S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

12/27/2016 - 23:08

బాదం పప్పు: బరువు తగ్గుటకు సహకరిస్తుంది. గుండెను ఆరోగ్యంగా వుంచుతుంది. హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఎముకలను దృఢంగా చేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
వాల్‌నట్: బ్రెస్ట్ కాన్సర్ రిస్క్‌లను తగ్గిస్తుంది. శుక్రకణాలను అభివృద్ధి చేస్తుంది. హార్ట్ ఎటాక్ రిస్క్‌ను తగ్గిస్తుంది. బ్లడ్ లెవెల్స్‌ను పెంచుతుంది. టైప్-2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

12/24/2016 - 21:19

ఓసారి నోరు తెరుచుకోని బాధితుడు దాని చికిత్స కోసం వచ్చాడు. ‘‘గుట్కా తింటారా’’’ అని అడిగా. ‘‘తినేవాడ్ని. వారం అయింది, మానేశా. ఇప్పుడు తినట్లే’’ అని చెప్పాడు. ‘‘‘అవునా! సరే పదండి పరీక్షిస్తా’’ అని తీసుకెళ్లి కూర్చోబెట్టి నోరు తెరవమన్నా. తన కింది ఎడమ వైపు దవడ పళ్లమధ్య గుట్కా ముక్కలు ఉన్నాయి. ‘‘మీరు పళ్లు తోమరా’’ అని అడిగా. ‘‘లేదు డాక్టర్, రోజూ పది నిమిషాలు తోముతా, అలా అడిగేరేంటి’’ అన్నాడు.

12/23/2016 - 22:30

మెదడు సమర్థంగా పనిచెయ్యటానికి కొన్ని పోషకాలు చాలా అవసరం. ఇందుకోసం మన ఆహారంలో కొన్ని రకాల పదార్థాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. మెదడును చురుకుగా ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఇందుకు వ్యాయామం దగ్గరనుంచి కొత్త హాబీలను అలవరచుకోవటం వరకూ రకరకాల పద్ధతులు తోడ్పడతాయి. ఇవి జ్ఞాపకశక్తి మెరుగుపడటానికి దోహదం చేస్తాయి.

12/22/2016 - 22:06

సమాజంలో పిల్లలు గురించి.. తల్లిదండ్రులు ప్రతిక్షణం ఆలోచన చేస్తూనే వుంటారు. తప్పదు మరి. ఎందుకంటే.. అది వారి బాధ్యత. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకు అవగాహన లేకపోతే నష్టపోయేది చిన్నారులే. పిల్లలకు స్వేచ్ఛ అనేది కొంత పరిమితి వుండాలి. మితిమీరిన స్వేచ్ఛ అనర్థదాయకం. ఒక వయస్సు వచ్చేవరకు మాత్రమే అది సాధ్యం. కొందరు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు తగినవా? కావా?

12/22/2016 - 22:02

మనసులో సేవ చేయాలనే సంకల్పం కలిగితే సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుడతాం. ఈ దంపతులది కూడా ఇదే ఆలోచన. టీనేజ్ వయసు నుంచి ఇద్దరూ పరులకు ఏదోరకంగా చేయాలనే తాపత్రయపడేవారు. విచిత్రంగా ఒకే ఆలోచన ఉన్న ఈ ఇద్దరినీ పెళ్లి అనే బంధం కలిపింది. ఎక్కడో ఎవరికో సేవ చేయటం ఎందుకు జన్మభూమికే సేవచేస్తే జీవితానికి సార్థకం ఉంటుందని భావించి లక్షల్లో వచ్చే ఆదాయాన్ని సైతం వదులుకొని స్వదేశానికి వచ్చారు.

12/20/2016 - 21:56

నా స్నేహితురాలింట్లో పిచ్చాపాటీ మాట్లాడుకుంటుండగా ఆమె కోడలి బంధువు వచ్చింది. పరిచయాలూ, కాఫీలూ అయ్యాక బంధువు ‘‘రోజూ పద్దెనిమిది గంటలు పని చేస్తున్నాను. విశ్రాంతి అంటే ఏమిటో తెలియదు. నాకై నేను సమయం కేటాయించుకునే అవకాశమే లేదు’’ అంటూ అరగంటసేపు వాపోయింది. ‘‘ఇంతసేపు నీ కష్టాలు నువ్వు మా అందరికీ చెప్తూనే ఉన్నావు. ఈ సమయమెవరి ఖాతాలో వెయ్యాలి’’ అని అడగాలనిపించలేదు.

12/15/2016 - 21:51

తెలుగువారి ముంగిళ్లలో పెద్ద పండుగ సందడి మొదలైంది. ఎప్పుడెప్పుడా అని చిన్నా పెద్దా ఎదురుచూసే సంక్రాంతి సంబరాలను మోసుకుంటూ ఇంటి ముంగిటకు చేరింది. ధనుస్సంక్రమణం ప్రారంభం కావడం నెల్లాళ్ల పండుగ సంబరం మొదలవుతోంది. ముత్యాల ముగ్గులతో వాకిళ్లు కళకళలాడనున్నాయి. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల మేళాలు, ఆటల పోటీలు, కోడి పందాలు అందరినీ ఉత్తేజపరచనున్నాయి. ఊరు,వాడా ముస్తాబవుతోంది.

12/14/2016 - 21:17

డిసెంబర్ నెల వచ్చిందంటే చలితో పాటు క్రిస్మస్ పండుగ ఇంటింటా సందడి చేస్తోంది. ఇళ్లను అందంగా పెయింటింగ్‌లతో ముస్తాబు చేస్తారు. విభిన్న రంగుల పూలతో అలంకరించిన వస్తువులతో ఇంటిని చక్కగా తీర్చిదిద్దుతారు. అతిథులకు స్వాగతం పలికేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ పండుగ సందర్భంగా క్రిస్టియన్ సోదరులు ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ కానుకలను ఇచ్చుకుంటారు. ప్రతి ఇల్లు స్టార్ వెలుగులతో నిండిపోతుంది.

12/13/2016 - 22:17

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి చలి పెరుగుతూ ఉష్ణోగ్రతలు అక్కడక్కడ సింగిల్ డిజిట్‌లో నమోదవుతున్నాయి. అందం, ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టాల్సిన సమయం ఇది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్యం విషయంలో ఈ చలికాలం చాలా అప్రమత్తంగా ఉండాలి. అయితే టీనేజర్స్‌ని చలి అంతగా బాధించదు కాబట్టి ఎంతసేపు చర్మం పొడిబారం, పెదవులు పగలడం సమస్యలకే సులువైన మార్గాలు వెతుక్కుని కాలం గడుపుతారు.

Pages