S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

05/02/2017 - 22:42

ఇది ఖాదీ సీజన్. ఒకప్పుడు రాజకీయ నాయకులు, వయసు మళ్లినవారు మాత్రమే ధరించేవారు. కాని నేడు ట్రెండ్ మారింది. వివిధ రంగు ల్లో లభ్యమవుతున్న చేనేత దుస్తులకు డిమాండ్ పెరిగింది. అవి యువతను ఆకట్టుకోవటంతో తక్కువ ధరలో మన్నిక ఎక్కువ కలిగిన చీరలు, మగవారికి స్కర్ట్స్, కుర్తాలు దొరుకుతున్నా యి. అంతరించిపోతున్న ఖాదీ కళకు నేడు సెలబ్రిటీలు ప్రాణం పోస్తున్నారు.

04/29/2017 - 22:12

భూమిమీద భూతల స్వర్గం అనేది ఏదేనా ఉందంటే అది ఫిన్లాండ్ దేశమే. ఫిన్లాండ్ ప్రపంచంలోని చిన్న దేశాలలో ఒకటి అయినప్పటికీ, వరల్డ్ హ్యాపీ ఇండెక్స్‌లో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నదంటే, అందుకు ప్రధాన కారణం అక్కడ అమలులో ఉన్న విద్యా విధానమే. మన దేశంలో మాదిరిగా చదువుకు సంబంధించి పిల్లలపై ఎటువంటి వత్తిడి ఫిన్లాండ్‌లో ఉండదు.

04/28/2017 - 21:54

అమ్మ నటించిన సినిమాలను ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే ఆమె ఏడ్చే దృశ్యాలను చూసి తట్టుకోలేను. కాని ఆమె చనిపోయిన తరువాతే కళా రంగంలో ఆమెకున్న ప్రజ్ఞాపాటవాలు తెలుసుకోగలిగాను అంటున్నారు. మహానటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి. సినీ వినీలాకాశంలో ధ్రువవతారగా వెలుగొందిన మహానటి సావిత్రిపై బయోపిక్ వస్తున్న విషయం విదితమే.

04/27/2017 - 21:33

ఐస్ బక్కెట్ సవాల్ పాతదై పోయింది. ఇపుడు సరికొత్త సవాల్ హైదరాబాద్ నగర వాసుల ముందుకు వచ్చింది. అదేమిటంటే ఇంట్లో పనికిరాని బక్కెట్ ఏర్పాటు చేసి అందులో పనికిరాని వ్యర్థాలను నిల్వచేసి కంపోస్ట్ ఎరువుగా తయారుచేయటం. ఇలా కంపోస్ట్ ఎరువును తయారు చేస్తానని ముందుకు వచ్చేవారికి వెన్నుతట్టి ప్రోత్సహించే సంస్థ కూడా ఉంది. అదే ‘స్వచ్ఛగృహ బృందం’.

04/27/2017 - 02:32

సమయస్ఫూర్తిని ప్రదర్శించడానికి వయస్సు అడ్డంకికాదు అని నిరూపించింది ఆరేళ్ల చిన్నారి టికీ. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే ఈ చిన్నారి సాహసం, సమయస్ఫూర్తి ముందు ఆ మొసలి పారిపోక తప్ప లేదు. ఒడిశాలోని ఒక మూరుమూల గ్రామంలో టికీ చేసిన సాహసకృత్యం ఇది. ఒడిశా రాష్ట్రంలోని కేంద్రపారా జిల్లాలో బంకులా అనేది ఒక కుగ్రామం. ఈ గ్రామ శివారులో ఒక నీటికుంట ఉంది. గ్రామంలోని పిల్లలు ఈ నీటి కుంటలో దిగి ఆటలాడుకుంటారు.

04/25/2017 - 23:42

‘గుండెలమీద కుంపటి’లా భారంగా అనిపించే ఆడపిల్లను త్వరగా పెళ్ళిచేసి వదిలించుకునే ప్రయత్నాలు చేయటమేగాక... ముందుజాగ్రత్తగా అత్తారింటికి పంపే సందర్భంలో తల్లి ఎన్ని నీతులు చెబుతుందో లెక్కే లేదు. ‘ఒకసారి మెళ్లో పుస్తె పడిందంటే... ఇక మంచైనా, చెడైనా నీకు అత్తారిల్లే గతి-!

04/23/2017 - 21:02

జ్ఞా న సముపార్జనకు శ్రవణం ఒక రాజమార్గం. వింటున్న విషయాన్ని మనోచక్షువులతో కాంచినపుడు ఏ విషయమైనా మనసులో చెరగని ముద్రవుతుంది. ప్రసంగించడం ఒక కళ అయితే, వినడం అదీ ఏకాగ్రత వీడకుండా వినగలగడం అంతకుమించిన కళ. అటూఇటు దృష్టి మరలుస్తూ ప్రక్కనున్నవారితో సంభాషిస్తూ వింటున్న విషయంపై, ప్రసంగిస్తున్నవారిపై చెణుకులు వేస్తూ, నవ్వుతూ అరకొరగా వినడం అవగాహనను కుంటుపరుస్తుంది.

04/22/2017 - 00:52

‘అమ్మోరు’ సినిమాలో బాల అమ్మోరుగా నటించిన సునయన గుర్తుండే ఉంటుంది. ఈ అమ్మాయి నేడు సోషల్ మీడియాలో వెబ్ సిరీస్‌తో హల్‌చల్ చేస్తోంది. సహనానికి మారుపేరు స్ర్తి అని అంటారు. అలాంటి మహిళలో నిరాశ నిస్పృహాలు జనియించి విసుగుదల వస్తే ఎలా ఉంటుందో హాస్యంగా చూపించే ‘ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్’ వెబ్ సిరీస్ సోషల్ మీడియాలో విజయాల పరంపర కొనసాగిస్తోంది. అయితే నిజజీవితంలో మాత్రం తనకు విసుగనేది ఉండదని చెబుతోంది.

04/21/2017 - 04:03

‘మహిళాభ్యుదయమే దేశాభ్యుదయం’ అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాదని, దానిని ఆచరణలో పెడితే అది వాస్తమేనని నిరూపించారు ఎడారి రాష్ట్రం అయిన రాజస్థాన్‌లోని ఒక కుగ్రామానికి చెందిన మహిళలు. గతంలో ఆ గ్రామానికి చెందిన బాలికలు ఎవరూ బడి గడప తొక్కేవారు కాదు. ఒకవేళ ఎవరైనా వెళ్లినా అది మూడునాళ్ల ముచ్చటే. అటువంటి గ్రామానికి చెందిన బాలికలు ప్రస్తుతం పొరుగూరులో వున్న హాస్టల్స్‌లో ఉండి చదువుకుంటున్నారు.

04/19/2017 - 20:59

గోడలకి చెవులు వుంటాయి. మన పడగ్గది గోడలు పక్కింటి ఆవిడ చెవులు లాం టి మాటలకు నూకలు చెల్లాయి. కాలం మారింది. వర్తమానంలో మన బాత్‌రూములకు మరుగుదొడ్లకు, దుస్తులు మార్చకొన గదులకు కెమేరాలు మన కంట పడకుండా దాక్కొని ఉంటున్నాయి. మన దేశంలో ఇవి కొంచెం తక్కువ గాని, అమెరికా లాంటి దేశాలలో ఎప్పుడో రంగ ప్రవే శం చేశాయి.

Pages