S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

05/26/2016 - 22:08

వాస్కోడాగామా భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్న నాటినుంచీ ఆఫ్రికా ఖండంలోని నల్లజాతి వారిని భయపెట్టి కానీ, ప్రలోభపెట్టికానీ బానిసలుగా బంధించి పట్టుకునిపోవడం సామాన్యమైంది. మానవత్వమున్న వారెందరో ఈ విధానాన్ని వ్యతిరేకించి పోరాటం సాగించాక ఇంగ్లండు, అమెరికా వంటి దేశాలలో బానిస వ్యవస్థ రద్దు అయింది. అంతర్జాతీయ ఒప్పందాలవల్ల బానిసల ఎగుమతి, దిగుమతి వ్యాపారం నిషిద్ధమైంది.

05/25/2016 - 21:56

అందానికీ, ఆరోగ్యానికీ గులాబీలు శ్రేష్ఠమైనవని చెప్పవచ్చు. గులాబీ పువ్వు రేకులను నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిదని కొందరి నమ్మకం. గులాబీ పువ్వులలో జిడ్డు ఎక్కువగా ఉంటుంది కనుక దానిలోంచి తైలం తయారుచేస్తారు. ఈ తైలం చర్మానికి రాసుకుంటే చర్మం మృదుత్వాన్నీ, మెరుపును సంతరించుకుంటుంది.

05/25/2016 - 21:48

పక్క తడిపే అలవాటు పిల్లలకు సర్వసాధారణం. ఇది వయస్సుతోపాటు తగ్గిపోతుంది. నవమాసాలు మోసి పురిటినొప్పులతో కన్నబిడ్డ రాత్రివేళల్లో పడక తడుపుతున్నాడంటే తల్లికి బాధగా ఉండకపోయినా ఆ అలవాటు అంతమంచిది కాదు. దీన్ని నివారించేందుకు ఆదిలోనే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది పిల్లల్లో పనె్నండు సంవత్సరాల వయసు వరకూ నిద్రలో పడక తడిపే అలవాటు వుంటుంది.

05/24/2016 - 22:21

వచ్చీరాని మాటలతో పాకే పిల్లలు ఏదైనా పట్టుకొని నడిచేందుకు ప్రయత్నిస్తే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. ఎందుకంటే లేత ఎముకులకు దెబ్బలుతగులుతాయని భయపడతారు. కాని నడవాలని ప్రయత్నించే పిల్లలకు చేతులు అందించి నడిపిస్తే వారి ఎముకలలో పటుత్వం పెరుగుతుందని బ్రిటన్‌లో నిర్వహించిన అధ్యయనాల్లో వెల్లడైంది. పసిబిడ్డలు 18 నెలల వయసురాగానే బుడిబుడి అడుగులు వేయటానికి ఉత్సాహం చూపిస్తారు.

05/24/2016 - 21:50

దేశంలో హృద్రోగ మరణాలు అధికమవుతున్నాయి. ప్రతి 33 సెకండ్లకు ఒకరు గుండెపోటుతో మృతిచెందుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఏడాదికి రెండు మిలియన్ల మంది గుండెపోటుకు గురవుతున్నారు. యుక్తవయసువారే గుండెపోటుకు గురవ్వటం ఆందోళన కలిగిస్తుందని డాక్టర్ అశ్వనీ మోహతా వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలలో నివశించే మగవారికంటే పట్టణ ప్రాంతాలలో నివశించేవారిలోనే అధిక మంది గుండెపోటుకు గురవుతున్నారు.

05/19/2016 - 22:04

శ్రీగిరీశుడు వేంకటేశుడు. ‘శ్రీ’ అంటే పంచేంద్రియాలు. సర్వేశ్వరుని క్షేత్ర దర్శన సంపద కన్ను, వినే సంపద చెవి, భగవదర్పిత సుగంధం ఆఘ్రాణించే సంపద నాసిక, గుణాలను గానం చేసే సంపద నోరు, ఈశ్వర తత్త్వాన్ని సర్వదా చింతించే సంపద మనస్సు. ఈ అయిదు సంపదలు మానవ దేహంలో శిరోభాగంలో కేంద్రీకృతమై వుంటాయి. కావున మానవుని దేహ పైభాగమైన శిరస్సు శ్రీపర్వతం, శ్రీగిరి. అదే మూలపదార్థం. ‘ఊర్థ్వమూల మవాక్చాఖాం..’ అన్నది శ్రుతి.

05/19/2016 - 04:06

కేరళలో వెయ్యిమంది పిల్లలు పుడితే అందులో 12మంది ఏడాది లోపే ప్రాణాలు వదులుతున్నారు. ఇక్కడ శిశుమరణాల సంఖ్య పెరగటానికి కారణం పిల్లల ఎదుగుదల సరిగా లేకపోవటం, వారు సరిపడా ఆహారం తినకపోవటమే కారణం అని సర్వేలో వెల్లడైంది. సోమాలియాలో ప్రతి వెయ్యిమంది పిల్లలకు 85మంది చనిపోతున్నారు.

05/17/2016 - 21:54

డాక్టర్లు అవసరం ఉన్నా లేకపోయినా విచ్చలవిడిగా యాంటీ బయాటిక్స్ మందులు రాసేస్తున్నారని పలు అధ్యయనాలు తేల్చి చెప్తున్నాయి. దేశీయ, విదేశీ యూనివర్సిటీలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు సంయుక్తంగా జరిపిన అధ్యయనంలో కమీషన్ల కోసం డాక్టర్లు పడుతున్న కక్కుర్తి బయటపడింది. రోగికి ఎంతమేర యాంటీ బయాటిక్స్ అవసరమన్నది చూడకుండా ప్రిస్కిప్షన్ రాసేస్తున్నారనేది ఈ సర్వేల సారాంశం.

05/13/2016 - 21:59

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సామాజిక వెబ్‌సైట్లతో గంటల కొద్దీ కాలక్షేపం చేస్తున్న యువతలో చాలామంది కడుపునిండా తినడానికి కూడా నోచుకోవడం లేదని తాజా అధ్యయనం లో వెల్లడైంది. సోషల్ మీడియాతో మమేకమైపోతున్న టీనేజర్లలో అపసవ్యపు ఆహార అలవాట్లు చోటు చేసుకుంటున్నట్లు అమెరికాలోని పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు.

05/12/2016 - 22:18

వేసవి కాలం వచ్చిందంటే చాలు మగువల మనసంతా మల్లెల పరిమళాలే. ఉష్ణతాపం వేళ చికాకులెన్నున్నా మల్లెల గుబాళింపును ఆస్వాదిస్తే చాలు ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఇంట్లో కిటికీ పక్కనో, బాల్కనీలోనో కాస్త ఎండ తగిలే స్థలం ఉంటే మల్లెమొక్కలను పెంచుతూ ఇంటిని సుగంధాలతో నింపేయవచ్చు. పెరట్లో విచ్చుకున్న మల్లెల సుగంధాలు ఇంట్లోనూ పరిమళించాలంటే కుండీల్లో ఈ మొక్కలను పెంచుకోవచ్చు.

Pages