S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

,
02/02/2020 - 23:34

మరికొద్ది రోజుల్లో వేసవికాలం వచ్చినట్లే. మండే ఎండలు మనల్ని అతలాకుతలం చేస్తుంటాయి. ఇంట్లో ఏసీ, కూలర్లు ఉంటే కొంత ఉపశమనం. కాని మధ్యతరగతి, సామాన్యులు ఈ ఎండవేడిని తట్టుకోలేక కిటీకలన్నీ మూసేసుకుని చల్లదనం కోసం కొబ్బరి పీచు వట్టివేళ్లు వేలాడదీసుకుంటారు. దీంతోపాటు ఇంట్లో మనం కిటికీలకు, డోర్లకు వాడే కర్టెన్లు చల్లగా, హాయినిచ్చేవిగా ఉంటే ఎంతో మంచిది. అలాంటి కర్టెన్లను ఎంపికచేసుకోవాలని ఉబలాడపడుతుంటాం.

01/29/2020 - 23:09

మానవ జాతి మనుగడకు అక్షర సంపద అవసరం. జ్ఞానప్రదాయని అయన సరస్వతి దేవి కటాక్షం ఉంటే చాలు విజ్ఞాన నిధులు సమకూరినట్లే. విభిన్న రీతుల్లో సాగే ఈ విజ్ఞాన నిధులు సమకూరితే ఆయా రంగాల్లో వారు ప్రావీణ్యం సంపాదించగలుగుతారు. ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాల వల్ల సమకూరే అక్షర సంపదను సొంతం చేసుకునేందుకు పెద్దలు తమ పిల్లలకు ఈ రోజు అక్షరాభ్యాసం చేయస్తారు. మాఘమాసంలోని శుద్ధ పంచమి శ్రీ సరస్వతీదేవి పుట్టినరోజు.

01/28/2020 - 22:56

అమ్మాయి పుడితే.. అక్షరాలా మహాలక్ష్మీ పుట్టింది అంటారు.. అదే నిత్యసత్యం. ఏ ముచ్చటైనా.. ఏ ఆనందమైనా అమ్మాయితోనే ముడిపడి వుంటుంది. పుట్టింది మొదలు అమ్మాయి అత్తారింటికి వెళ్ళేవరకు. అమ్మా నాన్నలకదో పెద్ద బాధ్యత. బుడిబుడి నడకలతో నడయాడేవేళ.. మువ్వల పట్టీలతో.. మహదానందం చెందుతారు అమ్మా నాన్నలు.. ఆ తర్వాత అమ్మాయికి అన్నీ వేడుకలే.. వేడుకలు. నిజం చెప్పాలంటే అమ్మాయి నట్టింట నడయాడితే..

01/27/2020 - 23:01

రోజూ కాసేపు సూర్యకిరణాల ఎదురుగా గడిపినా చాలు.. శరీరానికి అవసరమైన డి విటమిన్ అంది అనారోగ్యం దరిచేరదు. కాని మనం ఉదయం 7 గంటలు దాటిన తరువాతే దుప్పటి ముసుగు తీస్తాం. కనీసం ఉదయానే్న వెలుగులు ప్రసరింపజేసే ఆ సూర్యభగవానుడికి నమస్కారం కూడా చేయం.

01/25/2020 - 22:19

వెజ్ ఎగ్‌ఫ్రైడ్ రైస్ అతి త్వరగా, సులభంగా తయారుచేసుకునే వంటకం. ఇది బ్రేక్‌ఫాస్ట్‌గాను, మధ్యాహ్నం భోజనం, లేదా డిన్నర్‌లోనూ కమ్మగా తినవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. చిన్న పిల్లలైతే మరీ ఇష్టంగా తినే ఈ ఎగ్‌ఫ్రైడ్ రైస్ లంచ్‌బాక్స్‌లకు తయారుచేసి పంపవచ్చు. ముఖ్యంగా శీతాకాలంలో ఈ ఎగ్‌ఫ్రైడ్ రైస్ వేడి వేడిగా తినటానికి ఇష్టపడతారు. గుడ్డులో హై క్వాలిటీ ప్రొటీన్స్ ఉంటాయి.

01/23/2020 - 23:04

నిద్ర సుఖమెరుగదు అని అంటారు. కంటి నిండా నిద్రపోయి ఎన్నాళ్లయిందోనని వాపోయేవారు నేడు అనేక మంది. విపరీతమైన ఆలోచనలు, ఆందోళనల మధ్య జీవితాలను గడిపే ఎంతో మందికి కంటి నిండా నిద్ర కరవవుతుంది. అందుకే నేటి ఆధునిక కాలంలో కమ్మటి నిద్ర కరువైంది. కాని చిన్న పిల్లలు అలా కాదు. వారి లేత మనసుల్లో ఎలాంటి ఆందోళనలు, అలజడులు ఉండవు. కావల్సిన పెన్నిధి పక్కన ఉంటే కమ్మటి నిద్ర పోతారు.

01/22/2020 - 22:49

‘‘నాన్న మాకెమన్నా ఆస్తులు ఉన్నాయా? అని పదేళ్లు దాటిన ఆ కొడుకు అడిగిన ప్రశ్నకు పుస్తకం చదువుకుంటున్న జమిందారైన తండ్రి తలెత్తి ఒక్కసారి చూశాడు. ‘వెళ్లి అద్దంలో చూసుకో’అని అనగానే ఆ కొడుకు నిలువుటద్దం ముందు నిలుచుకున్నాడు. అణువణువునా ఆత్మవిశ్వాసం తొణికసలాడే ఆ తేజోమయ రూపం.. కరుణామృతాన్ని కురిపించే విశాలమైన నేత్రాలు, ఆ నేత్రాలలో కనిపించే నిర్భయత్వం.. ఇది చాలు.

01/22/2020 - 06:32

ఈ రోజుల్లో సెల్‌ఫోన్ లేని ఇల్లే లేదు. మారుమూల గ్రామాలలో కూడా సెల్‌ఫోన్ల వినియోగం ఎక్కువైపోయింది. ప్రపంచీకరణ నేపధ్యంలో అర చేతిలోనే విశ్వమంతా మనకు కనబడుతోంది. మంచిదే దీనిలో కొన్ని దుష్ఫరిణామాలు, మంచి పరిణామాలు ఉన్నాయి. ముందు సెల్ సంభాషణ బాగుండాలి. చాలావరకు సెల్ సంభాషణలు ‘‘చెప్పండి, మాట్లాడుకోండి’’అని మర్యాద మన్నన లేకుండా మాట్లాడుతున్నారు.

01/19/2020 - 23:54

కొంతమంది పిల్లలకు చిన్నప్పటి నుంచీ మంకుపట్టు, పేచీతత్త్వం, మొండితనం వంటివి ఉంటాయి. ఇవన్నీ తల్లిదండ్రుల గారాబం వల్లో.. లేదా అమ్మమ్మ తాతయ్యల ముద్దు వల్ల వచ్చింది అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ ఇది అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ కావచ్చని చెబుతారు డాక్టర్లు.. ఈ తరం చిన్నారుల్లో ఎక్కువశాతం మందిలో ఈ సమస్య సర్వసాధారణంగా ఉంటుంది అంటున్నారు వారు.

01/16/2020 - 23:06

పరిమళాల నుండి వచ్చే సువాసన కేవలం కొన్ని నిముషాల వరకే వెదజల్లుతుంది. ఎలాంటి పరిమళం అయినా సుదీర్ఘకాలం సువాసన ఉండదు. అయితే ఇలాంటివి మనం అస్సలు ఇష్టపడం. నిరంతరం సువాసన వెదజల్లే పరిమళాల కోసం ఎంతగానో ఖర్చు చేస్తాం. కానీ ఎలాంటి పరిమళమైనా కొన్ని గంటల్లోనే పూర్తిగా ఆవిరైపోతుందన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని పరిమళాన్ని ఎంచుకునే ప్రయత్నం చేయాలి. ప్రశాంతతనిచ్చే పరిమళాలే మనసుకు హాయినిస్తాయి.

Pages