S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిప్ర వాక్యం

01/22/2019 - 00:13

భారత రక్షణ రంగంలో అవినీతి కుంభకోణాలు చోటుచేసుకోవడం చాలా ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. స్వాతంత్య్రం వచ్చాక 1948లో ప్రథమ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో రక్షణ శాఖలో జీపుల కుంభకోణం మొదలైంది. దీనికి సూత్రధారి కేరళకు చెందిన అప్పటి రక్షణ మంత్రి వి.కె.కృష్ణమీనన్. ఆయన రెండు ఒప్పందాలను రక్షణ రంగానికి సంబంధించి కుదుర్చుకున్నాడు. అవి 25 మిషెల్ బాంబర్లు, రక్షణ రంగంలో వాడేందుకు కార్లు.

01/15/2019 - 01:25

మిషేల్ జేమ్స్ క్రిస్టియన్ బ్రిటీషు పౌరుడు. అమెరికాలోని స్పింక్స్ మెకానికా సంస్థకు దళారీగా పనిచేస్తున్నాడు. ఇతడు ఇండియాతో సహా చాలా దేశాలకు తన సంస్థ తరఫున హెలీకాప్టర్లు సరఫరా చేస్తుంటాడు. ఆ సందర్భంలో కొందరు ప్రముఖులకు తగిన రీతిలో ముడుపులు (కమీషన్లు) సమర్పించి కాంట్రాక్టులు తెచ్చుకుంటుంటాడు. ఇది అతని వ్యాపార రహస్యం.

01/01/2019 - 03:37

‘సెక్యులరిజం’ ముసుగులో మన రాజకీయ పార్టీలు గత డెబ్బది సంవత్సరాలుగా విషనాగును పాలు పోసి పోషించాయి. మరి.. అది కాటు వేయకుండా ఉంటుందా? మన దేశంలో భారీ విధ్వంసానికి ఐసిస్ ఉగ్రవాదులు కుట్ర పన్నారన్న విషయం తాజాగా బహిర్గతం కావడంతో ప్రజలంతా మరోసారి నివ్వెరపోయారు. జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు ఇటీవల 16 మంది ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేశారు.

12/25/2018 - 01:51

ఢిల్లీహైకోర్టు మొన్న ఒక తీర్పు వెలువరించింది. నేటికి ముప్పది నాలుగు సంవత్సరాల క్రితం - అంటే 1984లో శ్రీమతి ఇందిరాగాంధీ హత్య తరువాత జరిగిన అల్లర్లకు సంబంధించి నేరస్థులకు శిక్ష ఖరారు చేసింది. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, రాహుల్‌గాంధీకి ప్రియమిత్రుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అయిన సజ్జనకుమార్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

12/18/2018 - 01:57

అమెరికన్లు అమెరికాను ప్రేమిస్తారు... రష్యన్లు రష్యాను ఆరాధిస్తారు... బ్రిటీషువారు ‘రవి అస్తమించని’ సామ్రాజ్యం కోసం తహతహలాడుతారు... కానీ- భారతీయులు మాత్రం అమెరికాను, చైనాను, రష్యాను, సౌదీ అరేబియాను, జెరుసలేంను ప్రేమిస్తారు. జెరుసలేం ముత్తయ్యలు, వోల్గాలు, వాహెబ్ జరీనాలు ఇండియన్లు పెట్టుకునే గౌరవప్రదమైన పేర్లు. భారతీయులు భారత్‌ను ఎందుకు ప్రేమించడం లేదు? ఈ జాతి చేసుకున్న పాపం ఏమిటి?

12/11/2018 - 01:57

ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలు ఆచరణ సాధ్యం కాని విధంగా ఉంటున్నాయి. వివిధ పార్టీల ఎత్తులకు, అవకాశవాదానికి ఎన్నికల హామీలు అద్దం పడుతున్నాయి. అధికారంలోకి వచ్చాక రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలను ఏ మేరకు అమలు చేస్తున్నాయన్నది ప్రజలందరికీ తెలిసిందే. పోటాపోటీగా రాయితీలు, ఉచిత పథకాలు ఇస్తున్నా- వాటికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది.

12/04/2018 - 03:14

రాజస్థాన్‌లోని పుష్కర్ క్షేత్రంలో ప్రాచీన శివాలయానికి కార్తీక పూర్ణిమ నాడు ఒకాయన అభిషేకం చేయడానికి వచ్చాడు. ‘మీ గోత్రనామాలు చెప్పండి’ అని ఆయనను అక్కడున్న పూజారి అడిగాడు. ఆ వ్యక్తి ‘దత్తాత్రేయ గోత్రోద్భవస్య రాహుల్ వర్మ నామధేయస్య’అని చెప్పాడు. అలా గోత్రనామాలు చెప్పిన వ్యక్తి ఎవరో కాదు.. సాక్షాత్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ అసలు పేరు రాహుల్ శర్మ అయితే మనం ఆనందించవలసిందే.

11/20/2018 - 00:34

కేరళలో ఇటీవలి జల ప్రళయాన్ని ‘మానవుడి స్వయం కృతాపరాధం’ అన్నారు పర్యావరణ శాస్తవ్రేత్తలు. ఆ రాష్ట్ర బయో డైవర్సిటీ సంస్థ చైర్మన్ వి.ఎస్.విజయన్ మాత్రం- ‘గాడ్గిల్ నివేదికను తిరస్కరంచటమే ఈ జల ప్రళయానికి కారణం’ అని తేల్చారు. పడమటి కనుమలలో ఏటవాలు ప్రాంతాల్లో పంటలకు బదులు పండ్లచెట్లను పెంచి ఉండాలని ఆయన సూచించారు.

11/13/2018 - 00:26

విన్‌స్టన్ చర్చిల్ ఎందుకు గొప్పవాడు? సమర్ధవంతంగా బ్రిటన్‌ను పాలించినందుకా? జాతిని చైతన్యపరిచే ప్రసంగాలు చేసినందుకా? కాదు.. సత్యం చెప్పినందుకు. మహాత్మా గాంధీతో ఆయన ఓ సందర్భంలో- ‘్భరతీయులు తమను తాము పరిపాలించుకోజాలరు. మీరు ఇతరుల చేత పాలించబడేందుకే పుట్టారు. ఒకవేళ మేం స్వాతంత్య్రం ఇచ్చినా దాన్ని మీరు నిలుపుకోజాలరు’ అన్నాడు.

11/06/2018 - 01:46

ఒకప్పుడు రష్యాను ‘్భలోక స్వర్గం’ అంటూ మనదేశంలోని కమ్యూనిస్టులు అభివర్ణించేవారు. రష్యా విచ్ఛిత్తి తర్వాత ఇప్పుడు చైనా ‘్భతల స్వర్గం’ అని వామపక్షవాదులు కొత్త పల్లవి అందుకున్నారు. రష్యాలో స్టాలిన్ అధికారంలోకి రాగానే మాస్కోలో కొన్ని వందల చర్చిలు నేలమట్టమైన సంగతి చరిత్ర. టిబెట్‌ను చైనా ఆక్రమించుకున్నాక ఆరు లక్షల బౌద్ధవిహారాలు నేలమట్టమయ్యాయి. కాగా, గత నెల 26న ప్రపంచవ్యాప్తంగా ఒక వార్త ప్రచారమైంది.

Pages