S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

05/12/2016 - 22:18

వేసవి కాలం వచ్చిందంటే చాలు మగువల మనసంతా మల్లెల పరిమళాలే. ఉష్ణతాపం వేళ చికాకులెన్నున్నా మల్లెల గుబాళింపును ఆస్వాదిస్తే చాలు ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఇంట్లో కిటికీ పక్కనో, బాల్కనీలోనో కాస్త ఎండ తగిలే స్థలం ఉంటే మల్లెమొక్కలను పెంచుతూ ఇంటిని సుగంధాలతో నింపేయవచ్చు. పెరట్లో విచ్చుకున్న మల్లెల సుగంధాలు ఇంట్లోనూ పరిమళించాలంటే కుండీల్లో ఈ మొక్కలను పెంచుకోవచ్చు.

05/11/2016 - 21:42

‘సాదాసీదాగా ఉద్యోగం చేయడం కాదు.. సవాళ్లను ఎదుర్కొంటూ సమాజం కోసం పనిచేస్తేనే మన సత్తా ఏమిటో ప్రపంచానికి తెలుస్తుంది..’ అంటున్నారు సివిల్ సర్వీసెస్ పరీక్షలో టాపర్‌గా నిలిచిన టీనా డాబీ. లింగ వివక్షకు నిలయమైన హర్యానాలో పనిచేసేందుకు ఇష్టపడుతున్నానని, అక్కడి మహిళలు సాధికారత సాధించేలా కృషి చేస్తానని ఆమె తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ‘హర్యానాలో లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణహత్యలు ఎక్కువ..

05/10/2016 - 22:09

వేసవి కాలం వచ్చిదంటే మల్లెల గుబాళింపును ఆసాద్వించనివారు ఉండరు. ఎన్నిరకాల పూలున్నా పరిమళాలు వెదజల్లే గుప్పెడు మల్లెలనే ఇష్టపడతారు. ఇది పెళ్లిళ్ల సీజన్‌తో పాటు ఈ కాలంలో లభించే మల్లెలతో పూలజడలను వేయించుకోవటానికి ముచ్చటపడుతుంటారు. గ్రామీణ ప్రాంతాలలో ఈ ముచ్చట ఎక్కువగా కనిపిస్తోంది. పిల్లలు, యువతలు, మహిళలు సైతం సొయగాలొలికే పూల జడల అలంకారం పట్ల మక్కువ చూపిస్తారు.

05/10/2016 - 22:07

అది దేశ రాజధానిలోని మురికివాడల ప్రాంతం. ఓ పాఠశాల తరగతి గదిలోకి 81 సంవత్సరాల వృద్ధురాలు చకచక నడుచుకుంటూ వెళ్లింది. పిల్లలంతా ‘గుడ్ మార్నింగ్ టీచర్’ అని పెద్దుపెట్టున విష్ చేశారు. అక్కడ ఉన్నది 12 మంది విద్యార్థులే. అందులో 11మంది బాలురు, ఒక బాలిక. గోడల నిండా సందేశాత్మకమైన రంగు రంగుల పోస్టర్లు అంటించారు. వెంటనే ఆ పిల్లలు ‘ఏ ఫర్ ఎయిర్‌పోర్టు, బి ఫర్ బ్లాక్ బెర్రి అని అరవటం ప్రారంభించారు.

05/08/2016 - 01:21

దేశాన్ని పాలించే నాయకుడు కూడా తల్లి గర్భంలో తొమ్మిది నెలలుండిన తరువాతే భూమిపై అడుగుపెడతాడు. నేటి సమాజంలో ఉండడానికి ఇళ్లు అద్దెకు తీసుకున్న తరువాత, నెల అవ్వగానే ఇంటి అద్దె, నీళ్ల బిల్లు, కరెంటు బిల్లు అని అడిగే ఈ రోజుల్లో, ఉండడానికి తన గర్భాన్ని, బ్రతకడానికి తన వాయువుని, ఆహారాన్ని ఇంక అనురాగాన్ని ప్రతిఫలం ఆశించకుండా ఇచ్చే ఏకైక ప్రాణి అమ్మ ఒక్కర్తే.

05/08/2016 - 01:03

అమ్మ ఒడే శిశువు చిరునవ్వుల మొదటి బడి. ఆ బడిలోనే ప్రతి శిశువు అవ్యాజ్యమైన ప్రేమను పొందుతూ పెరుగుతాడు. తల్లి అనంతమైన ప్రేమ, వాత్సల్యమే సృష్టి నిలిచి ఉండడానికి కారణమని చెప్పి తీరాలి. బిడ్డ జీవితంలో శక్తిని నెలకొల్పటానికి, ఆ శక్తికి ఒక దిశా నిర్దేశం నేర్పగల మహామూర్తి అమ్మ. ఉత్తమ ఆలోచనలు గల తల్లి పిల్లలను, నిరంతర విద్యార్థులని, జ్ఞాన సముపార్జన నిరంతర ప్రక్రియ అని సున్నితంగా తెలిపే అపురూప ఖని.

05/06/2016 - 21:20

‘బూస్ట్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ’ అనే ప్రకటనకు ఆకర్షితులై ఎంతోమంది తల్లులు తమ పిల్లలు గొప్ప క్రికెట్ ఆటగాడు కావాలని వందల రూపాయలు పోసి బూస్ట్ కొనుగోలు చేసేవారు ఈ దేశంలో కొదవలేదు.

05/05/2016 - 22:21

ఎవరన్నారు, ఆడది ఒంటరిగా ప్రయాణం చేయలేదని? అవకాశం రావాలేగాని అలవోకగా ప్రపంచాన్ని చుట్టి వచ్చేస్తుంది. ఈ మాటను అక్షరాలా నిజం చేసి చూపిన మహిళ మెహర్‌మూస్. మెహర్ హెరోయిస్ మూస్... సాహసానికి మారుపేరు. నిరంతరం ప్రయాణికురాలు. తన 70 ఏళ్ల జీవితంలో 181 దేశాలను చుట్టేసి వచ్చిన నిత్య యాత్రికురాలు. అంటార్కిటికా మంచు ఖండానికి వెళ్లిన తొలి భారతీయురాలు ఈమె.

05/03/2016 - 21:22

వివాహంలో వరుడు వధువు మెడలో కట్టే ‘మంగళసూత్రా’నికి లేక ‘మాంగల్యతంతు’నకే ‘మాంగల్యం’ అనేది సంక్షిప్తనామం.
‘వివాహం’లో వరుడు వధువు మెడలో ‘మాంగల్యం’ కడుతూ మూడు ముళ్లు వేయడం అనాదిగా వస్తున్న అద్భుత సంప్రదాయం.
మూడు ముళ్లు వేయడం ఎందుకు- అంటే, ఒక్కొక్క ముడితో ఒక్కొక్క వాగ్దానం చెయ్యలి కాబట్టి.

04/29/2016 - 21:46

భారతీయ సమాజంలో ఇంటి పనిలో భార్యకు సహాయపడటం పరువు తక్కువ పనిగా భావించే పురుషుల శాతం చాలా ఎక్కువ. మహిళలు వంట, పడకింటికి మాత్రమే పనికివస్తారనే దురభిప్రాయం కొంతమందిలో వుంది. ఇంటి పనిలో భార్యలకు సహాయపడేవారిని ఎద్దేవా చేయడం కూడా మనం తరచూ చూస్తూనే వుంటాం. అయితే భార్యాభర్తలనేవారు సంసారం అనే ఎద్దులబండికి కట్టబడిన జోడెద్దులు వంటివారనే విషయాన్ని విస్మరిస్తున్నారు.

Pages