S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

04/18/2017 - 23:27

చెరువును పునరుద్ధరించే పనులు జరుగుతుండగానే ఇక్కడ ప్రజలు సహకరించకపోగా దొంగచాటుగా వ్యర్థాలు తీసుకువచ్చి పోసేవారు. అంతేకాదు ఈ ప్రాంతంలోకి వాహనాల్లో వచ్చి మొక్కలను పాడుచేసేవారు.
- మధులిక

04/14/2017 - 22:39

ఓ సాయంత్రం వేళ మీరు హాయిగా రిలాక్స్ అవ్వాలనుకున్నారు. కాని మీరు పెంచుకునే పెంపుడు కుక్కపిల్లకు దెబ్బతగిలి అది మీతో ఆడుకునే పరిస్థితిలో లేదు, మీ మనసు మనసులో లేదు. బాధగా ఉంటుంది. కాని మీరు హైదరాబాద్‌లో ఉన్నాం అని మరిచిపోవద్దు. ఎందుకంటే హైదరాబాద్ నగరం పెంపుడు జంతువులకు పెన్నిధిగా మారిందని గ్రహించండి.

04/13/2017 - 22:09

సమాజాన్ని చైతన్యపర్చడమే ఆమెధ్యేయం. అందుకోసం అందుబాటులో వున్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటారు. గృహిణిగా, ఉపాధ్యాయినిగా శరీర అవయవ దాన సంస్థ నిర్వాహకురాలిగా, రచయితగా సమాజాన్ని జాగృతం చేసేందుకు అలుపెరుగని కృషి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన కాట్రగడ్డ భారతి ఎం.ఎ తెలు గు, ఎం.ఎ ఇంగ్లీషు చదివి బి.ఇడి పూర్తిచేసి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తున్నారు.

04/11/2017 - 22:28

ఆమె ఉన్నత విద్యావంతురాలు కాదు. రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. సాధారణ గృహిణి. ఆ మగువ ప్రదర్శించిన తెగువ వల్లే నేడు రాజస్థాన్‌లోని పలు గ్రామాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగుతున్నది. మహిళలు చైతన్యవంతులు అయితే, పలు రుగ్మతలను విజయవంతంగా నిర్మూలించవచ్చునని రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలోగల చోటిహుద్దా అనే వృద్ధురాలు నిరూపించారు.

04/08/2017 - 00:17

ఎగిరే విమానాన్ని చూస్తే చిన్నపిల్లలు కేరింతలు కొట్టినట్లే నివేదిత భాసిన్ కూడా అమితంగా అభిమానిస్తారు. ఈ అభిమానమే ఆమెను 26 ఏళ్లకే పైలట్‌గా మార్చింది. కెప్టెన్ నివేదిత భాసిన్ పేరు విమానయాన రంగంలో తెలియనివారు ఉండరు. దాదాపు మూడు దశాబ్దాల నుంచి ఎయిర్ ఇండియాలో వివిధ హోదాలలో పనిచేస్తున్న సీనియర్ అధికారిణి. ఎందరో యువ పైలట్లకు ఆమె ఆదర్శం.

04/06/2017 - 21:38

బస్తర్‌లో ఏ గిరిజన బాలికను అడిగినా సీఆర్‌పీఎఫ్ అధికారి ఉషాకిరణ్ నిజాయితీ, నిబద్దత, తెగువ గురించి చెప్పకుండా ఉండలేరు. ఎందుకంటే ఆమె అంటే ఆ గిరిజన బాలికలకు అంత ఇష్టం. నిత్యం మావోయిస్టు కార్యకలాపాలతో అట్టుడిగే బస్తర్‌లో పనిచేయాలంటే ఏ అధికారి కూడా ముం దుకు రారు. అలాంటి ఏరియాకు ఏరికోరి పోస్టింగ్ వేయించుకున్న ఉషాకిరణ్ అక్కడి గిరిజనులతో మమేకమైంది. అంతేకాదు అక్కడ చదువుకునే ఆడపిల్లలకు ఆమె ఓ స్ఫూర్తి.

04/01/2017 - 21:31

మనదేశంలో ఇటీవలనే మహిళల ప్రసూతి సెలవు ఆరునెలలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం బిల్లు తీసుకువచ్చింది. ఎన్నో ఏళ్ల తరువాత అమ్మకు సెలవు దక్కింది. అలాగే నెల నెలా పలుకరించే ఋతు సెలవు కూడా ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం సర్వత్రా వినపడుతుంది. ఎందుకంటే ఇటలీలో ఉద్యోగం చేసే మహిళలకు ఋతు సెలవు మంజూరు చేస్తే బిల్లు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఆ మూడు రోజులూ విపరీతమైన
మానసిక ఒత్తిడి

03/31/2017 - 22:36

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో, స్వార్థపూరిత సమాజంలో పరుల మంచి కోసమే బతికేవాళ్లు చాలా అరుదుగా వుంటారు. అలాంటివారిలో ఒకరు కిరణ్ అనే యువకుడు. మంచి మనసున్న యువకుడు. పెట్రోల్ పంపులో పనిచేస్తాడు. సొంతూరు కర్నాటకలోని మాంధ్య డిస్ట్రిక్ట్, అనెగోల అనే చిన్న గ్రామం. తండ్రి వ్యవసాయం చేస్తాడు. ఎపిఎస్ ఈవినింగ్ కాలేజీలో బికాం చదివిన కిరణ్.. పెట్రోల్ పంపులో పనిచేస్తున్నాడు.

03/30/2017 - 22:50

బిఎస్‌ఎఫ్ సరిహద్దు భద్రతాదళం. అక్కడ విధులు నిర్వర్తించటం అనుకున్నంత తేలిక కాదు. ఉగ్రమూకల చొరబాట్లను అడ్డుకోవడానికి అత్యంత ధైర్య సాహసాలు కావాలి. నిత్యం డేగకళ్ళతో పహారా కాయాలి. ప్రాణాలకు తెగించి పోరాడాలి. ఇలాంటి ఉద్యోగాలు మగవాళ్లు మాత్రమే చేయగలరు. వారికే శక్తి సామర్థ్యాలు ఉంటాయనేది సమాజంలో నాటుకుపోయిన భావన. అందుకేనేమో గత ఐదు దశాబ్దాలుగా బిఎస్‌ఎఫ్‌లో లేడీ జవాన్ అన్నమాటే లేదు.

03/30/2017 - 08:03

గాలి..ఏలా ఉంటుందో తెలియదు. మనిషికి ప్రాణాధారమైంది. కాని అదే నేడు సైలెంట్ కిల్లర్‌గా మారింది. ప్రకృతి ప్రసాదించిన ఆ శక్తిని చేజేతులారా మనమే కలుషితం చేసుకుంటున్నాం. అందువల్లే ప్రాణాధారమైన ఆ గాలే నేడు మన ప్రాణాలను హరించేదిగా మారింది. కలుషిత గాలి సమస్య ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

Pages