S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాస్కర వాణి

05/31/2018 - 23:51

అది 1930-31 కాలంలో జరిగిన సంఘటన. నాగపూర్‌కు చెందిన బచ్‌రాజ్ వ్యాస్ అనే విద్యార్థి ఆర్‌ఎస్‌ఎస్ శిక్షణ శిబిరానికి వెళ్లాలనుకొన్నాడు. ఆ కుర్రాడిది బ్రాహ్మణ కుటుంబం. బయట భోజనం చేయకూడదనే ఆంక్షలు వాళ్లింట్లో ఉండేవి. వ్యాస్ ఎలాగైనా శిబిరంలో పాల్గొనాలనే ఉబలాటంతో తన ఇంట్లో నియమాన్ని సంఘ్ వ్యవస్థాపకులు డా హేడ్గేవార్‌తో చెప్పుకొన్నాడు.

05/25/2018 - 00:10

భారత్‌లో హిందువుల సాకార ఆరాధ్య స్థానం దేవాలయం. దైవభక్తి ప్రేరణ కోసం, ధర్మప్రచారం కోసం ఎన్నో ఆలయాలు మన దేశంలో నిర్మించబడ్డాయి. అన్ని వర్గాలవారూ సమష్టిగా దైవారాధన చేయాలనే సదుద్దేశంతో చక్రవర్తులు, దాతలు భారీ సంఖ్యలో వీటిని నిర్మించారు, ఇప్పుడు కూడా నిర్మిస్తున్నారు. కైలాస మానస సరోవర యాత్ర, వైష్ణోదేవి దర్శనయాత్ర, చార్‌ధామ్ యాత్ర మనకున్న దర్శనాల ఉత్సుకతను తెలియజేస్తాయి.

05/18/2018 - 04:57

‘‘విజయం ముంగిట బొక్క బోర్లాపడ్డ బిజెపి అతి పెద్ద పార్టీగా నిలిచి సంతృప్తిచెందింది’’- ఇది నిన్నటి కర్నాటక ప్రజల తీర్పుపై తెలుగునాట ఓ మీడియా సంస్థ వ్యాఖ్యానం. కన్నడనాట ఫలితాలు వెలువడిన రోజే ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం వారణాసిలో పైవంతెన కూలిపోయి 18 మంది దుర్మరణం చెందారు.

05/11/2018 - 00:15

ఇటీవల మన మేధావులంతా సైంటిస్టులుగా మారిపోయారు. ఈ ‘సూడో సైంటిస్టుల’ కనుసన్నల్లో నడిచే కొన్ని ప్రసార మాధ్యమాలు, పత్రికలు ఐన్‌స్టీన్‌కు అసలైన వారసుల మాదిరి మాట్లాడడం విడ్డూరం. ‘్భరతీయత’ ప్రాముఖ్యతను చెప్పే ఏ విషయాన్ని అయినా వీరు ఛాందసమన్నట్లుగా ఊదరగొడుతున్నారు. ప్రపంచంలో ప్రతి దేశం తన వారసత్వ ఘనతను గౌరవిస్తుంది, కీర్తిస్తుంది.

05/03/2018 - 23:35

ఇంట్లో భార్యాభర్తలు గొడవపడుతూ తారస్థాయికి వెళ్లారట. భార్య వైపు చూస్తూ భర్త- ‘నీ విషయంలో తప్పు చేస్తే నేను వెంటనే చచ్చిపోవాలి’ అన్నాడట. వెంటనే భార్య అందుకుని- ‘నేను గనుక నీ విషయంలో ఏదైనా పొరపాటు చేస్తే నా తాళి వెంటనే తెగిపోవాలి’ అన్నదట. అంటే- ఏ రకంగానైనా భర్త చావే నిర్ణయమైందన్నమాట!

04/26/2018 - 23:06

ఒక పట్టణంలో వ్యాపారి అయిన జీర్ణ్ధనుడు ఆర్థికంగా నష్టపోయి, తిరిగి సంపాదించడానికై ఇతర ప్రాంతాలకు వెళ్లాడు. చివరకు తనకు మిగిలిన ఇనుప దూలాన్ని తన స్నేహితుడైన లక్ష్మణ్ దగ్గరుంచి భద్రపరచమని చెప్పి వెళ్లాడు. కొన్నాళ్ళకు తిరిగి వచ్చి తన ఇనుప దుంగను తిరిగి ఇవ్వమన్నాడు. ‘మిత్రమా! ఇనుప దుంగను ఎలుకలు తినేశాయి’ అన్నాడు లక్ష్మణ్. ‘అయ్యో!

04/19/2018 - 23:37

1952 అక్టోబర్ చివర్లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అస్సాం పర్యటనకు వెళ్తూ, మధ్యలో కొద్దిసేపు కలకత్తాలో ఆగాడు. తూర్పు బెంగాల్‌లో అల్పసంఖ్యాకులైన హిందువులపై ఘోరమైన అకృత్యాలు జరుగుతున్న సమయం అది. ఈ విషయంలో పాకిస్తాన్‌తో దృఢ వైఖరి అవలంబించాలని జాతీయవాద నేత శ్యాంప్రసాద్ ముఖర్జీ అక్కడ నెహ్రూకు విజ్ఞాపన పత్రం సమర్పించాడు.

04/13/2018 - 00:31

అంబేడ్కర్‌ను ముందుబెట్టి ఇటీవలి కాలంలో విదేశీ మతాలకు అమ్ముడుపోయిన కొందరు
మేధావులు రాజకీయం చేస్తున్నారు. యాకూబ్ మెమెన్ లాంటి కరడుగట్టిన ఉగ్రవాదులకు

04/05/2018 - 23:32

ఒకసారి క్రైస్తవ మతపెద్ద పోప్ విదేశీ పర్యటనకు సిద్ధమయ్యాడట. వెళ్లే ముందు ఆయన అనుచరులు- ‘అక్కడ మీడియా ప్రశ్నలతో ఇబ్బంది పెట్టవచ్చు. వారితో మాట్లాడేటపుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి’ అని చెప్పి పంపారట. పోప్ విమానాశ్రయంలో దిగగానే విలేఖరులు ఆయనను చుట్టుముట్టి ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టారు. చాలా ప్రశ్నలకు ఆయన వౌనంతోనే సమాధానం ఇచ్చారు. చివరకు ఓ విలేఖరి ‘‘పోప్ గారూ!

03/30/2018 - 00:08

ప్రధాని నరేంద్ర మోదీ గతంలో గుజరాత్ భాజపా కార్యదర్శిగా నియమితులైనపుడు- ఒక స్థానిక పత్రికా విలేఖరి ఆయన గదికి మాట్లాడటానికి వచ్చాడట. మాటలన్నీ అయ్యాక వారిద్దరూ ‘చాయ్’ తాగుదామనుకొన్నారట. ఆ విలేఖరి- ‘మోదీ చుట్టూ ఎంతమంది పనివాళ్ళు ఉన్నారో..’ అని అనుకొని చాయ్ తెప్పించమన్నాడు. వెంటనే మోదీ బయటకు వెళ్లి చాయ్ తెచ్చి ఇవ్వగానే ఆయన నిరాడంబరతకు విలేఖరి విస్మయం చెందాడట!

Pages