S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

10/12/2018 - 19:12

పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న కవిగారిని నేను నిత్యం స్మరిస్తూ ఉంటాను. నిజమే! మనం సముద్రాలు దాటి వచ్చి దూర తీరాల్లో నివసించినా మాతృభూమిని, మాతృదేశాన్ని వదలలేకపోతాం. ఎన్ని దేశాలు తిరిగినా ఎక్కడెక్కడో నివసించినా మన సనాతన సంస్కృతీ సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, మన ధర్మాలను మనం ఆచరిస్తూనే ఉంటాం.నేను ఆచరించడమే కాక మా ఇంట్లో సభ్యులందరి చేత ఆచరింపచేస్తాను.

10/11/2018 - 19:44

నవరాత్రులు.. బతుకమ్మ ఆటలు.. బొమ్మల కొలువులు.. పేరంటాలు. . దాండియా..

10/10/2018 - 19:05

ఇపుడు ఏ పత్రిక తిరగేసినా.. ఏ సోషల్ మీడియాలో చూసినా ఒకటే చర్చ.. ‘మీ టూ’.. ఈ పోరాటం అన్ని వర్గాల మహిళల్లో స్పందన కలిగిస్తోంది. గొంతును పెగిల్చేలా చేస్తోంది. హృదయంలో ఏ మూలో గత కాలపు చేదు జ్ఞాపకాల దొంతర కళ్లముందు కదిలి మనసు కన్నీరు కారుస్తుంది.. ‘ఆ రోజు నేనెందుకు ధైర్యం చేసి మాట్లాడలేకపోయాను.. అపుడెందుకు ఎదిరించలేకపోయాను..’ అని ప్రతి మహిళా ఆ చేదు జ్ఞాపకాలను తలచుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది..

10/09/2018 - 19:28

మనిషి సంతోషంగా జీవించడానికి, ఆనందంగా గడపడానికి మానసికంగా దృఢత్వాన్ని పెంచుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడానికి వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ అక్టోబర్ 10, 1992న స్థాపించడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని అక్టోబర్ 10న జరుపుకుంటాం.

10/08/2018 - 03:39

‘గడియా... గవ్వ రాకటలేదు’ ఎప్పుడో విన్న సామెత. గవ్వ రాకటమటుచండి, కుటుంబ సభ్యులలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక మాటంటూనే ఉంటారు. ప్రస్తుత పరిస్థితిలో గృహిణి జీవితం అలాగే ఉంది. ఉదయం అందరికంటే ముందుగానే మేల్కోవడం నుంచి మొదలుకొని రాత్రి అందరూ పడుకునేంతవరకు మెలకువతో ఉండి, తీరిక లేకుండా పనిచేస్తున్న గృహిణి అలసిపోదా..? ఇంటిని చూసి ఇల్లాలు గొప్పతనం చెప్పవచ్చు అని మన తాతయ్య, బామ్మలు చెప్పినట్లుగా గుర్తుంది కదూ..

10/05/2018 - 19:58

నేటి సమాజంలో పెద్ద పెద్ద ఇళ్లను నిర్మించాలంటే చాలా కష్టమైన విషయం. అలాగని మన బడ్జెట్లో చిన్న ఇంటిని నిర్మించుకుని, దాన్ని మన అభిరుచికి తగ్గట్టు అలంకరించుకోవడం అనేది చాలా కష్టమైన పనే. ముఖ్యంగా చిన్న ఇంట్లో మనకు కావలసినవి, అవసరమైనవన్నీ అలంకరించుకోవడానికి, జోడించడానికి, చిన్న ఇల్లును విశాలంగా చూపించడానికి చిన్న చిన్న చిట్కాలను పాటించాలి.

10/04/2018 - 19:26

సంప్రదాయ వేడుకల్లో ఈతరం అమ్మాయిలు నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలనుకుంటారు. పండుగలు, శుభకార్యాలు వస్తే చాలు.. అప్పటివరకూ జీన్స్, కుర్తాలు వేసుకునేవాళ్లు కాస్తా.. పదహారణాల తెలుగమ్మాయిల్లా మారిపోతారు. సంప్రదాయంగా కనిపించాలంటే పరికిణీ, ఓణీలను మించినవేముంటాయి? అలాగని నేటితరం పాతతరం బట్టలను వేసుకుంటారా? లేదు.. ఏది ధరించినా కొత్తగా, అందంగా కనిపించాలి. అవి వేసుకుంటే బుట్టబొమ్మల్లా మారిపోవాలి..

10/03/2018 - 20:05

మెడ.. ముఖానికి, ఆకృతికి అందాన్ని జతచేస్తుంది. ఈ సన్నని కాండంలాంటి అవయవం తలకి ఇరువైపులా మద్దతును ఇవ్వడంతో పాటు, తలను పైకి, కిందికి వంచడానికి, దాదాపు 180 డిగ్రీల వరకు తిప్పడానికి అనుమతిస్తుంది. రోజువారీ అలవాట్లు మెడ చుట్టూ ఉన్న చర్మం పాడవడానికి దోహదం చేస్తాయి.

10/02/2018 - 23:28

నేడు చైల్డ్ ప్రొటెక్షన్ డే......

10/01/2018 - 19:40

జార్ఖండ్ రాష్ట్రం.. సిండేగా జిల్లా.. కారామాటి గ్రామం.. అందులో వంద కుటుంబాలుంటాయి. 2017, సెప్టెంబర్ 28వ తేదీ.. ఆకలితో అలమటిస్తూ చనిపోయిందో చిన్నారి. ఆమే సంతోషి కుమారి. పదకొండేళ్ల సంతోషి నాలుగురోజుల పాటు ఆకలి.. ఆకలి.. అంటున్నా ఇంట్లో తిండి లేదు.. రేషన్ దొరకలేదు.. అలా ఆకలి అంటూనే ఆ చిన్నారి చనిపోయింది. తిండికోసం ఏడుస్తూ ప్రాణాలు కోల్పోయిన చిన్నారిని చూసి ఆ తల్లి గుండె తరుక్కుపోయింది.

Pages