S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

07/15/2019 - 19:23

చినుకులు పడితే చాలు దోమలు పెరుగుతాయి. దోమల నుంచి రక్షించుకోలేకపోతే డెంగీ, చికెన్‌గున్యా, మలేరియా.. ఇలా ఎన్నో ప్రాణాంతక వ్యాధులు మనల్ని బాధిస్తాయి. అందుకే దోమల నియంత్రణ చాలా ముఖ్యం. చిన్నపిల్లలు వున్న ఇంట్లో క్రిమిసంహారకాల ద్వారా దోమల్ని పారద్రోలలేం. అందుకని సహజ పద్ధతుల ద్వారా దోమల్ని వదిలించుకోవడం మంచిది. అదెలాగంటే..

07/11/2019 - 23:03

ఎంత ఎండనైనా తట్టుకోవచ్చు, ఎంత చలిగా వున్నా భరించవచ్చు. ఎండలో, చలిలో మన పనులు మనం చేసుకోవచ్చు. కానీ ఒంటిమీద చినుకుపడితే తట్టుకోలేం. వానలో తడుస్తూ ఏ పనీ చేయలేం.. చాలా ఇబ్బందిగా వుంటుంది. ఇంట్లోనుండి కాలు బయటపెడదామంటే ఎంతో కష్టంగా వుంటుంది. అయితే ఒకప్పుడు దాదాపు రెండు దశాబ్దాల క్రితంవరకూ కూడా రెయిన్‌కోట్స్ అందరికీ అందుబాటులో వుండేవి కావు. రెయిన్‌కోట్స్ ముందు గొడుగులు ఉపయోగించేవారు.

07/10/2019 - 18:30

ప్రపంచ జనాభా మొత్తంగా అడ్డూ అదుపూ లేకుండా కాలం కంటే వేగంగా విపరీతంగా పెరిగిపోంతోంది. ప్రజల అవసరాలు తీర్చే వనరులు జనాభా పెరుగుదలకు తగ్గట్లుగా సమకూరడంలేదు. ప్రజల అవసరాలు తీర్చగలిగే సంపద, సేవలు, సరుకులు లభించడంలేదు.

07/09/2019 - 18:30

పిల్లలు హుషారుగా లేరా? పరధ్యానంగా ఉంటున్నారా? అయితే ఇది ఆలోచించాల్సి విషయమే.. ఇంట్లో పెద్దలు ఏదైనా విషయం చెబుతుంటే ఇక చాలన్నట్లు, విననట్లు ఉండటం.. క్లాస్‌లో కూడా టీచర్ చెప్పేదంతా శ్రద్ధగా విన్నట్లే కనిపించడం.. కానీ టీచర్ చెప్పిన పాఠం గురించి ప్రశ్నిస్తే తెల్లమొహం వేయడం.. ఇవన్నీ పరధ్యానంగా ఉండే పిల్లల్లో కనిపించే కొన్ని లక్షణాలు.

07/08/2019 - 18:15

వర్షాకాలంలో ఒళ్లు తడవకుండా ఇంటికి వెళ్లడం అసాధ్యం. ఇలా రోజూ వర్షాల్లో తడవడం వల్ల చర్మం దెబ్బతింటుంది. ఈ సీజన్‌లో చర్మం పాడవకుండా సంరక్షణకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే..

07/07/2019 - 23:25

గోళ్ళకు రంగును కలిగించే గోరింటాకు ‘‘నఖరంజని’’ అని పేరు. ఆషాడంలో గోరింటాకు పెట్టుకునే ఆచారం అనాదిగా ప్రబలంగా ఉంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం గోరింట మంచి మూలిక. దాని ఆకులే కాదు... పూవులు, వేళ్ళు, బెరడు, విత్తనాలు, గింజలు, ఓషధ గుణాలు కలిగి ఉంటాయి. హన్నొటాన్నిక్ ఆసిడ్‌తో కూడి ఒకరకమైన చిరువిషం ఉంటుంది. గింజలో చమురుంటుంది. పూలతో అత్తరు, వాసన నూనె తయారు చేస్తారు.

07/05/2019 - 18:49

భారతదేశ చరిత్రలో కేంద్ర బడ్జెట్‌ను సమర్పించిన రెండో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 1970వ సంవత్సరంలో ఇందిరాగాంధీ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ ఆర్థిక శాఖను కూడా తనవద్దే పెట్టుకున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ ఇది.

07/04/2019 - 19:49

అతి సామాన్యులుగా జన్మించి, పేదరికంలో పెరిగి ఎన్నో విజయాలు సాధించి కోటీశ్వరులైన వ్యక్తుల గురించి తెలుసుకున్నపుడు నిజమా అనిపిస్తుంది. వారి చరిత్రలు ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తాయి. తాము కూడా ఏదో చేయాలనే ఆలోచనకు మనసు శ్రీకారం చుడుతుంది. అయితే ఏమీ చేయలేరు. జీవితంలో విజేతలు అయిన ఎవ్వరూ అకస్మాత్తుగా విజయాలు సాధించలేదు. వారి విజయాల వెనుక ఏదో ఒక విజయ రహస్యం వుంటుంది.

07/03/2019 - 19:13

‘తెలుగు భాష వెలుగు చరిత తెలియగరారే..’ అంటూ ‘ఆంధ్రుల ఖ్యాతిని ఆదిగ పలికెను ముదముగ నాట్యశాస్తమ్రున భరతుడు..’ అంటూ వివిధ భాషావేత్తలు తెలుగును కొనియాడిన విధానాన్ని నృత్యంలో అభినయిస్తారు. ప్రముఖ నాట్యాచారిణి కోకా విజయలక్ష్మి రూపొందించిన అపూర్వ నృత్య నాటకం ‘తెలుగు ప్రశస్తి’.

07/02/2019 - 19:13

స్ర్తిలలో కనీసం పదిశాతం మందికి ఉండే ఎండోమెట్రియాసిస్ గురించి ఇప్పటికీ పెద్దగా పరిశోధనలు జరగలేదు. డాక్టర్లకు కూడా దీని గురించి అవగాహన తక్కువే. ఇది వచ్చినప్పుడు చాలామంది పనిచేసుకోలేనంత నొప్పితో బాధపడుతూ ఉంటారు. అయినా నేటికీ దీనికి సరైన చికిత్స లేదు. ఈ వ్యాధి నెలసరితో సంబంధం ఉన్న ఒక రుగ్మత. గర్భకోశం లోపల మాత్రమే ఉండాల్సిన కణజాలంతో కూడిన పలుచని పొర ఇతర అవయవాలలో కూడా ఏర్పడడమే ఈ రుగ్మతకు కారణం.

Pages