S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిప్ర వాక్యం

04/09/2019 - 04:28

ఎన్నికల సమయంలో ప్రజలు సహజంగా ఏవో భావోద్రేకాలకు లోనై వోటు వేస్తుంటారు లేదా ఆర్థిక ప్రలోభాలకు లొంగి తమ ఓటును దుర్వినియోగం చేసుకుంటారు. ఇక విద్యాధికుల కథ మరో రకంగా ఉంటుంది. వీరు పత్రికలు చదువుతారు, టీవీలు చూస్తారు. పాలకుల దుష్ప్రవర్తనకు ఐదు సంవత్సరాలు రాత్రింబవళ్లు తిట్టుకుంటూ ఉంటారు. కాని పోలింగ్ రోజున ఓటింగ్‌కు వెళ్లరు. ‘పోటీలో ఉన్నవాళ్లంతా పనికిమాలిన వాళ్లే..

03/26/2019 - 02:00

బాలాకోట్‌లోని జైషే ఉగ్రవాద శిబిరాలపై మన వాయుసేన ఆకస్మిక దాడి జరిపిన తర్వాత దేశ రాజకీయ వాతావరణంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఈ పరిస్థితులు మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి ఉపకరిస్తాయని రాజకీయ విశే్లషకులు అంచనా వేస్తున్నారు. వాయుసేన జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో భాజపాకు అనుకూల పవనాలు వీస్తున్నాయన్న సర్వేలు వెలువడుతున్నాయి.

03/19/2019 - 01:11

భ్రమలు తొలగిపోయాయి.. చైనా ఎప్పటికీ భారత్‌తో మైత్రి నెరపజాలదని తేలిపోయింది. చైనాకు పాకిస్తాన్ వలస దేశం. అంచెలంచెలుగా భారత భూభాగాలను ఆక్రమించుకొని ఆసియాలో తన సార్వభౌమాధికారాన్ని స్థాపించుకోవడానికి చైనా యత్నిస్తోంది. ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తర తెలంగాణలోని నల్లమల, కేరళలోని మల్లపురం, వైనాడ్ ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాలను ఏర్పాటుచేసి భారత అంతర్గత భద్రతకు చైనా సవాలు విసిరింది.

03/12/2019 - 02:08

దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆందోళనలే, అల్లర్లే.

03/05/2019 - 02:05

మన దేశంలోని పంజాబ్ ప్రాంతం 1947లో విభజనకు గురైంది. సగ భాగం భారత్‌లోకి, మిగతా సగం పాకిస్తాన్‌లోకి వెళ్లింది. పంజాబ్‌లోని సింధు నదికి ఐదు పాయలున్నాయి. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ అని వీటికి పేర్లు. 1960లో అప్పటి ప్రధాని నెహ్రూ నేతృత్వంలో జరిగిన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌కు నదీ జలాలను ఉదారంగా విడుదల చేశారు. 750 మెట్రిక్ టన్నుల నీరు ఇండియా నుండి పాకిస్తాన్‌లోకి వెళ్తున్నది.

02/26/2019 - 04:42

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఫిబ్రవరి 20న మాట్లాడుతూ ‘‘ప్రతీకార దాడులపై భారత్ చర్య తీసుకుంటే సహించం’’ అని హెచ్చరించారు. ఈ వాక్యానికి అర్థం ఏమిటి? పాకిస్తాన్ నిరంతరం డెబ్బది సంవత్సరాలుగా భారత్‌పై దాడులు చేస్తూనే ఉంది.

02/19/2019 - 00:08

పాకిస్తాన్ కేంద్రంగా దాదాపు నలభై ఉగ్రవాద సంస్థలు మన దేశంలో నరమేధం సృష్టిస్తున్నాయి. తాజాగా జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో జైషే మహమ్మద్ నేతృత్వంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 44 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు మరణించడం పాక్ దుశ్చర్యలకు మరో తార్కాణం. ఈ దాడిని అనేక దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఐతే, ప్రపంచ చరిత్రను అధ్యయనం చేసిన వారికి ఇందులో విచిత్రం ఏమీ కనిపించదు.

02/12/2019 - 00:00

న్యాయస్థానాలు, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వంటి రాజ్యాంగబద్ధ సంస్థలను ఏ ముఖ్యమంత్రి అయినా ధిక్కరిస్తే భారత రాజ్యాంగాన్ని ఎదిరించినట్టే అవుతుంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కొందరు ముఖ్యమంత్రులు నేడు ఇష్టానుసారం వ్యవహరిస్తూ దేశ సార్వభౌమాధికారాన్ని అపహాస్యం చేస్తున్నారు.

02/04/2019 - 23:58

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ‘కాంగ్రెస్ ముక్త్భారత్’ అనే నినాదాన్ని వినిపించినా, ఆచరణలో అది సాధ్యపడలేదు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ మూడు రాష్ట్రాలూ భాజపా చేతి నుంచి జారిపోవడానికి అనేక కారణాలున్నాయి. ‘కాంగ్రెస్ ముక్త్భారత్’ సంగతేమో గానీ- ‘కమ్యూనిస్ట్ ముక్త్భారత్’ అనే మాట నిజం అవుతోంది.

01/29/2019 - 01:48

‘పేరులోనేమున్నది..? మల్లెను మల్లె అని గాక, మరొక పేరుతో పిలిచినా సువాసన తగ్గుతుందా?’ అన్నాడొక ఆంగ్లకవి. ప్రపంచంలో రకరకాల సంస్థలకు ఏవేవో పేర్లుంటాయి. వాటినిబట్టి మనం ఆ సంస్థ వౌలిక తత్త్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవటం సాధ్యం కాదు. కేరళలో ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ అనే సంస్థ ఉంది. పాపులర్ అంటే ప్రజాబాహుళ్యం ఆమోదం ఉన్న అని అర్థం. ఇందులో సభ్యులంతా ఉగ్రవాదులు, పచ్చిరక్తం తాగే కిరాతకులు.

Pages