S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

10/23/2018 - 18:45

శ్రీమతి రాహత్ రషీద్ ప్రఖ్యాత మెరిడియన్ స్కూలు, బంజారాహిల్స్ వైస్ ప్రిన్సిపాలు. వీరు గురువు, మనస్తత్త్వ పరిజ్ఞాని, పరిశోధకురాలు, సంఘసేవిక. ఒక వైపు వ్యక్తిగత బాధ్యతలు నిర్వహిస్తూ, మరొకవైపు గురువుగా, నిర్వాహకురాలిగా, సంఘసేవికగా, ఎన్నో బాధ్యతలు సునాయాసంగా నిర్వహిస్తున్నారు. శ్రీమతి రాహత్ దేశవిదేశాలు తిరిగి, మన భారతదేశపు సంస్కృతిసంప్రదాయాల కీర్తి పతాక ను నెగురవేశారు.

10/21/2018 - 23:51

ఇప్పటి పిల్లలకు అడవి అంటే ఏమిటో తెలియని పరిస్థితి. ఒకప్పుడు అమ్మమ్మలు, తాతయ్యలు.. ‘అనగనగా ఓ అడవి..‘ అనో, ‘ అది కాకులు దూరని కారడవి.. చీమలు దూరని చిట్టడవి2 అనో పిల్లలకు కథలు చెప్పేవారు. కానీ నేడు కాంక్రీటు అరణ్యాలు పెరగడంతో అడవులు దాదాపుగా కనుమరుగవుతున్నాయనే చెప్పాలి. ప్రకృతి ప్రసాదించిన పచ్చదనాన్ని ప్రేమించేవారు తప్ప.. మిగిలినవారు అడవుల గోడు పట్టించుకునేవారే లేరు.

10/20/2018 - 00:13

పిల్లల ఆహార విషయంలో తల్లిదండ్రులు మొదటి నుంచీ జాగ్రత్తగా వ్యవహరించాలి. పోషక విలువలతో, ఖనిజాలతో కూడిన ఆహారం వాళ్ళకి పెట్టాలి. అలా చేయడం వల్ల పిల్లలు చదువులో రాణించడమే కాదు, ఆరోగ్యంగా కూడా ఉంటారు.

10/17/2018 - 23:52

మనస్సుకు అధిపతి ‘చంద్రుడు’. చంద్రుడు వెనె్నలను బాగా పండించే ఋతువు శరదృతువు. శరదృతువులో మొదటి మాసం, ఆశ్వయజుమాసం. చంద్రుడంటే ‘తల్లి’. జన్మనిచ్చిన మాత, జగన్మాత. చంద్రుడు అనుగ్రహం ఉంటే, మనస్సు నిశ్చలంగా ఉంటుంది. నిశ్చలమైన మనస్సుతో ఏ కార్యాన్నైనా చేయగలుగుతాం. చంద్రానుగ్రహం, తల్లి ఆరాధనతో లభిస్తుంది.

10/17/2018 - 00:19

అమ్మా! తల్లీ! మా అమ్మోరూ..
మీనాక్షివైన నీ కళ్ళకు కన్పిస్తున్నాయా
నేడు నిత్యం జరిగే నేరాలు, ఘోరాలు, దారుణాలు, దౌర్జన్యాలు,
దురాగతాలు, దుష్టుల దురంతాలు, దగాలు, దురాలోచనలు,
దుశ్చర్యలు, దుష్కృతాలు,
మెసాలు, నమ్మకద్రోహాలు, పంచమహాపాతకాలు,
కొందరు స్వార్థపరుల పన్నాగాలు, దుర్బుద్ధులూ,
అఘాయిత్యాలు, అత్యాచారాలూ..
చూస్తున్నావా? చూసి మిన్నకుంటున్నావా?

10/14/2018 - 23:50

అస్యశ్రీ అర్గళా స్తోత్ర మంత్రస్య విష్ణుః
ఋషిః అనుష్టుప్ఛందః శ్రీ మహాలక్షీర్దేవతా మంత్రోదితా దేవ్యోబీజం
నవార్ణో మంత్ర శక్తిః శ్రీ సప్తశతీ మంత్రస్తత్వం శ్రీ జగదందా ప్రీత్యర్థే సప్తశతీ పఠాం గత్వేన జపే వినియోగః॥
ధ్యానం
ఓం బంధూక కుసుమాభాసాం పంచముండాధివాసినీం
స్ఫురచ్చంద్రకలారత్న ముకుటాం ముండమాలినీం॥
త్రినేత్రాం రక్త వసనాం పీనోన్నత ఘటస్తనీం

10/12/2018 - 19:12

పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న కవిగారిని నేను నిత్యం స్మరిస్తూ ఉంటాను. నిజమే! మనం సముద్రాలు దాటి వచ్చి దూర తీరాల్లో నివసించినా మాతృభూమిని, మాతృదేశాన్ని వదలలేకపోతాం. ఎన్ని దేశాలు తిరిగినా ఎక్కడెక్కడో నివసించినా మన సనాతన సంస్కృతీ సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, మన ధర్మాలను మనం ఆచరిస్తూనే ఉంటాం.నేను ఆచరించడమే కాక మా ఇంట్లో సభ్యులందరి చేత ఆచరింపచేస్తాను.

10/11/2018 - 19:44

నవరాత్రులు.. బతుకమ్మ ఆటలు.. బొమ్మల కొలువులు.. పేరంటాలు. . దాండియా..

10/10/2018 - 19:05

ఇపుడు ఏ పత్రిక తిరగేసినా.. ఏ సోషల్ మీడియాలో చూసినా ఒకటే చర్చ.. ‘మీ టూ’.. ఈ పోరాటం అన్ని వర్గాల మహిళల్లో స్పందన కలిగిస్తోంది. గొంతును పెగిల్చేలా చేస్తోంది. హృదయంలో ఏ మూలో గత కాలపు చేదు జ్ఞాపకాల దొంతర కళ్లముందు కదిలి మనసు కన్నీరు కారుస్తుంది.. ‘ఆ రోజు నేనెందుకు ధైర్యం చేసి మాట్లాడలేకపోయాను.. అపుడెందుకు ఎదిరించలేకపోయాను..’ అని ప్రతి మహిళా ఆ చేదు జ్ఞాపకాలను తలచుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది..

10/09/2018 - 19:28

మనిషి సంతోషంగా జీవించడానికి, ఆనందంగా గడపడానికి మానసికంగా దృఢత్వాన్ని పెంచుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడానికి వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ అక్టోబర్ 10, 1992న స్థాపించడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని అక్టోబర్ 10న జరుపుకుంటాం.

Pages