S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

07/28/2016 - 22:07

అమెరికా.. ప్రపంచంలో ఎక్కువమందికి తెలిసిన పేరు ఇది. అమెరికాను భూతల స్వర్గంగా భావించే భారతీయులు ఎక్కువ. దూరపు కొండలు నునుపు అన్న చందాన భారతీయులలో ఎక్కువమంది అమెరికా వెళ్లడానికి అర్రులు చాచుతుంటారు. ప్రపంచంలో శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలిగినా అందుకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అమెరికా పాత్ర ఉంటుంది.

07/27/2016 - 21:32

పశ్చిమ బెంగాల్‌ని అకారాది క్రమంలో వెస్ట్‌బెంగాల్ గానే వ్యవహరించి- వెనక్కి నెట్టేశారు. ఇది తన పరువు ప్రతిష్ఠలకే భంగం అనుకున్న వెస్ట్‌బెంగాల్ ముఖ్యమంత్రి శ్రీమతి మమతా బెనర్జీ- రాష్ట్రం పేరు మార్చాలని- ఏర్పాట్లు ముమ్మరం చేసింది.

07/26/2016 - 21:22

ఈ మధ్య కాలంలో పిల్లలు, పెద్దలు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఎక్కువ సేపు టీవీ చూడటం మంచిది కాదంటున్నాయి ఆధునిక పరిశోధనలు. రోజులో ఎక్కువ సమయం టీవీ ముందు గడిపితే ఊపిరితిత్తులలో రక్తం గడ్డ కట్టుకుపోయో అవకాశాలు ఉన్నాయని జపాన్‌లో జరిపిన పరిశోధనలలో వెల్లడైంది. జపాన్ పరిశోధకులు 1988 నుంచి 1990 మధ్యకాలంలో టీవీ చూస్తున్న దాదాపు 86,024 మందిపై పరిశోధనలు చేశారు. వీరంతా 40-79 ఏళ్ల వయసువారు.

07/24/2016 - 06:03

చింతచిగురు రుచికే కాదు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. పోషక విలువలు ఎక్కువగా ఉండే ఆకు కూరల్లో చింత చిగురు ఒకటి. చింతచిగురు గురించి తెలియనివారు లేరు. చింతచిగురులో యాంటీసెప్టెక్ గుణాలు అధికంగా వుంటాయి. ఇది యాస్ట్రింజెంట్ మాదిరి పనిచేసి మన శరీరంలోని వ్యర్థాలను బయటకు తొలగిస్తుంది. అన్ని వయసులవారూ దీన్ని తీసుకోవటానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. లేత చింత చిగురును ఆకుకూరలు మాదిరిగా ఉపయోగిస్తారు.

07/22/2016 - 20:47

‘‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవము’’ అన్న మహాకవి గురజాడ అప్పారావు మాటలను ఆచరణలో చూపిస్తున్న చిన్నారి మీరా వశిష్ఠ్. తన తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడినప్పటికీ, ఆమెకు మాతృదేశంపై వున్న మమకారం తగ్గలేదు. దేశంలో

07/21/2016 - 23:40

ఉదయానే్న కప్పు కాఫీ లేదా టీ గొంతులో పడందే ఇంటి పనుల్లోకి అడుగుపెట్టలేనివారు చాలామంది ఉన్నారు. పరగడుపునే టీ లేదా కాఫీ సేవించటం వల్ల ఆరోగ్యం పాడవుతుందని, దీనికి బదులు గ్రీన్ టీ తీసుకోమని సలహా ఇస్తుంటారు. కాని గ్రీన్ టీ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయని అం టున్నారు. దీనివల్ల కూడా ఆరోగ్యానికి చేటేనని అధ్యయనాలు వెల్లడిస్తున్నా యి.

07/19/2016 - 20:47

పిల్లలు ఏటేటా ఎదిగితేనే కన్నవారికి సంతోషం. ఆరోగ్యకరమైన జాతి సంపద సమాజానికి ఎంతో అవసరం. కాని దురదృష్టవశాత్తు మనదేశంలో పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచంలోని కొన్ని దేశాలలో పిల్లల ఎదుగుదల సమస్య రానురాను తీవ్రరూపు దాల్చుతోంది. ఈ దేశాలనే ఱ్గన్ళిడ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) అని పిలుస్తారు.

07/15/2016 - 21:08

అమ్మాయలు ఎక్కువగా ఇష్టపడే పూలు గులాబీలు. ప్రేమకు చిహ్నాలు. కేవలం అలంకరణకే పరిమితం కాక గులాబీలు ఆరోగ్య పరిరక్షణలోను, సౌందర్య పోషణలోను, సుగంధ ద్రవ్యంగాను పనిచేస్తాయి. సులభంగా పెంచుకోదగిన మొక్క కనుక ఏ ఇంటి ముంగిలిలో చూసినా రంగు రంగుల గులాబీలు తళుకులతో, సువాసనలు వెదజల్లుతూ ఆహ్లాద పరుస్తూ కనిపిస్తుంటాయి. గుత్తులు గుత్తులుగా చెట్టు నిండుగా అలలారుతూ కన్నుల పండువగా వుంటాయి.

07/14/2016 - 21:55

దేశం నాకేమి ఇచ్చింది అని కాదు, దేశానికి నేను ఏమి చేశానని ప్రతి ఒక్కరు తమను తాము ప్రశ్నించుకోవాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది. ఉగ్రవాదుల దాడులతో అతలాకుతలమైపోతున్న వేళ దేశ రక్షణకు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందంటున్నారు ఆధునిక మహిళలు. సైన్యం పనిచేస్తూ అసువులు బాసిన తమ భర్తల బాటలోనే నడిచేందుకు భార్యలు సిద్ధమవుతున్నారు.

07/14/2016 - 21:52

ప్రేమ అత్యంత మానవీయమైన అంశం. ప్రేమించే మనిషి ఎంతో దయగలవారై ఉండాలి. ప్రేమించడం, ప్రేమతో వ్యవహరించడం ఒక జీవనశైలి. ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే కాదు, అదొక జీవన విధానం. ప్రేమను ఈ దృష్టితో చూసినపుడు ప్రేమించే మనిషి ఎలా ఉండాలో అర్థం చేసుకోవడం తేలిక.

Pages