S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

,
06/16/2016 - 22:12

సమాజ గమనంలో దాగివున్న ఒక అద్భుతమైన రహస్యాన్ని చాలామంది గుర్తించరు. మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకు ఖచ్చితమైన పరిష్కారం ఉండి తీరుతుంది. అయితే దాన్ని గుర్తించడానికి ఎక్కువమంది అసలు ప్రయత్నించరు. ఒకటి, రెండు మార్గాలలో ప్రయత్నించి, అందులో వైఫల్యం ఎదుర్కోగానే అన్ని అవకాశాలు మూసుకుపోయాయనే నిర్ణయానికి వస్తుంటారు. ఇది మంచిది కాదు
**

06/16/2016 - 04:15

పొత్తిళ్లల్లో పసిబిడ్డను చూసుకుని ముద్దులాడాల్సిన బాలింతలు అర్థాంతరంగా అశువులుబాస్తున్నారు. కడుపు పండినా పండంటి బిడ్డను కనే సమయంలో ఎన్నో సమస్యలు తలెత్తి మనదేశంలో ప్రతి ఐదు నిమిషాలకు ఒక బాలింత కన్నుమూస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 5,29,000 మంది బాలింతలు బలవుతుండగా.. ఇందులో మనదేశంలో మరణించేవారి సంఖ్య 1,36,000 అంటే 25.7శాతం అన్నమాట.

06/16/2016 - 04:10

ఇళ్లల్లోగానీ, ఆఫీసుల్లోగానీ ఏ చెత్తబుట్టలో చూసినా కనిపించేవి ప్లాస్టిక్ కవర్లు, గుట్కా కవర్లు, వక్కపొడి కవర్లు.. అంతా ప్లాస్టిక్ వేస్టుమయంగా ఉంటుంది. భూమిలో శిథిలమై కలిసిపోయే అలవాటు కూడా లేని ప్లాస్టిక్ వలన పర్యావరణానికి ఎంత హాని జరుగుతోందో ఎలుగెత్తి చాటడానికి బోలెడన్ని స్వచ్ఛంద సంస్థలు, మీడియా సంస్థలు పనిచేస్తున్నాయి. అయినా కూడా ప్రజల్లో మాత్రం సరైన అవగాహన రావడంలేదు.

06/14/2016 - 21:36

రక్తదానం ప్రాణదానంతో సమానమంటారు. కాని అదే దానం ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతుంటే.. అమ్మో ఈ నిజానే్న భరించలేం. కాని ఇది నమ్మలేని చేదు నిజం. రక్తదానం పేరుతో సేకరిస్తున్న రక్తాన్ని స్వీకరించినవారు ప్రాణాంతకమైన ఎయిడ్స్ బారినపడుతున్నారని ఒక సర్వేలో వెల్లడైంది. ఈ చేదు నిజాన్ని నిజం చేస్తూ..

,
06/11/2016 - 22:41

బిడ్డ పుట్టిన వెంటనే కెవ్వున కేక వేస్తే ఆ తల్లికి ఎంతో ఆనందం. పుట్టిన బిడ్డకు వెంటనే పాలివ్వాలని ఆరాటపడే తల్లి ఆ బిడ్డ ఏటేటా ఆరోగ్యంగా ఎదిగేందుకు అవసరమైన వ్యాక్సిన్లు కూడా ఇప్పించేందుకు ఆసక్తి కనబర్చటం లేదు. పిల్లలు వివిధ రకాల ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా, భవిష్యత్తులో ప్రాణంతకమైన జబ్బులు రాకుండా అవసరమయ్యే వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.

,
06/09/2016 - 21:56

‘విమర్శ’ అనేది నిజానికి చాలా కష్టమైన పనే అయినా కొంతమంది విషయంలో మాత్రం అది చిటికేసినంత తేలికైన పని. ఎందుకంటే వీళ్ళకు ఎదుటివాళ్ళను చీటికీ మాటికీ.. చిన్న చిన్న విషయాలకు విమర్శించడం అంటే మహా ఇష్టం.. మహా సరదా. దేవుడు మనిషికి నోరు ఇచ్చింది అడ్డదిడ్డంగా.. ఎలా పడితే అలా వాగటానికన్నట్లు ఇష్టమొచ్చినట్లు అనాలోచితంగా ఏదో ఒకటి ఎవరినో ఒకరిని అంటూనే వుంటారు. ‘ఒక వేలుతో ఎదుటివాడిని చూపిస్తే..

06/09/2016 - 04:22

గుడ్డు పెంకులపై అద్భుతాలను సృష్టిస్తున్నాడు ఈ యువకుడు. గుడ్డుఆరోగ్యానికే కాదు అందమైన ఆకృతులను తయారుచేయవచ్చు అని నిరూపిస్తున్నాడు. గుడ్డును వాడిన తరువాత పెంకులను పడేస్తుంటాం. కాని శంషుద్దీన్ షేక్ మాత్రం పదిలంగా దాచి అందమైన ఆకృతులతో మళ్లీ ప్రాణం పోస్తున్నాడు. గుడ్డుపై చేస్తున్న ఆర్ట్‌తో ఈ బెంగుళూరు యువకుడు ప్రపంచ రికార్డులు సృష్టించాడు. ఇప్పటివరకు పదిహేను ప్రదర్శనలు నిర్వహించాడు.

06/07/2016 - 22:37

తెలుగు రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టడం.. విభజనలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం.. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం పట్టించుకోపోవడం.. ఇవీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును వేధిస్తున్న అంశాలు. ఆ ఆవేదనే ఆయనలో కసి పెంచింది. అన్యాయంగా మిగిలిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని దేశం యావత్తు నివ్వెరపోయేలా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్నారు.

06/05/2016 - 05:32

సరదా సరదా సిగరెట్టు అంటూ ఈ వ్యసనానికి బానిసలవుతున్నవారు రోజురోజుకి అధికమవుతోంది. ధనిక, పేద అనే తేడా లేకుండా సరదాగా ప్రారంభించిన ఈ అలవాటును మానుకోలేక సతమతమవుతున్నారు. పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించుకోవాలని ఓవైపు వైద్యులు సూచిస్తున్నా..వీటి వాడకం ఏమాత్రం తగ్గకపోగా క్యాన్సర్‌లాంటి ప్రాణాంతక వ్యాధులు కొనితెచ్చుకుంటున్నారు. దక్షిణాఫ్రికాలో రోజుకు 109 సిగరెట్లు కాల్చటం అధికంగా గుర్తించారు.

06/03/2016 - 21:28

శత్రువును పసిగట్టే డేగ కళ్లు..చురుకైన చూపులు..చేతిలో తుపాకులతో కాపలాకాసే జవాన్లు. ఇది ఇండియా-నేపాల్ సరిహద్దుల్లో కనిపించే దృశ్యం. తీవ్రవాదులకు, క్రిమినల్స్‌కు ఆలవాలమైన ఈ ఓపెన్ బోర్డర్‌లో కోట్లాదిరూపాయలు విలువచేసే మాదకద్రవ్యాలు సైతం నిరంతరం రవాణా అవుతుంటాయి. సహజంగానే ఇలాంటి ప్రాంతాల్లో కనిపించే జవాన్లను పురుషులుగానే ఊహించుకుంటాం. కాని ఇక్కడ మనకు కనిపించేది మహిళా జవాన్లు.

Pages