S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

12/21/2017 - 19:35

తెలుగులో మాట్లాడటాన్ని నామోషీగా భావిస్తున్న ఈ రోజుల్లో తన మాతృభాష మీదున్న మమకారంతో లండన్‌లో నివశిస్తున్న నగర యువకుడు, గాయకుడు, సంగీతకారుడు అల్లూరి ప్రాన్స్‌లో జరుగుతున్న ఫ్రెంచ్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో తెలుగు రాక్ మ్యూజిక్ పాటలను ఆలపించి పాశ్చాత్యులను అలరించాడు. నిర్వాహకుల ఆహ్వానం మేరకు అల్లూరి ఈ ప్రదర్శన ఇచ్చారు.

12/20/2017 - 20:17

క్రిస్మస్ కాంతులు ప్రతి ఇంటా వెలుగులు నింపుతున్నాయి. చలికాలంలో వచ్చే ఈ పండుగకు ఇంటిని అందంగా ముస్తాబు చేసేందుకు వెరైటీ కొవ్వొత్తుల వెలుగులతో నింపేసేందుకు ప్రతి గృహిణి తహతహలాడుతోంది. మార్కెట్లోకి విభిన్న రకాల క్రిస్మస్ క్యాండిల్స్ వచ్చేశాయి. చిరు వెలుగులనిచ్చే క్యాండిల్స్‌ను ఏర్పాటుచేసుకుంటే ఇల్లు శోభాయమానంగా వెలుగొందుతుంది.

12/19/2017 - 19:58

ఇంటి పని ఎంత చేసినా తెమలదు అని అంటారు. నిజంగానే భార్యభర్తలిద్దరిలో భార్యనే ఇంటి పని ఎక్కవ చేస్తుందని తాజా అధ్యయానాలు వెల్లడిస్తున్నాయి. తండ్రులు విశ్రాంతి తీసుకుని ఆనందిస్తుంటే..తల్లులు ఇంటి పనులు ఎక్కువ చేస్తున్నారు. కొత్తగా జరిపిన అధ్యయనాల ప్రకారం ఇంటి పనులు , పిల్లల సంరక్షణ అనేవి ఇంకా సమానంగా పంచుకోవట్లేదని తేలింది. నాన్న కన్నా అమ్మ ఎక్కువ కష్టపడుతుందని పిల్లలు సైతం అంగీకరించే వాస్తవం.

12/16/2017 - 02:12

తె లంగాణ బంగారు చరిత్ర సంస్కృతి కలది. ఇక్కడ అన్ని కుల, మత, వర్ణ, వర్గ ప్రజలు సమైక్యంగా ఉంటూ కళలకు ఎంతో సేవ చేస్తున్నారు. కోహినూరు వజ్రం మన తెలంగాణ. నృత్యం, సంగీతం, సాహిత్యం అన్నింటిలో ఎంతో వైభవాన్ని సంతరించుకుంది తెలంగాణ. కొన్ని ముఖ్యమైన విషయాలు పరిశీలిస్తే తెలంగాణ కళారూపాల గొప్పదనం తెలుస్తుంది.

12/16/2017 - 02:13

మా తెలుగు తల్లికి మల్లెపూదండ..’’ కవి శంకరంబాడి సుందరాచారి 1972-73 సంవత్సరాలలో జరిగిన తొలి ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనడం గొప్ప సంఘటన. అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో ప్రపంచ తెలుగు మహాసభలకు అంకురార్పణ జరిగింది. ఇక రెండు, మూడు ప్రపంచ తెలుగు మహాసభలు (1981, 1990) తెలంగాణకు చెందిన నాటి రాష్ట్ర ముఖ్యమంత్రులు టి.అంజయ్య, డా.మర్రి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో జయప్రదంగా జరిగాయి.

12/15/2017 - 20:53

సురవరం ప్రతాపరెడ్డి (1896-1953) తెలుగునాడులో తెచ్చిన సాహితీమూర్తిమత్వం. సాంఘిక సంస్కరణ ప్రబోధ చైతన్యతావ్యాప్తి. దేశ చరిత్ర, సంస్కృతి, పత్రికా నిర్వహణ, పురా భారతీయ తత్వ చింతన, జనజీవనం, పరిశోధక సాహిత్య పరిణామ రీతులు, తలచుకున్నప్పుడు ఆ మహానుభావుడు తీరాంధ్రంలో కందుకూరి, గిడుగు, గురజాడలు ఫలదీకరించిన సమాజ జీవన ప్రబోధ చైతన్య పరివ్యాపకుడు తెలంగాణలో అని అర్థమవుతుంది.

12/15/2017 - 20:44

జీవితం ఒక సుదీర్ఘయాత్ర. నిరంతర అనే్వషణ. ఒక అభ్యాసం. అపరిపూర్ణత నుంచి పరిపూర్ణత వైపుగా చేసే ప్రయాణం. ఈ పరిమిత జీవితానికి అపరిమితమైన శక్తిని కలిగించేదీ, వెలుగులను విస్తరింప చేసేదీ విలువను కలిగించేదీ మహాపురుష సందర్శనం. ఈ మహాపురుషుడు గురువు కావచ్చు. ప్రాణదాత కావచ్చు. జీవన పరమార్థాన్ని విప్పిచెప్పే వ్యాఖ్యాత కావచ్చు. ఒక ఆశ్చర్యం కలిగించే ప్రభావ పరిధిలో నీ చైతన్యాన్ని పరిపాలించే ప్రభువు కావచ్చు.

12/15/2017 - 20:36

సరోజిని నాయుడు వంటి బహుముఖ ప్రతిభాశాలిని ఆమె కాలంలో భారతదేశంలో మరొకరు లేరు. ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు, బెంగాలీ, పర్షియన్ భాషలలో ప్రావీణ్యం ఉంది. 12 ఏళ్ళ వయసులోనే మెట్రిక్యులేషన్ పరీక్షలో కృతార్థురాలైంది. అన్నింటికన్నా మహాద్భుత విషయం సర్ కూర్మా వెంకటరెడ్డి నాయుడు ఏలూరులో ఒక మహిళా కళాశాల నెలకొల్పారు. బహుశా దక్షిణాదిలోనే ఇది తొలిసారి నెలకొన్న మహిళా కళాశాల కావచ్చునేమో!

12/14/2017 - 20:39

తె లుగు భాషకు శుభోదయం.. తెలుగువాడికి నవోదయం.. యావత్ తెలుగు హృది ఆనందంతో పులకించే ఉత్తేజకర తరుణమిది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు నుడికారానికి పండుగ. తెలుగు అక్షరానికి నిండైన ఆశీస్సులందించాల్సిన క్షణమిది. ప్రపంచ తెలుగు మహాసభల తరుణం ఆసన్నమైంది. ఎప్పుడెప్పుడా అని ప్రతి తెలుగువాడు ఆత్రంగా, ఆత్రుతగా, ఆనందంగా వేయి కళ్లతో ఎదురుచూసిన శుభవేళ.. అమ్మ మాట ఎంత గొప్పదో.. అమ్మ భాషా అంతే గొప్పదని చాటిచెబుదాం.

12/14/2017 - 20:29

గామీణ జీవన నేపథ్యంలో జన్మించి స్వయంకృషితో నీతి, నిజాయితీ, నిబద్ధతలే ఆలంబనగా, చరిత్రలో భారత ప్రధానిగా తనదైన విశిష్ట ముద్రను వేసుకున్న మహోన్నత వ్యక్తి పి.వి.నరసింహారావు. తన అసాధారణ మేధస్సుతోనూ, రాజనీతిజ్ఞతతోనూ ప్రపంచ దేశాల సేవలను నివ్వెరపరచిన పి.వి.

Pages