S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

11/10/2017 - 20:21

ప్రతి మనిషి జీవితానికి బాల్యం తొలిపొద్దులాంటిదే. ఆ పసి మనసులో పడే ముద్రలే భవితకు బాటలు వేస్తాయి. నిర్మలమైన ఆ బాల్యం అద్భుత దశ. మంచి పౌరులుగా ఎదగాలంటే మొక్కదశలోనే వారిని కుదురుగా వంచాలి. కర్తవ్యంతో పెంచాలి. విలువలు పుణికిపుచ్చుకునే బాల్య దశలోనే బీజాలు పడాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రధాన భూమిక పోషించాల్సిన అవసరం ఉంది. పిల్లల పెంపకం అనేది నేడు తల్లిదండ్రులకు పెను సవాల్‌గా మారింది.

11/09/2017 - 19:43

హిందూ వివాహ చట్టం భార్యాభర్తలకు పవిత్ర బంధాన్ని కల్పించింది. కట్టుబాట్ల నీడలో తమ సంసారాలను అందమైన బృందావనాలుగా మార్చుకుంటారు. ఆప్యాయయతల మాటున నిండు నూరేళ్ల జీవితాన్ని సుఖమయం చేసుకుంటుంటారు. ఆనాడు చట్టాలు చేసే సమయంలో వైవాహిక అత్యాచారం కూడదంటూనే అలాంటి సందర్భాలు మంచివి కావనీ సూత్రీకరించారు. వాటిలో కూడా భారతీయ శిక్షాస్మృతిలో కొన్ని మినహాయింపులున్నాయి.

11/08/2017 - 19:17

శాస్ర్తియ సంగీత స్వరఝరి డాక్టర్ గిరిజాదేవి. అలనాటి మీరాబాయి ఎలా పాడారో మనకు తెలియదు కానీ అలాంటి భక్తి సంగీతాన్ని ఆమె ఎల్లలు దాటించారు. సంగీతానికి శాస్ర్తియతను జోడించి తుమ్రి క్వీన్‌గా ప్రసిద్ధిచెందిన లెజెండరీ సంగీత విద్వాంసురాలు డాక్టర్ గిరిజాదేవి. ఈ అమర గాయకురాలి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఆమె అడుగుజాడల్లో నడిచే సంగీత కళాకారులు ఎందరో ఉన్నారు.

11/07/2017 - 18:07

విశ్వాసానికి ప్రతీక శునకాలు. వాటికి చక్కటి శిక్షణ ఇస్తే యజమాని భద్రతకు అవి ఇచ్చే భరోసా మనిషి సైతం ఇవ్వలేడు. ఎలాంటి కుక్కనైనా తన దారిలోకి తెచ్చుకుంటాడు ఈ యువకుడు. హైదరాబాద్‌కు చెందిన మంత్రవాది చంద్రశేఖర్‌కు కుక్కలు అంటే వల్లమాలిన ప్రేమ. వాటిని కను సైగలతో కట్టడి చేస్తాడు. అతడు పది నిమిషాలు గడిపితే చాలు అవి మంచి నేస్తాలుగా మారిపోతాయి. వాటిని మచ్చిక చేసుకోవటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.

11/04/2017 - 19:23

మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని పదికాలల పాటు పదిలంగా ఉంచాలి. అన్నపానీయాల విషయంలో సమయ నియమాలు ఎంతో అవసరం. నిజానికి మనం తీసుకున్న ఆహారం జీర్ణవ్యవస్థలో సాఫీగా అరిగిపోయే విషయంలో ఎన్నో అంశాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఆయా పదార్థాల్లో వున్న గుణాలు, పోషకాలు, ఘనాహారం, ద్రవాహారం, రసాయనాలు, జీర్ణ వ్యవస్థలో చేరిన తర్వాత వాటి కారణంగా విడుదలయ్యే రసాలు, జరిగే క్రియలు.

11/03/2017 - 19:42

పరమ పావనమైనది కార్తీకమాసం. శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీకం. ఈ మాసంలో అత్యంత పవిత్రమైనది, విశిష్టమైనది కార్తీక పౌర్ణమి. ఈ నెలలో చంద్రుని వెనె్నల కాంతులు నిండుగా భూమిపైకి ప్రసరిస్తాయ. పౌర్ణమినాడు మహిళలంతా ఉపవాసం ఉండి దీపాలను వెలిగిస్తారు. ఇంటి ముంగిట, పుణ్యతీర్థాల్లో, దేవాలయ ప్రాంగణాల్లో, నదీ తీరాల్లో, పుష్కరణిలో దీపాలు వెలిగిస్తారు.

11/02/2017 - 19:31

ఏలాగు భోంచేతుము
ఈ విందు మే మేలాగు భోంచేతుము
కూర్చుండ చోటే లేదు
జానాబెత్తెడు విస్తళ్లలోన
హస్తంబు ఆడించ అసలే వీలుకాదు
వంటకాలలోన రుచీపచీ లేనేలేదు
వడ్డించే వదినగారి వడ్డాణము జారిపోయే
ఏలాగు భోంచేతుము...

11/01/2017 - 19:44

ఆమె వయసు ముప్ఫై ఐదు సంవత్సరాలే. కానీ సూపర్‌బైక్ 800 సిసి బిఎండబ్ల్యు ఆమె ఎక్కింది అంటే మేఘాల మీద ఎగురుతున్నట్టు వుంటుంది. ఆమెనంతా సూపర్ బైక్ రాణి అంటారు. ఆమె పేరు మరాల్ యాజర్లు. సొంత దేశం ఇరాన్. కానీ అక్కడ ఆడాళ్లని మోటార్ సైకిల్ దాకా ఎందుకు మామూలు సైకిలే ఎక్కనివ్వరు. అంచేత, 2004లో మన దేశం వచ్చి పూణెలో సెటిల్ అయింది.

11/01/2017 - 19:38

ఆధార్ కార్డే పవిత్ర భారతదేశంలో జీవనాధారం అంటున్నారు ఏలినవారు. ఉత్తరాఖండ్‌లో హరిద్వార్‌కి ఇరవై కిలోమీర్ల దూరంలో వున్న ఒక గ్రామంలో వనగుజ్జర్ల తెగకి చెందిన ఎనిమిది వందల కుటుంబాలు జీవనం వెళ్లబుచ్చుకుంటున్నాయి.

10/31/2017 - 19:42

కార్తీకమాసం అనగానే మనకు గుర్తుకువచ్చేది వనభోజనాలు.వన భోజనం అంటే ఎక్కడ పడితే అక్కడ చేసే కార్యక్రమం కాదు. వన భోజనానికి ఎంచుకునే ప్రదేశం అత్యంత పవిత్రంగా ఉండాలి. వన భోజనాలకు రకరకాల పల, పుష్ప, వృక్షాలు కలిగి ఏడి ఒడ్డున ఉన్న ప్రదేశాన్ని ఎన్నుకోవడం ఉత్తమం. అక్కడ తప్పనిసరిగా ఉసిరి చెట్టు ఉండాలి. తులసివంటి మొక్కలు కూడా ఉంటే మరీ మంచిది. బయట నుండి తెచ్చినవి కాకుండా ఆహార పదార్థాలు అక్కడే వండుకోవాలి.

Pages