S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

02/09/2018 - 20:59

ప్రధాన కారణం దారిద్య్ర రేఖకు దిగువన ఉండటం, తల్లిదండ్రుల నిరక్షరాస్యత, పేదరికం కారణం. చిన్న వయసులోనే గర్భస్రావాలు జరగడం, చనిపోయిన శిశువులు జన్మించడం లేదా జన్మించగానే శిశువులు మరణించే అవకాఉం ఉంది. బాలికల బాల్యవివాహాలవల్ల వారి ఆరోగ్యం దెబ్బతినడమేకాకుండా, మానసికంగా కృంగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేగాక పేద తల్లిదండ్రులకు వరకట్నం భయం అనేది మరో కారణం.

02/08/2018 - 21:28

అది ఏప్రిల్ 13, 1971 సంవత్సరం. పశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లాలోని హన్సపకుర్ అనే కుగ్రామం. అక్కడి కూరగాయల సంతలో కూరగాయలు అమ్ముతున్న సదన్ చంద్ర మిస్ర్తి(35) అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. పెద్ద జబ్బుకాకపోయిన సరైన మందులు, వైద్య సదుపాయం లేక చనిపోయాడు. ఈ సంఘటన అక్కడ కూరగాయలు అమ్మే ఓ వర్తకుడిని ఎంతో ఆవేదనకు గురిచేసింది. ఇక్కడ ఉంటే ఇలాగే ఏ రోగం వచ్చినా నయం చేసే దిక్కు లేదు అనుకున్నాడు.

02/07/2018 - 22:27

మన ఋషులు మనకు అందించిన సంపద వేదాలు. మనిషి ఎలా నడచుకోవాలో వివరించిన ఆ వైదిక ధర్మాన్ని నేడు మనం పాటించకపోగా అపహాస్యం చేసే పెడధోరణిలో వెళుతున్నాం. సనాతన ధర్మాన్ని నలుదిశలా వ్యాపింపజేసేందుకు ఎంతోమంది తమ జీవితాశయంగా బతికేవారు ఉన్నారు. అలాంటి కోవకు చెందుతారు శ్రీమతి పద్మావతి. పెద్దగా చదువుకోకపోయినా తండ్రి బాటలో నడుస్తూ వేద ప్రచారం చేస్తూ యజ్ఞ యాగాదులు నిర్వహిస్తున్నారు.

02/06/2018 - 21:14

అమ్మ పొత్తిళ్లలో వెచ్చగా పడుకోవలసిన ఆ పసికూనలు మురికికాలువల పక్కన, చెత్తకుప్పలలో కనబడుతున్నారు. ఆ ముక్కుపచ్చలారని పసిపిల్లలు కుక్కలకు ఆహారం అవుతున్నారు. కళ్లు తెరిచి సమాజాన్ని చూసేలోపే చిదిమేస్తున్నారు. అసలు పుట్టిందాకా ఎందుకు? అమ్మ కడుపులో ఉన్నప్పుడే పుట్టేది ఎవరో తెలుసుకోవటానికి స్కానింగ్ సెంటర్లకి పరిగెడుతున్నారు.

02/05/2018 - 21:23

పాశ్చాత్య సంస్కృతి మన సమాజంలో ఎన్నో రకాలుగా పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహిస్తుందనడానికి తార్కాణం మనం జరుపుకుంటున్న బర్త్‌డేలు- మదర్స్‌డేలు- ఫాదర్స్‌డేలు- వాలెంటైన్స్‌డేలు...
ఇపుడు వీకెండ్ ఎంజాయ్‌మెంట్స్ (వారాంతపు ఆనందాలు) జరుపుకునే సంస్కృతి కూడా వచ్చేసింది.

02/04/2018 - 21:42

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం తొణికిసలాడిన హస్తకళా నైపుణ్యం శ్రీ గాయత్రి సేవా హృదయం వృద్ధాశ్రమ సేవానిరతి

02/03/2018 - 00:11

మహాకవి శ్రీశ్రీ మనోగత భాష్యంగా సినీ గీత కవితగా అలనాడు తెలియజెప్పిన ‘సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం- స్వార్థపరుల నిర్మూలనే నీ లక్ష్యం’ అనేది ఇప్పటికీ నిజమై ఋజువుకాకపోగా మరింత దిగజారిపోతూన్న నేటి (మేటి) సమాజం తీరుతెన్నులు ఆందోళన కలిగిస్తున్నాయి. సుమతీ శతకారుడి ఉవాచలా నానాటికీ శూన్యమగుట నిక్కము సుమతీ అనే విధంగా మారిపోతున్న మన సభ్య సమాజ దృశ్య సాదృశ్యం.

02/01/2018 - 20:14

* వెంట్రుకల చివర్లు రెండు ముక్కలుగా అవుతున్నా.. ఈ సమస్యను నెయ్యితో వదిలించుకోవచ్చు. మూడు చెంచాల నెయ్యి తీసుకుని వెంట్రుకల చివర్లలో రాయాలి. పదిహేను నిమిషాల తరువాత దువ్వెన తీసుకుని దువ్వుకోవాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపుతో కడిగేసుకుంటే చాలు.

01/31/2018 - 20:09

నేడు టెక్నాలజీ పేరుతో విలాసవంతమైన జీవితం గడపడానికి అలవాటుపడి, ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నాం. పరిశ్రమలు వదిలే వ్యర్థ పదార్థాల వల్ల జల కాలుష్యం, వాహనాలు వదిలే పొగవల్ల వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ప్లాస్టిక్ పర్యావరణానికి ముప్పు అని తెలిసినా విచ్చలవిడిగా ప్లాస్టిక్ వస్తువులను వాడుతున్నాం.

01/30/2018 - 20:09

మీకు తెలుసా? కాకరకాయను కూరగాయ అని చాలా ప్రాంతాల్లో అనరు. దీన్ని పండుగానే భావిస్తారు. అందుకే దీని జ్యూస్‌ను పండ్ల రసం వలే తీసుకుంటారు. ఈ కాకార కాయ రసంపై పలు ప్రయోగాలు జరిగాయి. నోట్లో పెట్టుకుంటే చాలు ఛీ చేదు అని దూరంగా నెట్టేస్తాం. కాని ఈ చేదే ఎన్నో ఔషాధాల సమ్మేళనం అని వైద్యులు నొక్కి వక్కాణిస్తున్నారు. ఎన్నో ఔషధ ప్రయోజనాలు దాగి ఉన్న కాకరకాయను పండు వలే సేవించమని సలహా ఇస్తున్నారు.

Pages