S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

04/28/2016 - 21:55

ఈమధ్య టీవీ మాధ్యమాలలో, పత్రికలలో శని శింగనాపూర్ గ్రామం పేరు ప్రస్ఫుటంగా కనబడుతోంది, వినబడుతోంది. ఆ ఊరిలోని శనీశ్వరాలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు. అయినా రేణుదేశాయ్ అనే మహిళ, భూమి సేన వ్యవస్థాపకురాలు నేతృత్వంలో ఆలయంల్ఘో ప్రవేశించడానికి ప్రయత్నించడం, అక్కడి గ్రామస్థులు ఆ ప్రయత్నాన్ని వమ్ము చేయడం జరిగింది. దీనిపై భూమిసేన కోర్టుకు వెళ్లగా హైకోర్టు ఆలయ ప్రవేశం ఆడవారికి నిషేధించరాదని తీర్పు ఇచ్చింది.

04/27/2016 - 23:50

స్ర్తిలకు సౌందర్యంతో విడదీయలేని సంబంధం ఉంది. నేటి ఆధునిక కాలంలో సైతం మహిళలు సౌందర్యం పట్ల ఆసక్తి చూపుతున్నారు. మహిళల సౌందర్యాన్ని ఇనుమడింపజేసేవాటిలో గాజుల పాత్ర అత్యంత కీలకమైనది. గాజులు ధరించడం అనేది భారతీయ సంప్రదాయంలో ఒక భాగం. ప్రస్తుతం పాశ్చాత్య దేశాలలో సైతం మహిళలు గాజులు ధరించడానికి ఆసక్తి చూపుతున్నారు.

04/26/2016 - 21:57

దేశ వ్యాప్తంగా ఎన్‌డిఎల్‌ఎం ప్రోగ్రామ్ ద్వారా 3,17,804
మంది శిక్షణ పొందారు.
ఇది 1191 సెంటర్లను ఏర్పాటు చేయగా.. నాస్కామ్ ఫౌండేషన్ సాయంతో డిజిటల్ పాఠాలు నేర్చుకున్న గృహిణులు నేడు అభివృద్ధిపథంలో పయనిస్తున్నారు. 2022నాటికి దేశం వ్యాప్తంగా
250 మిలియన్ మహిళలకు ఈ డిజిటల్ పాఠాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోంది.

04/23/2016 - 23:06

గురక పక్కవారికి శాపం అయితే, గురకతో నిద్రలో శ్వాస అందక ఉలికిపడి లేచేవారికి అది నరకం. అమెరికాలో ఓ భార్య తన భర్తతో విడాకులు కోరుతూ కోర్టుకి విజ్ఞప్తి చేసింది. ఎందుకు విడాకులని న్యాయమూర్తి అడిగితే దానికి కారణం తన భర్త పెట్టే గురక అని చెప్పింది. గత పదేళ్లుగా తనకి రాత్రిళ్లు నిద్రలేదని వాపోయింది.

04/21/2016 - 22:10

సంకల్పం గట్టిగా వుంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయొచ్చు అని నిరూపించింది పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుభాషిణి మిస్ర్తి. నోట్లోకి ఐదువేళ్లు పోవటమే గగనమైన ఓ నిరుపేద మహిళ పేదల కోసం ఆసుప్రతి కట్టించి వారికి ఐదువేల రూపాయలకే ఆపరేషన్లు చేయస్తోంది. మానవతకు నిలువెత్తు నిదర్శనం. ఎందరికో స్ఫుర్తిదాయకం. మరెందరికో మార్గదర్శకం.

04/20/2016 - 22:40

అతివేగంగా ఉరుకులు పరుగుల బిజీ జీవితంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న మనం రోజంతా హుషారుగా అన్ని పనులు సమర్థవంతంగా పూర్తిచేసుకోవాలనుకోవడం సమంజసమే..! కాని అలా హుషారుగా ముందుకు సాగాలంటే మనం శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉండాలి. మత్తుగా నీరసంగా వుంటే ఏ పనీ ఆసక్తిగా సంపూర్తిగా చేయడం కుదరదు. రోజంతా హుషారుగా కొనసాగాలంటే దానికి తగిన మానసిక శారీరక శక్తి అవసరం.

04/19/2016 - 22:19

జంతువులను వధిస్తూ పోతుంటే కొన్నాళ్లకు అవి పూర్తిగా అంతరించిపోతాయి. జంతువధ అమానుషం అయినా దీనిని గురించి పట్టించుకున్నవారంతగా లేరు. ఇది శోచనీయం, ఆందోళనకరం అంటూ వాపోతుంది సోనాలి పురెవలి... మాటలనడంతో సరిపెట్టుకోలేదు. ఆ మాటలను చేతలలో చూపించడం కోసం నడుం బిగించింది, పోరాడింది. చివరికి విజయం సాధించింది.

04/14/2016 - 22:45

శ్రీరాముడు భారతీయులకు ఆదర్శప్రాయమైన ఆరాధ్య దైవం. త్రేతాయుగంలో పవిత్ర సరయూనది ఒడ్డున గల అయోధ్యా నగరాన్ని ఇక్ష్వాకు వంశీయులు దాదాపు నలుబది మంది రఘు వంశ రాజులు పాలించారు. వారిలో మొదటిరాజు చతుర్ముఖ బ్రహ్మ, చివరివారు కుశలవులు. ఇందులో రఘు వంశానికి వన్న తెచ్చిన వారు మరీచి, కశ్యపుడు, త్రిశంకు, మాంధాత, సగరుడు, దిలీపుడు, భగీరథుడు, అంబరీషుడు, నహుషుడు, యయాతి, అజుడు, రామలక్ష్మణులు.

04/13/2016 - 22:01

ప్రతిరోజూ 45 నిమిషాలు నడక నడిస్తే శరీరంలోని కొవ్వును దీర్ఘకాలం తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తపీడనాన్ని, శ్వాసక్రియ సామర్థ్యాన్ని పెంచుతుంది. నడక వ్యాయామంపట్ల శ్వాసక్రియ పెరిగి గుండె వేగంగా రక్తాన్ని తోడి శరీర భాగాలకు పంపుతుంది. ఆ విధంగా ఆక్సిజన్ వినియోగమవుతుంది. వృద్ధాప్యంలో అనేక జబ్బులు వ్యాయామ లోపంవల్ల, అనారోగ్యకరమైన భోజనపు అలవాట్లు, మద్యపానం, ధూమపానంవల్లనే వస్తాయి.

04/13/2016 - 04:46

సమాజంలో నైతిక విలువలతోపాటు, మానవ సంబంధాలు కూడా నానాటికి తగ్గిపోతున్నాయని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నవారే. అయితే అందుకు గల కారణాలను విశే్లషించి, తదనుగుణంగా వ్యవహరించడానికి మాత్రం ఎవరూ సిద్ధంగా లేకపోవడం గమనార్హం. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వలన స్మార్ట్ఫోన్‌లు, ఇంటర్నెట్ సౌకర్యం దాదాపుగా అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్నెట్ దాదాపుగా అందరికీ అందుబాటులోకి రావడం ఒక సంచలనమే.

Pages