S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

02/10/2016 - 08:41

ఉన్నత చదువులు, ప్రభుత్వోద్యోగాల్లోనే కాదు.. నటన, మోడలింగ్ వంటి కళారంగాల్లోనూ తామేమీ తక్కువ కాదని లింగమార్పిడి చేయించుకున్నవారు నిరూపిస్తున్నారు. ‘హిజ్రాల’ పేరిట సమాజంలో నిరాదరణకు, అపహాస్యానికి గురవుతున్న వీరు ఆత్మవిశ్వాసంతో తమకు నచ్చిన రంగంలో దూసుకుపోతున్నారు. ‘మూడో తరగతి పౌరులు’గా ముద్రపడిన వీరు ఓ వైపు సమాన హక్కుల కోసం ఉద్యమిస్తూనే తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు.

02/06/2016 - 23:09

ఈ నెలలో జరిగే ఆస్కార్ వేడుకల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేసేందుకు ఎంపికైన సెలబ్రిటీగా మన దేశానికే ఖ్యాతి తెచ్చిన బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా మరో ఘనతను తాజాగా తన ఖాతాలో వేసుకుంది. ప్రఖ్యాత సామాజిక మీడియా ‘ఇన్‌స్టాగ్రామ్’లో ఆమె అనుచరుల సంఖ్య అయిదు మిలియన్లకు చేరింది. ఇంతమంది అనుచరులకు తాను దగ్గర కావడం ఎంతో ఆనందానికి గురిచేసిందని ప్రియాంక ఇపుడు ఉబ్బితబ్బిబ్బవుతోంది.

02/05/2016 - 20:21

స్వర మాంత్రికుడు ఎఆర్ రెహమాన్ దృష్టిలో పడాలని.. అతని పర్యవేక్షణలో ఒక్క పాటైనా పాడాలని ఏ గాయనికి ఉండదు..? ఆ అవకాశం ఏ కొద్దిమందికో తప్ప అందర్నీ వరించదు.. అంతటి అదృష్టాన్ని దక్కించుకున్న పదహారేళ్ల అంతర నంది ఇపుడు సంగీత ప్రపంచంలో అద్భుతాలను ఆవిష్కరిస్తోంది.

02/05/2016 - 00:06

అక్కడి మహిళలకు- ఉదయానే్న నిద్రలేచి మంచినీళ్ల కోసం భారీ ‘క్యూ’లో నిరీక్షించాల్సిన పని లేదు.. వీధికుళాయి వద్ద బిందెడు నీళ్ల కోసం సిగపట్లు పట్టాల్సిన అవసరం లేదు.. చేతిలో ప్లాస్టిక్ కార్డు ఉంటే చాలు- ఎలాంటి హైరానా లేకుండా తీరుబడిగా ఎప్పుడైనా మంచినీటిని ఇంటికి తీసుకుపోవచ్చు.

02/13/2016 - 21:34

వంటింట్లో గ్యాస్ సిలిండర్‌తో గానీ, రెగ్యులేటర్‌కు అమర్చిన ట్యూబ్‌తో గానీ ప్రమాదం జరిగి ఆస్తి,ప్రాణనష్టం వాటిల్లితే వినియోగదారులకు బీమా వర్తించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే, గ్యాస్ కంపెనీలు చెల్లించే ఈ బీమా మొత్తంపై చాలామంది వినియోగదారులకు ఎలాంటి అవగాహన లేదు. వంటింట్లో గ్యాస్ ప్రమాదాలకు బీమా పథకం ఉందన్న విషయం ఎంతోమందికి తెలియదు.

02/05/2016 - 00:01

మనల్ని మనం అతిగా పొగుడుకోవడం, ఇతరులపై అకారణంగా నిందలు వేయడం.. రెండూ అత్యంత హేయమైన చర్యలని ధర్మశాస్త్రాల ప్రబోధం. విద్యావంతులైన వారిలో కూడా ఈ రెండు లక్షణాలూ కనిపిస్తాయి. తమను తాము గొప్పగా పదిమందిలో చెప్పుకోవడం, ఇతరులలో వుండే చిన్న చిన్న లోపాలను ఎత్తిచూపుతూ విమర్శించడం, ‘అన్నింటా తామే గొప్ప’ అని భావించడం కొంతమంది స్వభావం.

02/13/2016 - 21:35

తలనొప్పిగా ఉందంటే చాలు.. చాలామంది మెడికల్ షాప్‌కు వెళ్లి ఏదో ఒక మాత్ర కొనుక్కుని మింగేస్తారు. మామూలు తలనొప్పికి తరచూ మాత్రలు వేసుకుంటే అప్పటికప్పుడు కాస్త ఉపశమనం లభించినా, భవిష్యత్‌లో ఆరోగ్యపరంగా విపరిణామాలు సంభవించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలిసీ తెలియని వైద్యంతో ఏదోఒక మాత్ర వేసుకునే బదులు ఇంట్లోనే కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే తలనొప్పి నుంచి బయటపడే అవకాశం ఉంది.

02/04/2016 - 03:46

‘ధనం మూలం మిదం జగత్’, ‘పైసామే పరమాత్మ’, ‘డబ్బుకు లోకం దాసోహం’, ‘్ధనమేరా అన్నిటికీ మూలం’... ఇలా ఎంతగా అనుకున్నా జీవితంలో డబ్బుకు ఉన్న ప్రాధాన్యత గురించి చెప్పాలంటే మాటలు చాలవు. ఆశించిన లక్ష్యాలను చేరుకోవాలంటే ఎవరికైనా ధనం అవసరమే. డబ్బు సంపాదనకు అనేక మార్గాలున్నాయి. కష్టపడి నిజాయితీతో ధనం సంపాదించేది కొందరైతే, అనేకానేక అడ్డదారులు తొక్కి అక్రమంగా సంపాదించేది ఇంకొందరు.

02/03/2016 - 02:55

‘మొన్న ఏకాదశి నాడు కటిక ఉపవాసం చేశాను.. ఒకేఒక్క పండు తిన్నా..’ అన్నాడట ఒక మహాభక్తుడు. పండు కూడా కటిక ఉపవాసం నాడు తినకూడదుకదా! అని మనసులో అనుకుని ‘ఏం పండు’ అని స్నేహితుడు అడిగాడట. అరటి పండో, బత్తాయి పండో అని చెప్తాడనుకున్నవాడికి కళ్లు తిరిగేలా ఆ భక్తాగ్రేసరుడు పనసపండు అని జవాబిచ్చాడట.

01/28/2016 - 21:38

తాము తీసుకునే ఆహారం పట్ల తగిన అవగాహన కలిగి ఉంటే మధుమేహ రోగులు ఉపశమనం పొందే అవకాశం ఉందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్-ఎ, పీచు, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషక విలువలున్న శాకాహారాన్ని తినడం ద్వారా మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు జరుగుతుంది. పిండి పదార్థాలున్న ఆహారానికి వీరు దూరంగా ఉండడం ఎంతో అవసరం. పండ్లు, బీన్స్, తృణధాన్యాలు, కొవ్వు లేని పాల ఉత్పత్తులను తీసుకోవడం ఉత్తమం.

Pages