S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

05/08/2016 - 01:03

అమ్మ ఒడే శిశువు చిరునవ్వుల మొదటి బడి. ఆ బడిలోనే ప్రతి శిశువు అవ్యాజ్యమైన ప్రేమను పొందుతూ పెరుగుతాడు. తల్లి అనంతమైన ప్రేమ, వాత్సల్యమే సృష్టి నిలిచి ఉండడానికి కారణమని చెప్పి తీరాలి. బిడ్డ జీవితంలో శక్తిని నెలకొల్పటానికి, ఆ శక్తికి ఒక దిశా నిర్దేశం నేర్పగల మహామూర్తి అమ్మ. ఉత్తమ ఆలోచనలు గల తల్లి పిల్లలను, నిరంతర విద్యార్థులని, జ్ఞాన సముపార్జన నిరంతర ప్రక్రియ అని సున్నితంగా తెలిపే అపురూప ఖని.

05/06/2016 - 21:20

‘బూస్ట్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ’ అనే ప్రకటనకు ఆకర్షితులై ఎంతోమంది తల్లులు తమ పిల్లలు గొప్ప క్రికెట్ ఆటగాడు కావాలని వందల రూపాయలు పోసి బూస్ట్ కొనుగోలు చేసేవారు ఈ దేశంలో కొదవలేదు.

05/05/2016 - 22:21

ఎవరన్నారు, ఆడది ఒంటరిగా ప్రయాణం చేయలేదని? అవకాశం రావాలేగాని అలవోకగా ప్రపంచాన్ని చుట్టి వచ్చేస్తుంది. ఈ మాటను అక్షరాలా నిజం చేసి చూపిన మహిళ మెహర్‌మూస్. మెహర్ హెరోయిస్ మూస్... సాహసానికి మారుపేరు. నిరంతరం ప్రయాణికురాలు. తన 70 ఏళ్ల జీవితంలో 181 దేశాలను చుట్టేసి వచ్చిన నిత్య యాత్రికురాలు. అంటార్కిటికా మంచు ఖండానికి వెళ్లిన తొలి భారతీయురాలు ఈమె.

05/03/2016 - 21:22

వివాహంలో వరుడు వధువు మెడలో కట్టే ‘మంగళసూత్రా’నికి లేక ‘మాంగల్యతంతు’నకే ‘మాంగల్యం’ అనేది సంక్షిప్తనామం.
‘వివాహం’లో వరుడు వధువు మెడలో ‘మాంగల్యం’ కడుతూ మూడు ముళ్లు వేయడం అనాదిగా వస్తున్న అద్భుత సంప్రదాయం.
మూడు ముళ్లు వేయడం ఎందుకు- అంటే, ఒక్కొక్క ముడితో ఒక్కొక్క వాగ్దానం చెయ్యలి కాబట్టి.

04/29/2016 - 21:46

భారతీయ సమాజంలో ఇంటి పనిలో భార్యకు సహాయపడటం పరువు తక్కువ పనిగా భావించే పురుషుల శాతం చాలా ఎక్కువ. మహిళలు వంట, పడకింటికి మాత్రమే పనికివస్తారనే దురభిప్రాయం కొంతమందిలో వుంది. ఇంటి పనిలో భార్యలకు సహాయపడేవారిని ఎద్దేవా చేయడం కూడా మనం తరచూ చూస్తూనే వుంటాం. అయితే భార్యాభర్తలనేవారు సంసారం అనే ఎద్దులబండికి కట్టబడిన జోడెద్దులు వంటివారనే విషయాన్ని విస్మరిస్తున్నారు.

04/28/2016 - 22:00

వేసవిలో ఉష్ణోగ్రతలు నానాటికి పెరిగిపోతున్నట్లే ఫ్యాషన్ ప్రపంచంలో సల్వార్ కమీజ్ కొత్త అందాలు చోటుచేసుకుంటున్నాయి. వొంటికి నప్పేలా..మనసుకు హాయినిచ్చే కాటన్ వస్త్రాలు ఈ కాలంలో కొత్త సొగసును అందిస్తాయి. అందులోనూ ఇది ఫంక్షన్ల సీజన్. అమ్మాయిలు సీతాకోక చిలుకల్లా సొగసుగా..సౌకర్యవంతంగా కనిపించాలంటే కాటన్ సల్వార్ కమీజ్‌లనే యువతులు, గృహిణులు ఇష్టపడుతుంటారు. వీటికి చెమటను పీల్చే గుణం అధికం.

04/28/2016 - 21:55

ఈమధ్య టీవీ మాధ్యమాలలో, పత్రికలలో శని శింగనాపూర్ గ్రామం పేరు ప్రస్ఫుటంగా కనబడుతోంది, వినబడుతోంది. ఆ ఊరిలోని శనీశ్వరాలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు. అయినా రేణుదేశాయ్ అనే మహిళ, భూమి సేన వ్యవస్థాపకురాలు నేతృత్వంలో ఆలయంల్ఘో ప్రవేశించడానికి ప్రయత్నించడం, అక్కడి గ్రామస్థులు ఆ ప్రయత్నాన్ని వమ్ము చేయడం జరిగింది. దీనిపై భూమిసేన కోర్టుకు వెళ్లగా హైకోర్టు ఆలయ ప్రవేశం ఆడవారికి నిషేధించరాదని తీర్పు ఇచ్చింది.

04/27/2016 - 23:50

స్ర్తిలకు సౌందర్యంతో విడదీయలేని సంబంధం ఉంది. నేటి ఆధునిక కాలంలో సైతం మహిళలు సౌందర్యం పట్ల ఆసక్తి చూపుతున్నారు. మహిళల సౌందర్యాన్ని ఇనుమడింపజేసేవాటిలో గాజుల పాత్ర అత్యంత కీలకమైనది. గాజులు ధరించడం అనేది భారతీయ సంప్రదాయంలో ఒక భాగం. ప్రస్తుతం పాశ్చాత్య దేశాలలో సైతం మహిళలు గాజులు ధరించడానికి ఆసక్తి చూపుతున్నారు.

04/26/2016 - 21:57

దేశ వ్యాప్తంగా ఎన్‌డిఎల్‌ఎం ప్రోగ్రామ్ ద్వారా 3,17,804
మంది శిక్షణ పొందారు.
ఇది 1191 సెంటర్లను ఏర్పాటు చేయగా.. నాస్కామ్ ఫౌండేషన్ సాయంతో డిజిటల్ పాఠాలు నేర్చుకున్న గృహిణులు నేడు అభివృద్ధిపథంలో పయనిస్తున్నారు. 2022నాటికి దేశం వ్యాప్తంగా
250 మిలియన్ మహిళలకు ఈ డిజిటల్ పాఠాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోంది.

04/23/2016 - 23:06

గురక పక్కవారికి శాపం అయితే, గురకతో నిద్రలో శ్వాస అందక ఉలికిపడి లేచేవారికి అది నరకం. అమెరికాలో ఓ భార్య తన భర్తతో విడాకులు కోరుతూ కోర్టుకి విజ్ఞప్తి చేసింది. ఎందుకు విడాకులని న్యాయమూర్తి అడిగితే దానికి కారణం తన భర్త పెట్టే గురక అని చెప్పింది. గత పదేళ్లుగా తనకి రాత్రిళ్లు నిద్రలేదని వాపోయింది.

Pages