S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాస్కర వాణి

01/31/2019 - 22:55

ఇజ్రాయిల్ స్వతంత్ర దేశంగా ఏర్పడ్డాక అక్కడి ప్రజాప్రతినిధుల మొదటి సభ ఓ ఆశ్చర్యకరమైన వ్యాఖ్య చేసింది. ‘్భరత్‌కు ధన్యవాదాలు.. ప్రపంచంలోని అన్ని వర్గాలచే అత్యాచారానికి గురైన మా జాతి, ఒక్క భారత్ నుండే అలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు..’ అన్న ఆ మాటను ఒక్కసారి- భారత్‌ను, హిందుత్వను ధ్వంసం చేయాలనుకొనే శక్తులు గుర్తుతెచ్చుకోవాలి.

01/24/2019 - 23:10

‘శత్రువును జయించాలంటే యుద్ధం చేయాల్సిన అవసరం లేదు; దుష్ప్రచారం చేస్తే సరిపోతుంది’ అన్న సూత్రం కొన్ని రాజకీయ పక్షాలకు బాగా వంటబట్టింది. దేశంలో సరికొత్త అనుమానాలను పుట్టించి ప్రజల్లో ఆందోళన కలిగించడం రాజకీయ వ్యూహం. కానీ, ప్రజాస్వామ్యం పరువు బజారున పడుతోందన్న విషయాన్ని వీళ్లు విస్మరించారు. వాళ్లకు అధికారం తప్ప దేశం అవసరం లేదు. ఎలాంటి ధ్వంసరచన చేసైనా గద్దెనెక్కడం అధికార దాహార్తుల అసలు లక్ష్యం.

01/18/2019 - 02:16

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు మరణించడానికి పదిరోజుల ముందు కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చివరి రోజుల్లో తాను విడుదల చేసిన ఓ క్యాసెట్టుకు ‘జామాతా దశమగ్రహం’ అని పేరు కూడా పెట్టారు.

01/11/2019 - 01:26

నియంత అడాల్ఫ్ హిట్లర్ ప్రజల్లో తన పలుకుబడి సన్నగిల్లినప్పుడల్లా తన అనుచరులకు ‘దేశం ప్రమాదంలో ఉందని పదే పదే ప్రచారం చేయండి’ అని చెప్పేవాడట. ఒకే అబద్ధాన్ని వందలసార్లు చెప్పి కొంతమందికైనా అది నిజం అనిపించేటట్లు చేయడం హిట్లర్ విధానం. ఈ అబద్ధపు ప్రచారం ఎక్కువగా తన ముఖ్య అనుచరుడైన గోబెల్స్‌తో చేయించేవాడు. దీనికే ‘గోబెల్స్ ప్రచారం’ అని పేరు.

01/04/2019 - 01:54

సెక్యులర్ రాజనీతి వ్యవస్థలో కులం, మతం, ప్రాంతం, భాష, ఉత్తర- దక్షిణ, ఆర్య-ద్రవిడ.. ఇలా ఎన్నో విధ్వంసకర ఆయుధాలుంటాయి. వీటిని ఆ ‘సెక్యులర్ గుంపు’ ప్రత్యర్థులపై ప్రయోగిస్తుంది. నేడు ‘సెక్యులర్’ ముసుగులో బతికే అన్ని రాజకీయ వ్యవస్థలకు వేర్లు బలంగానే వున్నాయి. కళలు, సాహిత్యం, పాత్రికేయ, మేధారంగంలో వాళ్లకు ‘రెడీమేడ్ సిలబస్’ ఉంది. కానీ, జాతీయవాద దృక్పథం వున్న పార్టీలకు వాటి లోతుపాతులు తెలియవు.

12/28/2018 - 00:53

హైదరాబాద్‌లో ప్రముఖ మిఠాయి వ్యాపారస్తుడైన జి.పుల్లారెడ్డి దగ్గరకు ఓసారి కొందరు వ్యక్తులు దేవాలయ నిర్మాణానికి చందా కోసమనివచ్చారట. వచ్చినవారు అరవై మందికి పైగా ఉన్నారట. వెంటనే పుల్లారెడ్డి- ‘నేను చందా ఇస్తాను సరే.. మరి మీ దేవాలయంపై ఎవరైనా దాడికి దిగితే ఏం చేస్తారు?’ అని ప్రశ్నించడంతో వాళ్ళు కంగుతిని వౌనంగా నిల్చున్నారట.

12/21/2018 - 01:23

ఆపరేషన్ థియేటర్లో రోగి కళ్లు తెరవగానే వై ద్యుడు- ‘ఓ శుభవార్త ఉంది, ఓ దుర్వార్త ఉంది- రెండింటిలో ఏది ముందు చెప్పమంటావ్?’ అని అడిగాడట. మొదట దుర్వార్తనే చెప్పండని ఆ రోగి కోరాడట. ‘నీ రెండు కాళ్లు మోకాళ్ల వరకు పాడైనందున ఆపరేషన్ చేసి తొలగించాం! ఇదే దుర్వార్త’ అన్నాడు డాక్టర్. ‘శుభవార్త ఏంటా?’ అని ఎదురు చూస్తున్నట్లు రోగి చూపులను గమనించి- ‘నీ చెప్పులను పక్కనున్న పేషంట్ కొనడానికి సిద్ధంగా ఉన్నాడు.

12/14/2018 - 02:12

తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ విధ్వంసాన్ని తేలిగ్గా తనకు అనుకూలంగా మలచుకోగల నేత ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే. విచిత్రమో, విధి నిర్ణయమో చెప్పలేం గాని ప్రతీ విధ్వంసం తర్వాత లాభపడేది ఆయనే. కుప్పకూలిన కోటగోడల్లో శిథిలాల మధ్య కూర్చొని ఏడ్చేవాళ్లు ఏడుస్తుంటే దానినుండి ‘పసుపుపచ్చని’ మొక్కలను పుట్టించడం ఆయన ఘనత. అప్పట్లో ఎన్టీఆర్ ఇంకో ఆరునెలలు బతికుంటే ఏం జరిగేదో ఊహంచలేం.

11/16/2018 - 00:05

ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు ప్రశ్నిస్తూ ‘మీ తాత ఇంత గొప్ప గురువుకదా? ఆయన పెళ్లెందుకు చేసుకున్నాడు?’ అన్నాడట. ‘ఆయన పెళ్లి చేసుకొని ఉండకపోతే నేను పుట్టేవాణ్ణేకాదు, మీకు ఈ ప్రశ్న అడిగే అవకాశం ఉండేదీ కాదు’ అని బదులిచ్చాడట విద్యార్థి. ఇటీవల మూడో కూటమి గురించి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం ఇంతే గొప్పగా సెలవిస్తున్నది!

11/02/2018 - 00:32

ఇటీవల ప్రసార మాధ్యమాల్లో చాలా తెలివిగా ‘హిందుత్వ’ను ధ్వంసం చేసే కార్యక్రమాల్లో ‘దొంగబాబాలంటూ’ మొత్తానికి మొత్తం ఆధ్యాత్మిక గురువులపై ఏకపక్షంగా నిందలేస్తున్నారు. ‘హిందూమతం’ అనగానే శంకరాచార్యుల దగ్గర నుండి శివసత్తుల వరకు అందరిలోనూ తప్పులు వెతికేవాళ్లు ఎక్కువయ్యారు. ప్రశ్నలు వేసేవాళ్లు హిందుత్వను సంస్కరించాలని కాకుండా ద్వేషించేవారిలా ప్రవర్తిస్తున్నారు.

Pages