద్ధతిని కూడా ప్రతిబింబిస్తుంది. అంతేకాకుండా ఇంటి ఆరోగ్యం ఈ గది మీదనే ఆధారపడి ఉంటుంది. వంటగదిని సక్రమంగా నిర్వహించడం ఇల్లాలికి ఛాలెంజింగ్ జాబ్ అనే చెప్పాలి. ఆరోగ్యవంతమైన కుటుంబం.. శుభ్రమైన వంటగదితోనే సాధ్యం. అందుకు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరి..

01/31/2019 - 18:26

కుచ్చులను ఇప్పుడు టాజిల్స్ అంటున్నారు. ఇదే నేటి ట్రెండ్.. కుచ్చులు అనగానే పట్టుచీర చెంగు అంచుల్లో వేలాడే కుచ్చులే మనకు గుర్తొస్తాయి. ఇదంతా ఒకప్పటిమాట. ఇప్పుడు ఈ కుచ్చులే అని రకాల దుస్తుల డిజైన్‌లకు అదనపు అందాన్ని తెచ్చిపెడుతూ మెరిసిపోతున్నాయి. సంప్రదాయ దుస్తులతోపాటు ఫ్యూజన్, పాశ్చాత్య శైలి దుస్తుల్లోనూ ఈ టాజిల్స్ కనికట్టు చేస్తున్నాయి.

01/31/2019 - 10:53

నిలకడస్థితిలో పని, కదలిక లేని జీవన విధానాల వల్ల వెన్నెముకలో, ముఖ్యంగా కింది భాగంలో నొప్పి కలగటం చాలా సాధారణం. తప్పుడు భంగిమ, చైతన్య రహిత జీవనం, ఎక్కువ సమయం కూర్చుని పనిచేయడం, పోషకాహారలోపం వల్ల వెనె్నముక కింది భాగంలో నొప్పిని కలుగచేసే కారణాలుగా చాలామంది చెబుతుంటారు. ఇది నిజమే.. వీటివల్ల భవిష్యత్తులో వెన్నునొప్పి మరింత పెరగవచ్చు.

01/29/2019 - 19:04

మరికొద్దిరోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. సాధారణంగా పరీక్షల సమయంలో ఎంత బాగా చదివిన విద్యార్థులైనా తమకు తెలియకుండానే కొంత ఒత్తిడికి గురవుతుంటారు. కొందరు విద్యార్థుల్లో ఈ ఒత్తిడి కారణంగా చదివినది మరచిపోవడం, పరీక్షల పట్ల భయం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

01/28/2019 - 18:54

కడుపుతో ఉన్నప్పుడు పొట్ట ఉబ్బరం, గ్యాస్ సమస్యలు సర్వసాధారణం. ఇలాంటి సమస్యలను సులభంగా తగ్గించే పద్ధతులను పెద్దవాళ్లు తరచూ చెబుతూ ఉంటారు. ఆ చిట్కాలేంటో చూద్దాం.

01/27/2019 - 22:48

కంటి చుట్టూ చాలామందికి నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఇవి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఎన్ని రకాల సౌందర్య చికిత్సలు చేయించినా ప్రయోజనం ఉండడం లేదు అనుకుంటూ ఉంటారు. చాలామంది నిపుణులు కూడా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లేదనే చెబుతుంటాయి. అయితే వీటిని అదుపులో ఉంచుకోవడం మాత్రం మీ చేతుల్లోనే ఉంది అని చెబుతారు ఆరోగ్య నిపుణులు. కళ్ల కింద నల్లటి వలయాలు రావడానికి కారణాలు తెలుసుకుంటే తగ్గించుకోవడం సులువవుతుంది.

01/25/2019 - 20:14

ఇండియన్ ఆర్మీ చరిత్రలో తొలిసారి ఓ మహిళా అధికారి మగ జవాన్ల కవాతుకు నాయకత్వం వహించబోతున్నారు. అదీ హైదరాబాద్‌కు చెందిన తెలుగమ్మాయి లెఫ్టినెంట్ భావనా కస్తూరి నేతృత్వం వహించనున్నారు. పురుష కవాతును మహిళా అధికారి లీడ్ చేయడం ఇదే తొలిసారి. 2015 రిపబ్లిక్ డే పెరేడ్‌లో మహిళా కవాతుకు కెప్టెన్ దివ్య అజిత్ నేతృత్వం వహించారు. . అప్పుడు 148 మంది మహిళా సైనికుల దళం పరేడ్‌లో పాల్గొంది.

01/24/2019 - 19:30

పనె్నండేళ్ల నుంచి ఆడపిల్లలకు వైట్ డిశ్చార్జ్ (తెల్లబట్ట) సమస్య మొదలువుతుంది. ఈ విషయం గురించి వారికి అంతగా తెలియదు. కొంతమంది తల్లులకు ఈ విషయం చెబుతారు.. కొందరు మాత్రం ఈ విషయం బయటకు చెప్పడానికి ఇష్టపడరు. పనె్నండేళ్ల వయస్సు నుంచి మెనోపాజ్ వరకు ఈ సమస్య ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెడుతుంది. దీని గురించి చాలామందికి సరైన అవగాహన ఉండదు. తెలుసుకోవడానికి చాలామంది మొహమాటపడుతుంటారు.

01/23/2019 - 19:21

ఒత్తిడి, అతివ్యాయామం వంటివి రుతుక్రమంపై ప్రభావం చూపించవచ్చు. వాటివల్ల రక్తస్రావం తీవ్రంగా కావడం, లేదా కొద్దిగా కావడం, లేదా మొత్తానికి కాకుండా ఉండడం జరగవచ్చు. ఎందుకంటే శరీరం కఠిన శిక్షణను తీసుకున్నప్పుడు శరీరం ఒత్తిడికి గురవుతుంది. దీనివల్ల రుతుక్రమం రాకపోవచ్చు. దానికి కారణం ఏంటంటే.. శరీరం తగినంత ఈస్ట్రోజన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడమే..

Pages