S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

05/10/2018 - 00:03

** కొందరు అమ్మలు వారి కన్నబిడ్డలపైన అతి ప్రేమను పెంచుకుంటారు. వారు ఏం చేసినా సరే వీరికి ముద్దు అనిపిస్తుంది. ఆ పిల్లలు ఇంటికి వచ్చిన అతిథులనో లేక ఇంట్లో ఉన్న పెద్దవారినో ఈసడించుకుంటుంటారు. కాని ఈ అమ్మలు వారిని వారించరు. పైగా వారిని దగ్గర కూర్చోబెట్టుకొని మీ నాన్నమ్మ ఇలాంటిది మీ అత్త అలాంటిది అని లేనిపోనివి నూరిపోస్తుంటారు.

05/08/2018 - 23:08

ప్రతి రంగాన్ని స్ర్తిలు ఆకళింపు చేసుకొని తమదైన సత్తాను చాటడం నేటి నైజం. అన్ని రంగాల్లోను స్ర్తి ముందుకు వెళ్తోంది. అటు ఇంటిని, ఇటు కార్యాలయాన్ని తీర్చిదిద్దుతోంది. రాబోయే తరాన్ని కూడా సృష్టించేది నవీకరించేది స్ర్తినే.

05/07/2018 - 22:53

‘‘వాడి పోవని పూలు వాసనల మురిపించు
వీడిపోవని స్మృతులు వేదనల మరిపించు’’ అన్నారు చే.రా.గారు.
అది అక్షరాలా నిజం.

05/06/2018 - 22:56

యాదృచ్ఛికంగా మొన్నీమధ్యనే ఒక సినిమా చూశాను. ఆ సినిమా కథలో హీరో ఎందుకు పనికిరాకుండా తిరుగుతుంటాడు. హీరోయిన్ మాత్రం బాగా చదువుకుంటుంది. ఆమె ఇతగాడికి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ గురించి చెప్పి, అటువంటి క్లాసులో చేరమని ప్రోత్సహిస్తుంది. అతను చేరతాడు, చదువుతాడు. అయినా ఆశించిన ఫలితాలేవీ రావు.

05/04/2018 - 23:05

ప్రతి తరంలో పెద్దవాళ్లు మా కాలంలో ఇట్లాంటివి చూడలేదండీ అంటుంటారు. నిజమే. తరతరానికి మార్పులు వస్తూనే ఉంటాయ. మార్పు లేకపోతే మనిషే కాదంటారు కొందరు. కనుక పెద్దలకు పిన్నలకు తేడాలు తప్పని సరి కాని ఈ పిన్నలు చేసేవాటిని కొంత పెద్దలు పట్టించుకోకపోవడమే నేడు మంచిదంటున్నారు మానసిక వైద్యులు.

05/03/2018 - 22:42

ఈ తరం అమ్మాయిలు ఓ చిన్న బ్యాగ్‌లో రెండు డ్రెస్‌లు, పర్స్ నిండా ఎటిఎమ్ కార్డులు, సెల్‌ఫోన్ రీచార్జ్ కార్డులు పెట్టుకుంటున్నారు. క్యాష్ కూడా ఓ వెయ్యి రూపాయలు మించి ఉండటం లేదు. ‘క్యాష్‌లెస్ జర్నీ, లెస్ లగేజ్ జర్నీ మోర్ కంఫర్ట్’ అని చెపుతున్నారు. ఒక విధంగా నిజమే కాని అందులో ఎన్నో ఇబ్బందులే ఉన్నాయి. అవి వారికి ముందు అర్థంకావు. అందులో అమ్మ చెపితే అసలు వినిపించదు.

05/02/2018 - 22:54

శిశువు ఒక్కసారిగా నడక నేర్వలేడు. పడుతూ లేస్తూ, ఆధారాలతో అడుగులేస్తూ చివరకు నడకను స్థిరంగా ఉండేటట్లు చేసుకుంటుంది. ఒకళ్ళు నేర్పక్కర్లేదు ఈ విషయాలన్నీ. ఇవి అన్నీ ప్రకృతి సహజం. ఇది కూడా అంతే. తొట్రుపాటు, తడబాటు మొదట్లో సహజం. చేపపిల్లకు ఈదడం, పక్షిపిల్లకు ఎగరడం వచ్చినట్టే అవసరానికి తగ్గట్టు మనిషికి ఏ పని చేయాలన్న అనుకోకుండా అంటే అభ్యాసం లేకుండా ఆ పని చేసే నేర్పు వస్తుంది.

05/01/2018 - 22:34

మగువలకు సృజనాత్మకత సహజమే. ఉత్సాహం ఉంటే ఊపిరితో ను ఎక్కసెక్కాలు ఆడవచ్చు. మనసుతో ఆలోచిస్తే ఆకాశానే్న నేలమీదకు దింపవచ్చు. ఇంద్రధనుస్సుకు కొత్త రంగులు అద్దవచ్చు. ప్రతి మహిళలో అంతర్గతంగా ఉండే నైపుణ్యాన్ని బయటకు తీసుకొని రావాల్సిన బాధ్యత మాత్రం తల్లిదండ్రులకు ఉండి తీరాలి.

04/30/2018 - 22:11

దేశం మొత్తంలో అభివృద్ధి పేరిట సంక్షేమ కార్యక్రమాల లిస్టు హనుమంతుడి తోకలా పెరిగిపోతూనే వుంది. అభివృద్ధి ఏమో కానీ, కొన్ని కొన్ని ప్రచారాలు ఆచరణకు సాధ్యంకానంతగా వుంటున్నాయ్. అసలు అటువంటి ప్రచారాలు అవసరమా అని కూడా అనిపిస్తుంది. ఇక దొరికిందే ఛాన్సు, ప్రసార మాధ్యమాల్లో అవే చెప్తూ పోతారు. ఉదాహరణకి కుల రహిత సమాజం- ఈ మాటలు వినడానికి బాగానే వున్నాయి.

04/29/2018 - 21:18

అనుభూతులు అనే పుటలతో నిండిన పుస్తకమే జీవితం. పుటలు తిరగేస్తుంటే ఒక్కొక్క పుట ఒక్కొక్క అనుభూతిని గుర్తుకు తెస్తుంది. మార్దవంగా మనస్సును తడుతుంది. అపుడు పొందిన అనుభూతినే ఇపుడు కూడా కలిగిస్తుంది. అమ్మా నాన్నల లాలన, అక్కా చెలెళ్ళ ఆప్యాయత, అన్నదమ్ముల అనురాగం, బంధు మిత్రుల ఆదరణ మరచిపోలేని మధురానుభూతులై జీవితాంతం మనస్సులో పదిలంగా నిలిచిపోతాయి. మనుష్యులకు అనుభూతి అనేది ఒక వరం.

Pages