S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

05/23/2018 - 23:42

నేటి స్ర్తిలందరూ ఉద్యోగినులే అవుతున్నారు. కొంతమంది ఆఫీసులకు, పని చేయాల్సిన ప్రదేశాలకు వెళ్లి పనులు చేస్తున్నారు. మరికొంతమంది వర్క్ ఫ్రం హోమ్ అని ఇంట్లో ఉండి పనులు చేస్తున్నారు. మరికొంతమంది స్వయం ఉపాధిమార్గాలను ఎంచుకుని ఏదొక పనిలో పగటి పూట సమయాన్నంతా గడిపేస్తున్నారు. ఇట్లా అందరూ తీరిక దొరకని పనుల్లో సతమతమవుతున్నారు.

05/22/2018 - 21:28

అది 1957వ సంవత్సరం. ఆ రోజు కీర్తిశేషులు పోతుకూచి సాంబశివరావుగారు నిర్వహించే నవ్యసాహితీ సమితి కార్యక్రమం- గురజాడవారి గురించి రాసిన వ్యాసాల పోటీ బహుమతుల ప్రదానం, నారాయణగూడలో ఒక హాలు. త్యాగరాయగానసభ లేదు, రవీంద్రభారతీ లేదు. యద్దనపూడి సులోచనారాణికి మొదటి బహుమతి రూ.లు 116/-, నాకు రెండవ బహుమతి రూ.58/-లు వచ్చాయి. ఆ వేదికే మా మొదటి కలయికకి స్థానం.

05/21/2018 - 22:14

అందం, పరువం, ఆత్మాభిమానం,
పొగరుమోత్తనం, చిలిపితనం...
- అమ్మాయల లక్షణాలు..
హుందా, ఠీవి, పలుకుబడి,
అర్థం చేసుకునే తత్త్వం, అనురాగం...
- అబ్బాయిల గుణాలు..
వెరసి యద్దనపూడి సులోచనారాణిగారు తీర్చిదిద్దిన నాయికానాయకులు.

05/21/2018 - 01:36

ప్రపంచ వ్యాప్తంగా ఆడపిల్లలు సుమారు కోటి 20 లక్షలమందిలో పది లక్షల మంది తొలి పుట్టిన రోజు వరకు కూడా బతకడం లేదనేది ఓ సర్వే చెప్తున్నది. పుట్టబోయే బిడ్డ ఆడబిడ్డే అని తెలుసుకుని కడుపులోనే చంపేసేవాళ్ళు అనేకమంది మన సమాజంలో వేళ్లూనుకుని ఉన్నారు. సాంకేతిక విజ్ఞానం ఎంత అభివృద్ధి సాధించినా ఆడపిల్లల్ని బతికించడంలో మానవ ప్రయత్నం నానాటికీ తగ్గిపోతునే ఉంది.

05/17/2018 - 22:05

అందమైన, రంగురంగుల పూలంటే ఇష్టం ఉండనివారు ఎవరుంటారు చెప్పండి? అదీ అమ్మాయిలకు పూలంటే మరీ మరీ ఇష్టం. అందుకే ఫ్యాషన్ డిజైనర్లు అమ్మాయిల ఫ్యాషన్ల కోసం ఎక్కువగా పూల అందాలనే ఎంచుకుంటారు. దుస్తులు, నగలు, జడ.. ఇలా ప్రతీదాన్లోనూ పూల సోయగాలనే ఇష్టపడుతున్నారు నేటి అమ్మాయిలు. అందుకే ఇప్పుడు ఈ అందాలు పాదాలను అంటిపెట్టుకునే చెప్పుల్లో కూడా చేరాయి. ఇక చెప్పేదేముంది?

05/16/2018 - 22:33

నిజాయితీ అనే ఆజ్యంతో
నిస్వార్థమనే సమిధలతో
కచ్చితమనే నిప్పుతో
సభ్యసమాజంలో నిత్యాగ్ని హోత్రంలా
దశదిశలా కీర్తి వెలుగుల విలువలను ప్రజ్వలింప చేయాలి.

05/15/2018 - 21:32

వేసవిలో ఇంట్లో కూర్చున్నా వేడి అనిపిస్తుంది. ఆ వేడి తగ్గాలంటే చల్లని పొదరిళ్లల్లో ఉండాలనిపిస్తుంది. ఆ పొదరిల్లును మీ ఇంట్లోనే చేసుకోవడమెలానో చూడండి.

05/14/2018 - 22:01

రొటీన్ ప్రకారం అయితే పొద్దునే్న అలారాల మోత- ఆ హోరును లెక్కచేయకుండా బద్ధకించి అలాగే పడుకుంటే.. ‘ఇంకా లేవలేదా’ అంటూ అమ్మా నాన్నలు హూంకరించేస్తారు. ‘తప్పదురా దేవుడా’ అనుకుంటూ నిద్రమత్తంతా నీళ్ళతో వదిలించుకుని ఓ గంట ఫటాఫటా చదివేసి, ఒకటిన్నర ఇడ్లీనో రెండు స్పూన్ల ఉప్మానో లాగించేసరికి కొంపలంటుకున్నట్లు స్కూలు వ్యాను రానే వస్తుంది.

05/11/2018 - 22:59

అబ్బ! ఎంత బావుందో.. మెరిసిపోతోంది. నాకిక్కడంతా చీకటిగా ఉన్నా ఈ అందం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఈమె నాకు ‘‘అమ్మ’’ అవుతుందట. ‘‘అమ్మా!’’ ఎంత బావుందో కదా పిలవడానికి ఈ తియ్యటి పదం.. అమ్మ మొహం డైరెక్ట్‌గా చూడాలనుంది. ఇంకెన్నాళ్లులే తొమ్మిది నెలలే కదా. ఇట్టే గడిచిపోతాయి. బయటకెళ్లి హ్యాపీగా ఆడుకుంటా అమ్మతో నేను చాలా అదృష్టం చేసుకొన్నానుట. ఇలా ఈ అమ్మ కడుపులో పడడానికి.

05/10/2018 - 23:17

** నేడు పసిప్రాయంలో ఉన్న పిల్లలపై అరాచకాలు ఎక్కువ అయ్యాయి. ఇది దేశానికే అరిష్టం. అసలు సృష్టికే అనాచారం. అందుకే ప్రజలంతా వారు వీరను లేకుండా అప్రమత్తత కావాలి. మృగాళ్లను ఏరి పారేయ్యాలి. అసలెందుకు ఇలాంటి అనాచారాలు ఎక్కువఅవుతున్నాయన్న దానిమీద దృష్టి సారించాలి.
----------------------------

Pages