S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

12/14/2017 - 20:24

తెలుగులో మొట్టమొదటి కథలు రాసిన దళిత రచయిత భాగ్యరెడ్డి వర్మ. మాదిగల వెట్టిచాకిరీని చూసి చలించి ‘అజ్ఞాతవాసి’,‘వెట్టిమాదిగ’ రచనలను భాగ్యరెడ్డి వర్మ రాశారు. గణపతి తత్త్వం అనే నాటికను కూడా ఆయన రాసి మెప్పించారు. భాగ్యరెడ్డి వర్మ చాలా రచనలు ఇప్పుడు లభించడం లేదు. తనపేరు, హైదరాబద్ కలసి వచ్చేలా ‘్భగ్యనగర్’ పత్రికలను వెలుగులోకి తీసుకువచ్చారు.

12/14/2017 - 20:10

సంబరం! అంబరాన్ని అంటే సంబరం! వెలుగు తిరునాళ్లు. తెలంగాణ పరగణాలో తెలుగు తిరునాళ్లు. అప్పుడప్పుడూ అక్కడక్కడా ఖైదులో ఊపిరాడనట్లుగా ఉన్న నా వాణికి గొప్ప విడుదల మోజులు - ఈ అయిదు రోజులూనూ. నాకు ఆనందం కందమయింది. మాకందమయింది. నాలోని భావాలు ఉత్పలాలయ్యాయి. భావనలు చంపక పరిమళాలయ్యాయి. నాలోని అనుభూతి రసాలు సీసాలయ్యాయి. నా ఎదలోని అణువణువూ - పరుగెత్తే పిల్లల్లా తేటగీతుల పరాగాల రేణువులే అయ్యాయి.

12/13/2017 - 19:53

‘‘నా జడ చూడు బావా.. వాలు జడ చూడు బావా!’’ అని
ఓ కనె్నపిల్ల పాట విన్నాడు.
‘‘నువ్వు కులుకుతు, గలగల నడుస్తూ ఉంటే,
నీ వాలు జడ అటు ఇటు ఊగుతూ వుంటే,

12/08/2017 - 18:50

వేదశ్రీ ఉదయం నుండీ ఒకటే బాధపడుతోంది. తనకు భర్త విలువివ్వడు. పదిమందిలో టిఫిన్ బాగాలేదని అవమానిస్తాడు బాగున్న రోజున బాగుందని చెప్పడు. ప్రతి ఒక్కళ్లనీ విశ్రాంతి తీసుకోమని ఇంటికి ఆహ్వానిస్తాడు. ఇక తన కష్టం సుఖం ఆలోచించడు. ఒకోసారి అనిపిస్తోంది ఎందుకీ జీవితం అని. ఒక్కోసారి విసుగొచ్చి విడిపోవాలని కూడా అనిపిస్తుంది.

12/07/2017 - 18:58

ఏమి చేయాలో తెలియని అయోమయావస్థ.. మంచి చేస్తున్నామని చెడు చేస్తున్నారు.. పునరాలోచన చేద్దాం రండి.. రేపటి పౌరులను తయారుచేయడంలో మనం వెనుకబడిపోతాం.. మానవ ఒనరే ముఖ్యమైనది.. ఎన్ని యంత్రాలున్నా వాటిని నడిపించడానికి, వాటిని తయారుచేయడానికి మనిషి కావాల్సిందే.. మీరు కూడబెడదామనుకుంటున్న డబ్బును తినడానికి మీ వారసులు ఉండనక్కర్లేదా? ఆలోచించండి..

12/06/2017 - 19:46

సుదీర్ఘకాలం వాదోపవాదాలు జరిగిన తరువాత ఎట్టకేలకు ముస్లిం మహిళలు బురఖా ధరించడాన్ని నిషేధించే విషయమై డెన్మార్క్ పార్లమెంట్‌లో అన్ని పార్టీలు ఒక్క త్రాటిపైకి వచ్చాయి. అయితే ఈ నిషేధం మహిళలకు పరదా మాటున ఉంచేయడాన్ని వ్యతిరేకించడానికే గాని సంప్రదాయ వస్తధ్రారణను వ్యతిరేకించడం కాదని డెన్మార్క్ లిబరల్ పార్టీ అధికార ప్రతినిధి జాకోబ్ ఎల్లేమాన్ జెనే్సన్ అంటారు.

12/05/2017 - 18:20

రాత్రి పదిగంటలకు ఇంటిల్లిపాదీ కలసి కూర్చొని భోజనం చేస్తారు. ఆ ఆనందమే వేరు. తరువాత నిద్రకు ఉపక్రమిస్తారు. ఉదయం నిద్ర లేచింది మొదలు ఉరుకులు పరుగుల జీవనమే. పిల్లల్ని బడికి సిద్ధం చేసి, భర్తను ఆఫీసుకు పంపిన తరువాత టైమ్ చూసుకుంటే అపుడు గుర్తుకు వస్తుంది ఆకలి. దాదాపు పది గంటలు పొట్ట ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో ఆమ్లాలు విడుదలవుతూనే ఉంటాయి. ఇవి ఆసిడిటీ, ఇతర జీర్ణ సమస్యలకు దారితీస్తాయి.

12/01/2017 - 19:39

మనిషి ఒంటరిగా ఏ అడవిలోనో, ఎడారిలోనో జీవించలేడు. సాటి మనిషి తోడుగా... సాటి పౌరుల సహాయ సహకారాలతో... ప్రేమాభిమానాలతో కలిసి మెలిసి బ్రతకాలని కోరుకుంటాడు. అలా ఒకచోట... కొంతమందితో కలిసి జీవనయానాన్ని సాగించటానే్న ‘సమాజం’ అంటారు. మనిషికీ ఈ సమాజానికీ మధ్య ఉన్న అనుబంధం తప్ప గొప్పదంటే ‘మనిషి లేనిది సమాజం లేదు... సమాజం లేకుండా మనిషి ఉండలేడు’ అన్నంతగా...! ఒక సమాజం...

11/30/2017 - 21:21

చలికాలం వచ్చేసింది. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం పడిపోయాయి. కాలంతో పాటు బట్టల ఎంపికలోనూ వైవిధ్యం కనిపించాలి. శీతాకాలంలో ఎలాంటి దుస్తులు, ఏ కలర్‌లో వేసుకుంటే బాగుంటుందోఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. వెచ్చదనం కోసం స్వెట్టర్లు, జాకెట్స్ కోసం వెతుకులాట కూడా ఆరంభమైంది. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా మన దుస్తులు ఆహార్యానికి తగ్గట్టు ఎంపిక చేసుకోవాలి.

11/29/2017 - 20:08

కళలు మన సంస్కృతిలో భాగం. మనుకున్న అరవై నాలుగు కళల్లో చిత్ర కళ ఒకటి. కాసుల కోసం కుంచెను చేతబట్టేవారు ఎందరో ఉన్నారు. కాని ఈ చిత్ర కళతో సామాజిక చైతన్యానికి ముఖ్యంగా మహిళల్లో మనోధైర్యాన్ని నింపుతున్నారు మైలవరపు రమణి. సామాజిక అంశాలే ఆమె చిత్రాలలో ప్రతిబింబిస్తాయి. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఆమె కుంచెలో నాట్యం చేస్తుంటాయి.

Pages