S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిప్ర వాక్యం

02/19/2019 - 00:08

పాకిస్తాన్ కేంద్రంగా దాదాపు నలభై ఉగ్రవాద సంస్థలు మన దేశంలో నరమేధం సృష్టిస్తున్నాయి. తాజాగా జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో జైషే మహమ్మద్ నేతృత్వంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 44 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు మరణించడం పాక్ దుశ్చర్యలకు మరో తార్కాణం. ఈ దాడిని అనేక దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఐతే, ప్రపంచ చరిత్రను అధ్యయనం చేసిన వారికి ఇందులో విచిత్రం ఏమీ కనిపించదు.

02/12/2019 - 00:00

న్యాయస్థానాలు, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వంటి రాజ్యాంగబద్ధ సంస్థలను ఏ ముఖ్యమంత్రి అయినా ధిక్కరిస్తే భారత రాజ్యాంగాన్ని ఎదిరించినట్టే అవుతుంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కొందరు ముఖ్యమంత్రులు నేడు ఇష్టానుసారం వ్యవహరిస్తూ దేశ సార్వభౌమాధికారాన్ని అపహాస్యం చేస్తున్నారు.

02/04/2019 - 23:58

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ‘కాంగ్రెస్ ముక్త్భారత్’ అనే నినాదాన్ని వినిపించినా, ఆచరణలో అది సాధ్యపడలేదు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ మూడు రాష్ట్రాలూ భాజపా చేతి నుంచి జారిపోవడానికి అనేక కారణాలున్నాయి. ‘కాంగ్రెస్ ముక్త్భారత్’ సంగతేమో గానీ- ‘కమ్యూనిస్ట్ ముక్త్భారత్’ అనే మాట నిజం అవుతోంది.

01/29/2019 - 01:48

‘పేరులోనేమున్నది..? మల్లెను మల్లె అని గాక, మరొక పేరుతో పిలిచినా సువాసన తగ్గుతుందా?’ అన్నాడొక ఆంగ్లకవి. ప్రపంచంలో రకరకాల సంస్థలకు ఏవేవో పేర్లుంటాయి. వాటినిబట్టి మనం ఆ సంస్థ వౌలిక తత్త్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవటం సాధ్యం కాదు. కేరళలో ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ అనే సంస్థ ఉంది. పాపులర్ అంటే ప్రజాబాహుళ్యం ఆమోదం ఉన్న అని అర్థం. ఇందులో సభ్యులంతా ఉగ్రవాదులు, పచ్చిరక్తం తాగే కిరాతకులు.

01/22/2019 - 00:13

భారత రక్షణ రంగంలో అవినీతి కుంభకోణాలు చోటుచేసుకోవడం చాలా ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. స్వాతంత్య్రం వచ్చాక 1948లో ప్రథమ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో రక్షణ శాఖలో జీపుల కుంభకోణం మొదలైంది. దీనికి సూత్రధారి కేరళకు చెందిన అప్పటి రక్షణ మంత్రి వి.కె.కృష్ణమీనన్. ఆయన రెండు ఒప్పందాలను రక్షణ రంగానికి సంబంధించి కుదుర్చుకున్నాడు. అవి 25 మిషెల్ బాంబర్లు, రక్షణ రంగంలో వాడేందుకు కార్లు.

01/15/2019 - 01:25

మిషేల్ జేమ్స్ క్రిస్టియన్ బ్రిటీషు పౌరుడు. అమెరికాలోని స్పింక్స్ మెకానికా సంస్థకు దళారీగా పనిచేస్తున్నాడు. ఇతడు ఇండియాతో సహా చాలా దేశాలకు తన సంస్థ తరఫున హెలీకాప్టర్లు సరఫరా చేస్తుంటాడు. ఆ సందర్భంలో కొందరు ప్రముఖులకు తగిన రీతిలో ముడుపులు (కమీషన్లు) సమర్పించి కాంట్రాక్టులు తెచ్చుకుంటుంటాడు. ఇది అతని వ్యాపార రహస్యం.

01/01/2019 - 03:37

‘సెక్యులరిజం’ ముసుగులో మన రాజకీయ పార్టీలు గత డెబ్బది సంవత్సరాలుగా విషనాగును పాలు పోసి పోషించాయి. మరి.. అది కాటు వేయకుండా ఉంటుందా? మన దేశంలో భారీ విధ్వంసానికి ఐసిస్ ఉగ్రవాదులు కుట్ర పన్నారన్న విషయం తాజాగా బహిర్గతం కావడంతో ప్రజలంతా మరోసారి నివ్వెరపోయారు. జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు ఇటీవల 16 మంది ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేశారు.

12/25/2018 - 01:51

ఢిల్లీహైకోర్టు మొన్న ఒక తీర్పు వెలువరించింది. నేటికి ముప్పది నాలుగు సంవత్సరాల క్రితం - అంటే 1984లో శ్రీమతి ఇందిరాగాంధీ హత్య తరువాత జరిగిన అల్లర్లకు సంబంధించి నేరస్థులకు శిక్ష ఖరారు చేసింది. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, రాహుల్‌గాంధీకి ప్రియమిత్రుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అయిన సజ్జనకుమార్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

12/18/2018 - 01:57

అమెరికన్లు అమెరికాను ప్రేమిస్తారు... రష్యన్లు రష్యాను ఆరాధిస్తారు... బ్రిటీషువారు ‘రవి అస్తమించని’ సామ్రాజ్యం కోసం తహతహలాడుతారు... కానీ- భారతీయులు మాత్రం అమెరికాను, చైనాను, రష్యాను, సౌదీ అరేబియాను, జెరుసలేంను ప్రేమిస్తారు. జెరుసలేం ముత్తయ్యలు, వోల్గాలు, వాహెబ్ జరీనాలు ఇండియన్లు పెట్టుకునే గౌరవప్రదమైన పేర్లు. భారతీయులు భారత్‌ను ఎందుకు ప్రేమించడం లేదు? ఈ జాతి చేసుకున్న పాపం ఏమిటి?

12/11/2018 - 01:57

ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలు ఆచరణ సాధ్యం కాని విధంగా ఉంటున్నాయి. వివిధ పార్టీల ఎత్తులకు, అవకాశవాదానికి ఎన్నికల హామీలు అద్దం పడుతున్నాయి. అధికారంలోకి వచ్చాక రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలను ఏ మేరకు అమలు చేస్తున్నాయన్నది ప్రజలందరికీ తెలిసిందే. పోటాపోటీగా రాయితీలు, ఉచిత పథకాలు ఇస్తున్నా- వాటికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది.

Pages