S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

12/28/2018 - 19:00

దాదాపు ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క ఉంటుంది. ప్రతిరోజూ తులసి పూజ జరుగుతుంది. ఇలా రోజూ పూజ చేయాలనే ఆలోచన వెనుక భక్తే కాదు, సైన్స్ కూడా దాగుంది. తులసితో అనేక వ్యాధులను నయం చేసే సంపూర్ణ ఆరోగ్యాన్ని నిలబెట్టే అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. అయితే తులసి కోసం ఎక్కడో వెతికే పని లేకుండా, ఇంట్లోనే పెంచడం ద్వారా ప్రతిరోజూ తులసి ఆకులను వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

12/27/2018 - 18:41

మన శరీరంలోనూ పోలీసు తరహా వ్యవహారమే నడుస్తుంటుంది. మన శరీరానికి సరిపడని పదార్థాన్ని తీసుకున్నప్పుడు శరీరంలోని రక్షణ వ్యవస్థ పోలీస్ తరహాలోనే శత్రువుపైన దాడికి సిద్ధపడుతుంది. శరీరానికీ, శత్రువుకూ మధ్య యుద్ధం కారణంగా శరీరంపైన అనేక వ్యాధి లక్షణాలు కలుగుతాయి. అవి ఎలర్జీ లక్షణాలు కలగటానికి కారణం అవుతాయి. ఇది ఒక అంశం. రెండో అంశం ఇంకొకటి ఉంది.

12/26/2018 - 18:48

వంటగదిని శుభ్రంగా ఉంచుకోవడం ఒక కళే.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వంటగదిలో ఎక్కడో ఒకచోట అపరిశుభ్రత తాండవిస్తుంది. ఇది కాస్తంత ఇబ్బందికరమే.. ముఖ్యంగా మైక్రోవేవ్స్ విషయానికి వచ్చేసరికి శుభ్రపరచడానికి బద్ధకం వేస్తుంది. కానీ వంటగదితో పాటు వంటగదిలోని వస్తువులను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా ముఖ్యమే.. మైక్రోవేవ్స్‌ను పరిశుభ్రపరచుకోవడం కొంత ఛాలెంజింగ్ టాస్క్.

12/25/2018 - 18:35

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 23.5 కోట్లమంది ఆస్తమాతో బాధపడుతున్నారు. వారిలో ఒక్క భారతదేశంలో 1.5 నుంచి రెండు కోట్ల మంది ఉన్నట్లు అంచనా.. బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉబ్బసంతో ఒక్క 2015లోనే 3, 83, 000 మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో పదకొండు ఏళ్లలోపు చిన్నారుల్లో నూటికి ఐదు నుంచి పదిహేను మంది ఉబ్బసం బారిన పడుతున్నారు.

12/23/2018 - 23:12

పిల్లల ఆహార విషయంలో తల్లిదండ్రులు మొదటి నుంచీ జాగ్రత్తగా వ్యవహరించాలి. పోషక విలువలతో, ఖనిజాలతో కూడిన ఆహారం వాళ్ళకి పెట్టాలి. అలా చేయడం వల్ల పిల్లలు చదువులో రాణించడమే కాదు, ఆరోగ్యంగా కూడా ఉంటారు. శరీరం బలవర్ధకంగా ఉండటానికి కొన్ని రకాలైన ఆహారాలు తప్పనిసరి. తిండి విషయంలో పిల్లల ఇష్టాలను పరిగణనలోకి తీసుకుంటూనే వాటిల్లో పోషక విలువలు ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి.

12/21/2018 - 22:09

చుట్టూ మనుషులున్నా కొందరిని ఒంటరితనం వేధిస్తుంది. దాన్ని అధిగమించేందుకు వారు సామాజిక మాధ్యమాలను ఆశ్రయిస్తుంటారు. అయినా కూడా వారిని ఒంటరిగా ఉన్నామనే భావన వెంటాడుతూనే ఉంటుంది. అమ్మాయిల్లో అయితే ఈ ధోరణి మరింత అధికంగా ఉంటుంది. ఇంతకీ ఆన్‌లైన్ బంధాలు మనల్ని ఒంటరితనం నుంచి బయటపడేస్తున్నాయా లేక మనల్ని మరింత ఏకాకిని చేస్తున్నాయా? అని ఆలోచిస్తే..

12/20/2018 - 19:50

నేటి సమాజంలో మహిళలకు రక్షణ చాలా అవసరం. ఆలస్యంగా ఇంటికి చేరుకునే క్రమంలో కొన్ని యాప్‌లు మహిళలు అండగా నిలుస్తున్నాయి. మహిళల రక్షణకోసం సాంకేతికంగా చాలా రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా చాలా యాప్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటివల్ల మన రక్షణ మన చేతుల్లోనే ఉంటుంది. ప్రమాద సమయంలో వీటిని ఉపయోగించినట్లయితే తక్షణ సహాయం అందుతుంది. అలాంటి యాప్‌లలో కొన్ని మీకోసం..

12/19/2018 - 19:47

మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్నారు పెద్దలు. జన్మనిచ్చేది తల్లిదండ్రులైనా జ్ఞాననేత్రం తెరిపించేది గురువు. పూర్వకాలంలో గురుకులాల్లో విద్య నేర్పేవారు. విద్య నేర్చుకోవటానికి డబ్బుతో పనిలేదు. అక్కడ ఆశ్రమ జీవితం గడపాలి. గురువుగారు చెప్పినట్లు నడుచుకోవాలి. ఆయనకి కుబేరుడయినా, కుచేలుడయినా ఒకటే! దయగలిగినపుడు విద్య నేర్పుతాడు. విద్యను అర్థించి వచ్చేవాడు కనుకనే శిష్యుడిని ‘విద్యార్థి’ అన్నారు.

12/18/2018 - 18:21

చలిని తరిమేయడానికి స్వెటర్, జర్కిన్ వేసుకునే రోజులు ఎప్పుడో పోయాయి. ముఖ్యంగా నేటి తరం అమ్మాయిలైతే కనీసం వీటివైపు కూడా చూడరు. హుడీ, స్కార్ఫ్, టోపీ, షగ్.్ర. ఇలా.. నేటితరం అమ్మాయిలు ట్రెండ్‌కి, ఫ్యాషన్‌కు దగ్గరగా ఉంటూ చలిని తరిమేస్తున్నారు. వీరి అభిరుచులకు తగినట్లుగా మార్కెట్లో కూడా కొత్త కొత్త డిజైన్లు కనికట్టు చేస్తున్నాయి. అయితే సరైన వాటిని ఎంచుకోవడం తెలియాలి..

12/16/2018 - 23:14

శీతాకాలంలో ముఖ చర్మాన్ని అతి జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే పగిలిన చర్మంపై ఎటువంటి మేకప్ అయినా ముఖంపై సరిగ్గా అమరదు. అందుకే ముఖంపై క్రమం తప్పకుండా మాయిశ్చరైజర్ పూస్తుంటే చర్మం పగుళ్లు లేకుండా అందంగా ఉంటుంది.
* మేకప్‌కు ముందు ముఖాన్ని మృదువైన లిక్విడ్ సోప్‌తో శుభ్రం చేసుకోవాలి. లేదంటే సున్నిపిండితో ముఖాన్ని కడుక్కోవాలి. తరువాత చర్మం తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

Pages