S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

10/13/2016 - 21:51

మంచానికి ఎదురుగ్గా వున్న గడియారాన్ని తీసెయ్యండి.
పగటి కలలను పూర్తిగా మానెయ్యండి.
మంచంపై వాలి టీవీ చూడటం, పుస్తకాలు చదవటం చెయ్యకండి.
మెలకువ వచ్చిన తర్వాత మంచంపై దొర్లటం మానెయ్యండి.
నిద్ర రాకముందే మంచాన్ని చేరవద్దు.
రోజూ ఉదయ సాయంకాలాలు రెండు గంటలు వాకింగ్ చేయండి.
మరో గంటో, అరగంటో రెండు పూటలా వ్యాయామం చేయండి.

10/12/2016 - 21:48

మంచి నడవడిక వ్యక్తిత్వానికి వనె్న తెస్తుంది. మనుషుల మనుగడకు సామాజిక మానవ సంబంధాలు ఎంతైనా అవసరం. మాటల్లో కమ్మదనం, ఎదుటివారిని గౌరవిస్తూ మాట్లాడితే ప్రథమ పరిచయంలోనే గౌరవభావం పెరుగుతుంది. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఎదుటి వ్యక్తులు పిచ్చివారి క్రింద జమ కట్టి వాగుడుకాయల క్రింద జమ కట్టి మిమ్మల్ని మీ మాటల్ని లక్ష్యపెట్టకుండా పొడిపొడిగా మాట్లాడి తప్పుకుంటారు.
ఎదుటివారిని పలకరించే తీరు

10/07/2016 - 21:07

గుడిసె ముందు కూర్చున్న పండు ముసలి అవ్వకు.. దూరాభారాన వున్న కొడుకు యోగక్షేమాలు మోసుకొచ్చినా, బంధువులు, స్నేహితుల మధ్య దూరాల దారాన్ని తెంచేసి వారి అనుబంధాన్ని మరింత పటిష్టం చేసినా.. శుభాశుభాల వర్తమానంగా మారినా.. నవ్వుల పువ్వులు, ఆనందాలు, అభినందనలు, నిట్టూర్పులు, ఏడుపులు.. ఇలాంటి అనేక అనుభూతుల్ని అక్షరాలుగా తనలో పొదుపుకుని మోసుకొచ్చినా... అది ఒక్క ఉత్తరానికే చెల్లు.

10/07/2016 - 00:05

పగలంతా కష్టపడినా చెరగని అందానికి చిరునామాగా నిలిచే ఆడవాళ్లు నిజంగా అభినందనీయులని, అది అందరికీ సాధ్యం కాదు ఆడదానికే సాధ్యం అని అంటుంది సినీ నటి భూమిక. ఎం.ఎస్ ధోని బయోపిక్ చిత్రంలో ధోని సోదరిగా నటించిన భూమిక దాదాపు తొమ్మిదేళ్ల విరామం తరువాత బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో తన మనసులోని అభిప్రాయాలను వెల్లడిస్తూ..

10/07/2016 - 00:03

దసరా అనగానే పిల్లలకి పెద్దలకి సందడి. ఇంటింటా పూజలు, బొమ్మల కొలువు, పేరంటంతో ఆహ్లాదం వెల్లివిరుస్తోంది. సంస్కృతి సంప్రదాయాలు నేటి తరం బాల బాలికలకు తెలుస్తాయి. కొన్ని స్కూళ్ళల్లో దేవతా వేషాలు, విచిత్ర వేషధారణ పోటీలు, పాటల పోటీలు నిర్వహిస్తారు. దుష్టసంహారం చేసి దుర్గాదేవి విజయం పొందినందుకు ప్రజలంతా ఆమెను స్తుతిస్తూ పూజలు చేయడం ద్వారా శాంతి సౌఖ్యాలు, విజయాలు పొందుతారని నమ్మకం.

10/04/2016 - 23:50

అది చెన్నైలోని భారత సైనిక అధికారులకు శిక్ష ణ

ఇచ్చే అకాడమీ. కొత్త బ్యాచ్‌కి శిక్షణ మొదలైంది.

శిక్షణ తీసుకుంటున్న సైనికులలో ఇరువురు

మహిళా సైనిక అధికారులు ప్రత్యేకంగా

కనిపిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం పది నెలల

శిక్షణ కోసం వచ్చారు. ఇద్దరూ తల్లులే. పిల్లల్ని

వదలి కఠినమైన సైనిక శిక్షణకు సిద్ధమైన ఆ ధీర

10/01/2016 - 21:58

దసరా సంబరం మొదలైంది. శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి విశేష పూజలందుకునే శరన్నవరాత్రులలో అమ్మవారిని పూజించుకుంటే సకల శుభమంగళాలు జరుగుతాయని భక్తుల విశ్వాసం. అమ్మవారికి నవరాత్రులలో నవరూపాలకు నివేదించాల్సిన నైవేద్యాలు, అమ్మవారి అలంకారాలు ప్రత్యేకతను సంతరించుకుంటాయి. సంప్రదాయానుసారంగా ఈ అలంకారాలు ఉంటాయి. ఎవరికి తోచిన విధంగా వారు భక్తిశ్రద్ధలతో, నియమనిష్టలతో ఏ తీరున పూజించినా అమ్మ తప్పక పలుకుతుంది.

09/29/2016 - 21:57

హైదరాబాద్ భాగ్యనగరంలో నవరాత్రి ఉత్సవాల శోభ వెల్లివిరుస్తుంది. ఈ ఉత్సవాల్లో ప్రధానమైన దాండియా నృత్యానికి యువతీ యువకులు పాదం కదిపేందుకు సిద్ధమవుతున్నారు. నగరంలో ఏ ఫంక్షన్ హాల్లో చూసినా దాండియా నృత్యాన్ని రిహార్సల్ చేస్తున్న సీతాకోకచిలుకల్లాంటి యువతీ యువకులే సందడి చేస్తున్నారు.

09/29/2016 - 00:18

ఇళ్లలో ప్రేమగా జంతువులను ఎలా పెంచుకుంటామో.. కొందరు అక్వేరియంలో చేపల్ని కూడా అలానే పెంచుతారు.. మరికొందరేమో ఇంటి అందానికి అక్వేరియం పెట్టుకుంటారు. ఏదేమైనా అక్వేరియం ఇంట్లో ఉంటే మనకు ఉపయోగాలు కూడా ఉన్నాయట..

09/27/2016 - 21:00

సమాజంలో వివిధ సంఘటనలు లేదా దుర్ఘటనలలో కూడా మహిళలే సమిధలుగా మారుతున్నారు. దేశంలో లేదా ప్రపంచంలో ఎటువంటి దాడులు లేదా ఘోర ప్రమాదాలు లేదా వరదలు, తుఫాన్, భూకంపాల వంటి పెను విపత్తులు సంభవించినపుడు, వాటికి సమిధలుగా మారుతున్నది మహిళలే. దీనికి కారణం, కుటుంబ పెద్ద ఎదైనా విపత్తులో మరణిస్తే సదరు కుటుంబం నిర్వహణ బాధ్యతలు మహిళలపై పడటమే.

Pages