S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాస్కర వాణి

12/28/2018 - 00:53

హైదరాబాద్‌లో ప్రముఖ మిఠాయి వ్యాపారస్తుడైన జి.పుల్లారెడ్డి దగ్గరకు ఓసారి కొందరు వ్యక్తులు దేవాలయ నిర్మాణానికి చందా కోసమనివచ్చారట. వచ్చినవారు అరవై మందికి పైగా ఉన్నారట. వెంటనే పుల్లారెడ్డి- ‘నేను చందా ఇస్తాను సరే.. మరి మీ దేవాలయంపై ఎవరైనా దాడికి దిగితే ఏం చేస్తారు?’ అని ప్రశ్నించడంతో వాళ్ళు కంగుతిని వౌనంగా నిల్చున్నారట.

12/21/2018 - 01:23

ఆపరేషన్ థియేటర్లో రోగి కళ్లు తెరవగానే వై ద్యుడు- ‘ఓ శుభవార్త ఉంది, ఓ దుర్వార్త ఉంది- రెండింటిలో ఏది ముందు చెప్పమంటావ్?’ అని అడిగాడట. మొదట దుర్వార్తనే చెప్పండని ఆ రోగి కోరాడట. ‘నీ రెండు కాళ్లు మోకాళ్ల వరకు పాడైనందున ఆపరేషన్ చేసి తొలగించాం! ఇదే దుర్వార్త’ అన్నాడు డాక్టర్. ‘శుభవార్త ఏంటా?’ అని ఎదురు చూస్తున్నట్లు రోగి చూపులను గమనించి- ‘నీ చెప్పులను పక్కనున్న పేషంట్ కొనడానికి సిద్ధంగా ఉన్నాడు.

12/14/2018 - 02:12

తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ విధ్వంసాన్ని తేలిగ్గా తనకు అనుకూలంగా మలచుకోగల నేత ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే. విచిత్రమో, విధి నిర్ణయమో చెప్పలేం గాని ప్రతీ విధ్వంసం తర్వాత లాభపడేది ఆయనే. కుప్పకూలిన కోటగోడల్లో శిథిలాల మధ్య కూర్చొని ఏడ్చేవాళ్లు ఏడుస్తుంటే దానినుండి ‘పసుపుపచ్చని’ మొక్కలను పుట్టించడం ఆయన ఘనత. అప్పట్లో ఎన్టీఆర్ ఇంకో ఆరునెలలు బతికుంటే ఏం జరిగేదో ఊహంచలేం.

11/16/2018 - 00:05

ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు ప్రశ్నిస్తూ ‘మీ తాత ఇంత గొప్ప గురువుకదా? ఆయన పెళ్లెందుకు చేసుకున్నాడు?’ అన్నాడట. ‘ఆయన పెళ్లి చేసుకొని ఉండకపోతే నేను పుట్టేవాణ్ణేకాదు, మీకు ఈ ప్రశ్న అడిగే అవకాశం ఉండేదీ కాదు’ అని బదులిచ్చాడట విద్యార్థి. ఇటీవల మూడో కూటమి గురించి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం ఇంతే గొప్పగా సెలవిస్తున్నది!

11/02/2018 - 00:32

ఇటీవల ప్రసార మాధ్యమాల్లో చాలా తెలివిగా ‘హిందుత్వ’ను ధ్వంసం చేసే కార్యక్రమాల్లో ‘దొంగబాబాలంటూ’ మొత్తానికి మొత్తం ఆధ్యాత్మిక గురువులపై ఏకపక్షంగా నిందలేస్తున్నారు. ‘హిందూమతం’ అనగానే శంకరాచార్యుల దగ్గర నుండి శివసత్తుల వరకు అందరిలోనూ తప్పులు వెతికేవాళ్లు ఎక్కువయ్యారు. ప్రశ్నలు వేసేవాళ్లు హిందుత్వను సంస్కరించాలని కాకుండా ద్వేషించేవారిలా ప్రవర్తిస్తున్నారు.

10/26/2018 - 01:18

రాజగృహంలోని సాలవతి అనే పరిచారిక పుత్రు డు జీవకుడు. అతడు రాజ కుమారుడైన అభయుని చేతిలో పెరిగాడు. కొన్నాళ్లకు జీవకుడు ఏదైనా కళను అభ్యాసం చేయాలని సంకల్పించి తక్షశిల విశ్వవిద్యాలయానికి వెళ్లాడు. గొప్ప ఆయుర్వేద పండితుని దగ్గర శిష్యుడై ఏడేండ్లు విద్యాభ్యాసం చేశాడు. తన విద్యాభ్యాసం ఎప్పుడు పూర్తవుతుందని గురువును అడిగినపుడు- ఆయన ఓ పరీక్ష పెట్టాడు.

10/12/2018 - 00:15

ఒకఫ్పుడు దసరా పండుగ వచ్చిందంటే చాలా ఉత్సాహం, ఉత్సుకత ఉండేవి. సెలవుల్లో పల్లెలకు చేరాలనే ఉబలాటం పిల్లలకూ, పెద్దలకూ ఉండేది. పట్టణాల్లో స్థిరపడిన వ్యక్తులు కూడా పెట్టేబేడా సర్దుకొని ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పల్లె దారి పట్టేవారు. ‘బతుకమ్మ’ ఆడే అక్కాచెల్లెళ్ల కోసం అడవంతా గాలించి సోదరులు గోరింట పువ్వులు, బీర, కట్లపూలు, గునుగు, గుమ్మడి, టేకు, అల్లిపూలు తెచ్చి పెట్టేవారు.

10/05/2018 - 02:04

సోప్ అనే మేధావి చెప్పిన ఓ కల్పిత కథ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఓ అరణ్యంలో సింహం తనకు కన్పించిన ప్రతి జంతువునూ ‘ఈ అడవికి నేను రాజునా? కాదా?’ అని అడిగేది. అన్ని జంతువులూ ‘నీవే రాజువు’ అని సమాధానమిచ్చేవి. ఓ రోజు చిరుతపులిని అడిగినా అది కూడా సంకోచిస్తూ ‘నీవే రాజువు’ అన్నది. చివరకు ఏనుగును అడిగింది. వెంటనే ఏనుగు సింహాన్ని దూరంగా విసిరేసింది. ‘ఓ గజరాజా! నీకు సమాధానం తెలియకపోతే తెలియదని చెప్పవచ్చు.

09/28/2018 - 00:01

కుఛ్ ఆర్జూ నహీహై, హై ఆర్జూతో యహ్ హై
రఖ్‌దే కోరుూ జరాసీ ఖాక్ వతన్‌కీ కఫ్‌న్‌మే
నాకు ఇతరమైన ఏ కోరికా లేదు; ఉన్నదల్లా ఒక్కటే. నా శవాన్ని కప్పే వస్త్రం (కఫన్)లో ఎవరైనా కొద్దిగా నా దేశపు మట్టిని పెడితే చాలు.

09/21/2018 - 00:46

‘ప్రతీది గంగా తీరం నుండి మాకు వచ్చింది’’ అని పాశ్చాత్య మేధావి ఫ్రాంకోయిస్ వాల్టేర్ అం టాడు. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతల్లో భారతీయ సంస్కృతి ముందు ఉంటుంది. గ్రీకు, రోమన్ నాగరికతలు క్రైస్తవ మత విస్తృతి తర్వాత కనుమరుగైపోయాయి. ఆసియాఖండ దీపంగా పేరొందిన బౌద్ధతత్త్వం ఇస్లాం దండయాత్రల తర్వాత నామమాత్రంగా మిగిలింది. రెండు వేల ఏళ్లలో అన్ని బాధలను తట్టుకొని నిలబడినవి భారతీయ, చైనా సంస్కృతులే.

Pages