S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

07/10/2018 - 20:47

ఎక్కడైనా సర్దుబాటు తప్పనిసరి. అది ఉద్యోగంలోనైనా, ఇంట్లోనైనా, తల్లిదండ్రుల దగ్గర నుంచి జీవిత భాగస్వామి దాకా ఏదో ఒక విషయంలో సర్దుబాటు ఉంటేనే జీవన క్రమం మెల్లగా సాగుతుంది. లేకుంటే ప్రతిరోజు గొడవలు మొదలు. గొడవలు, కొట్లాట వల్ల మానసిక అశాంతి ఏర్పడుతుంది. దానితో లేనిపోనీ రోగాలు అంటుకుంటాయి. ఎదురు వాళ్లు ఏమనుకొంటారో అని ఒకటే ఆలోచనతో చేసే పనిపైన శ్రద్ధ తగ్గుతుంది.

07/09/2018 - 22:28

వయస్సు పైబడుతున్న కొలది ఏదో ఒక అనారోగ్యం వస్తుండం మా మూలే. అందులో మహిళలకు మరికొన్ని అనారోగ్యాలు రావడం కూడా సహజమే. ఎందుకంటే 45 దాటిన తరువాత ఈస్ట్రోజెన్ హార్మోన్ విడుదల తగ్గుముఖం పడుతుంది. దాంతో మెటబాలిజం పనితీరులో మార్పులు ఏర్పడుతాయి.
సాధారణంగా ఈ నెలసరి ఆగిపోతున్నప్పుడూ ఆగిపోయిన తరువాత కూడా మహిళల్లో బరువు పెరగడం, మోకాళ్లు అరగడం, పాదాల వాపు ఇలాంటి అనారోగ్యాలు బయటపడుతుంటాయి.

07/08/2018 - 22:06

అందరూ ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. వారంతా శిరీషను మెచ్చుకుంటూ తమ వంతు సాయం చేస్తున్నారు. అందులో అపర్ణ వంతు వచ్చింది. చాలా ఆశ్చర్యంగా అబ్బురంగా శిరీషను చూసింది.
‘చివరకు సాధించావన్నమాట’ అంది అపర్ణ
శిరీష పెదవులపై చిన్నగా నవ్వు విరిసింది.

07/06/2018 - 23:45

పండగైనా, పబ్బమైనా, వేడుకైనా.. ఎలాంటి ముఖ్య సందర్భమైనా అమ్మాయిలు, మహిళలు సంప్ర దాయ దుస్తుల వైపే మొగ్గు చూపుతారు. అయితే సంప్ర దాయ దుస్తులంటే అందులో ఫ్యాషన్, ట్రెండ్ ఉండదని చాలామంది అభిప్రాయం. కానీ నేడు ఫ్యాషన్ డిజైనర్లు చీరల్లోనూ రకరకాల ఫ్యాషన్ ట్రెండ్‌లను చొప్పించి చీర సోయగానికి మించింది మరోటి లేదేమో అన్నట్లుగా చీరలను తీర్చిదిద్దుతున్నారు.

07/05/2018 - 21:17

ఈ మధ్య యువతలో ఛాలెంజింగ్ ఎక్కువైంది. అదేపనిగా అనుకొన్నది సాధించాలని రాత్రనక పగలనక కష్టపడుతున్నారు. చిన్న వయస్సులోనే ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారు. అటు చదువుకుంటూ ఇటు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తేస్తున్నారు. కాని వారికి సమయం చిక్కక ఎక్కడ పడితే అక్కడ రోడ్ సైడ్ దొరికే ఏ పదార్థమైనా తినేస్తున్నారు కొందరు.

07/04/2018 - 23:43

వేడి వేడి జిలేబీని చూస్తే ఎలాంటివారికైనా నోరు ఊరుతుంది. కొంతమందికైతే రోజుకు ఓసారి తీపి తినందే అన్నం కూడా సహించదు. అలా తీపి అంటే చాలామందికి చాలా మక్కువ. కానీ దీనివల్ల ఆరోగ్యానికి తీరని నష్టం కలుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ప్రతివ్యక్తీ రోజుకు కేవలం ఆరు స్పూన్ల పంచదారను మాత్రమే వాడాలని చెబుతోంది.

07/03/2018 - 21:16

ఇంటివద్దే సులభమైన పద్ధతులను పాటిస్తూ సౌందర్యాన్ని పరిరక్షించుకోవచ్చు. అలాంటి వాటిలో మానిక్యూర్ కూడా ఒకటి. ప్రతి ఒక్కరికీ తమ చేతిని, గోళ్ళని శుభ్రంగా ఉంచుకోవాలని ఉంటుంది. అయితే మనలో చాలామంది ఫేస్‌ప్యాక్స్‌ని వాడి ముఖ సౌందర్యాన్ని మెరుగుపరుచుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడూ ముఖానికి ఇచ్చినంత కేర్ చేతులకు ఇవ్వరు. కానీ చేతులతోనే మనం అన్ని పనులూ చేస్తుంటాం. మరి చేతులపై అంత నిర్లక్ష్యం ఎందుకు?

07/02/2018 - 21:53

శరీరంలో ఉష్ణాన్ని తగ్గించి, చలువను ప్రసాదించే ఖర్జూరం మిక్కిలి ప్రశస్తమయినది. అతి తియ్యగా, రుచికరంగా ఉండే ఈ ఖర్జూరం ఆరోగ్యరీత్యా ఎంతో ఉత్తమయినది.
ఎండు ఖర్జూరపు కాయలను నీటిలో నానబెట్టి, ఆ నీటిని వేసవిలో పిల్లల చేత త్రాగిస్తే వడదెబ్బ తగలదు.

07/01/2018 - 22:17

పర్యావరణాన్ని పరిరక్షించాలన్న తపనతో అందరి కంటే భిన్నంగా ఆలోచించిన ఆమె ఓ నూతన ఆవిష్కరణకు నాంది పలికింది. పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ కప్పులు,ప్లేట్లు, వాటర్ బాటిళ్లు, గ్లాసులను మితిమీరి వాడుతున్నందున పర్యావరణం కలుషితమవుతోందని ఆమె చేస్తున్న ప్రచారానికి విశేష స్పందన లభిస్తోంది.

06/29/2018 - 22:05

బాల్యవివాహాలకు ఎప్పుడో అడ్డుకట్ట వేసి, ఇవి జరగకుండా ఉండటానికి ప్రత్యేక చట్టాలను రూపొందించినా నేటికీ ఎక్కడో ఒకచోట బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటివాటికి చరమగీతం పాడటానికే ‘బంధన్ తోడ్’ యాప్ రూపొందించబడింది. బాల్యవివాహాలను అరికట్టే దిశగా యునైటెడ్ నేషన్స్ పాప్యులేషన్ ఫండ్, 270 పౌరసేవా సంస్థలు కలిసికట్టుగా బీహార్‌లో ఈ యాప్‌ను రూపొందించాయి. సామాజికపరంగా ఉన్న లోపాలను ఈ యాప్ సరిచేయనుంది.

Pages